mithunreddi
-
అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం
చిట్వేలి: సమాజంలో బడుగు, బలహీన అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. చిట్వేలి మండలం యన్.ఉప్పరపల్లెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయక పోయినా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు నాయకులు గణాంకాలతో గొప్పలు చెప్పుకుంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, నాయకులు చొప్పా వెంకటరెడ్డి, మహేష్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, చంగల్‌రెడ్డి, రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గౌసియా, నరసింహులు, కరిముల్లాఖాన్, బషీరుద్దీన్, వెంకటరమణ, లోకేష్, పద్మాకర్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకుడి మృతి
మదనపల్లె: వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకులు ఎన్.బాబు శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన డీసీసీ ఉపాధ్యక్షునిగా, మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్టుకు ప్రయత్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దేశాయ్ తిప్పారెడ్డి విజయానికి కృషి చేశారు. బాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతాపం: ఎన్.బాబు ఆకస్మిక మరణంపట్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమనకరుణాకరరెడ్డి బాబు భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ సాయిప్రతాప్ కుటుం బ సభ్యులతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు నరేష్‌కుమార్‌రెడ్డి, గుండ్లూరి ముజీబ్‌హుసేన్, మాజీ చైర్పర్సన్ గుండ్లూరి షమీంఅస్లాం, వైఎస్సార్సీపీ జిల్లాయువజన విభాగం అధ్యక్షులు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్ఏ.కరీముల్లా, కార్మికశాఖ ఉపాధ్యక్షులు షరీఫ్‌తోపాటు పలువురు సంతాపం తెలిపారు. ఎన్.బాబు భౌతికకాయానికి మదనపల్లెలో శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
పెన్షన్‌దారుల ఉసురు తప్పదు
పీలేరు : సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్‌దారుల ఉసురు తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పీలేరు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అక్టోబర్ 2 నుంచి పెంచిన పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం నిబంధనల పేరుతో లక్షలాది మందిని తొలగిస్తున్నారని అన్నా రు. రుణమాఫీపై తొలిసంతకం చేసిన బాబు రైతులను, డ్వాక్రా మహిళలను నిండా ముంచేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 14 స్మార్ట్ సిటీలు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని చెప్పి న చంద్రబాబు వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు, సిమెంట్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారన్నారు. నిరుద్యోగ భృతి, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ గాలికొదిలేశారని విమర్శించారు. వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు అండ గా ఉంటామని హామీ ఇచ్చారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీపీ కే.మహితాఆనంద్, జెడ్పీటీసీలు రెడ్డిబాషా, జయరామచంద్రయ్య పాల్గొన్నారు.