రిక్షా కార్మికుడి అదృశ్యం
శంషాబాద్ (రంగారెడ్డి): ఓ రిక్షా కార్మికుడు అదృశ్యమైన సంఘటన ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలో వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముండే మంగారి జంగయ్య (35) శంషాబాద్ మార్కెట్లో రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న ఉదయం మార్కెట్కు బయలుదేరిన అతడు ఎంతకి తిరిగి రాకపోవడంతో అన్ని చోట్లా వెతికారు. ఆచూకి లభించకపోవడంతో ఆదివారం జంగయ్య భార్య శారద ఆర్జీఐఏ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.