వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడి మృతి | The death of the leader of the minority ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడి మృతి

Published Sat, Oct 11 2014 2:44 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM

వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడి మృతి - Sakshi

వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడి మృతి

మదనపల్లె: వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకులు ఎన్.బాబు శుక్రవారం సాయంత్రం  ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన డీసీసీ ఉపాధ్యక్షునిగా, మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్టుకు ప్రయత్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దేశాయ్ తిప్పారెడ్డి విజయానికి కృషి చేశారు. బాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
సంతాపం: ఎన్.బాబు ఆకస్మిక మరణంపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమనకరుణాకరరెడ్డి బాబు భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ సాయిప్రతాప్  కుటుం బ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి సంతాపం తెలిపారు.

మున్సిపల్ మాజీ చైర్మన్లు నరేష్‌కుమార్‌రెడ్డి, గుండ్లూరి ముజీబ్‌హుసేన్, మాజీ చైర్‌పర్సన్ గుండ్లూరి షమీంఅస్లాం, వైఎస్సార్‌సీపీ జిల్లాయువజన విభాగం అధ్యక్షులు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్‌ఏ.కరీముల్లా, కార్మికశాఖ ఉపాధ్యక్షులు షరీఫ్‌తోపాటు పలువురు సంతాపం తెలిపారు. ఎన్.బాబు భౌతికకాయానికి మదనపల్లెలో శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement