MLA anilkumaryadav
-
ఐదు నెలల్లో టీడీపీ నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్!
సాక్షి, నెల్లూరు: ‘వచ్చే నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయ్, మన నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. దీనికి పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాల’ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం (రేపు) వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు వేడుకలను మనం జరుపుకొంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, చంద్రబాబులాగా పొత్తులకు వెంపర్లాడబోదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి.. పచ్చజెండా కట్టాలంటే టీడీపీ నాయకులు భయపడేలా మన ప్రభుత్వం తెచ్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఐదు నెలల్లో టీడీపీ నేతలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుందని అన్నారు. -
వరదలొస్తే ఏం చేస్తారు?
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెన్నానది పక్కనే అపార్టమెంట్ల నిర్మాణం చేపట్టారు. ఒకవేళ వరదలొస్తే ఏం చేస్తారు?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు’ అని పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఆయన నెల్లూరులోని 54వ డివిజన్లో జానర్దన్రెడ్డికాలనీలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లను తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. నదికి వరదొస్తే ఎంతమేర తాకిడికి గురవుతుందని అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. నది పక్కనే ఇటువంటి నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న పాత రికార్డులను çస్టడీ చేసి వరద తాకిడి లేని ప్రాంతంతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ సందర్బంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఈ ప్రాంత ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రవాహం వచ్చి వరదల తాకిడికి గురై ప్రజలు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అపార్ట్మెంట్లు నిర్మించే ముందు భూసార పరీక్షలను ప్రభుత్వ సంస్థలతో కాకుండా ప్రయివేట్ సంస్థలతో చేయించారని బుగ్గనకు చెప్పారు. అధికారులు చెబుతున్నట్లు పెన్నానది పరీవాహక ప్రాంతం కాకపోతే పక్కనే నివాసాలు ఏర్పరచుకుని ఉన్న వందలాది కుటుంబాలకు రెవెన్యూ అధికారులు ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. వరదలొస్తే అపార్ట్మెంట్లు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇళ్ల కోసం వినతి జనార్దన్‌రెడ్డికాలనీలో హిజ్రాల సంఘ నాయకురాలు అలేఖ్య సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రవిచంద్రకు ఇళ్ల స్థలాల కోసం వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ 44 మంది పేద హిజ్రాలకు ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఇంకా ఇళ్లు కేటాయించలేదని వారి దృష్టికి తెచ్చారు. ఆదిత్య నగర్లో పర్యటన నెల్లూరు(సెంట్రల్): నగరంలోని ఆదిత్య నగర్ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కమిటీలో సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అప్పలనాయుడు, బీద రవిచంద్ర పాల్గొన్నారు. డ్రెయినేజీ పనులతో ప్రజల అవస్థలు రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు సుదీర్ఘకాలంగా చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గుంటలు తవ్వి పూడ్చకుండా పనులు చేస్తుండటంతో ప్రజలు ప్రమాదాలబారిన పడటం తన దృష్టికి వచ్చిందన్నారు. గుంటలు తవ్విన స్థానంలో వేసిన రోడ్లు కూడా ఇళ్లున్న వాటికంటే ఎత్తులో ఉండటంతో వచ్చే సమస్యలను ప్రజలు తెలియజేశారన్నారు. పబ్లిక్‌హెల్త్ అధికారులు ఇటువంటి వాటిని గుర్తించాలన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో పబ్లిక్‌హెల్త్ అధికారులు పెద్ద నగరాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తే అవగాహనతో పనులు చేయవచ్చన్నారు. అయితే అందుకు భిన్నంగా అధికారులు నెల్లూరులో వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పెన్నా నది ఒడ్డునే పెద్ద నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు సంభవిస్తే ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో అధికారులు చెప్పలేపోవడం దారుణమన్నారు. అనంతరం చైర్మన్ జనార్దన్‌రెడ్డికాలనీలో నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని ఐదు మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. దాని పనితీరు, ఎప్పటిలోగా పూర్తవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ (వైఎస్సార్సీపీ), కె.అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కార్పొరేషన్ కమిషనర్ అలీంబాషా పలు శాఖల అధికారులున్నారు. -
పారిశుధ్యంపై దృష్టి సారించాలి
నెల్లూరు(సెంట్రల్): నగరంలో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందిగా కార్పొరేషన్ అధికారులకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సూచించారు. స్థానిక 46వ డివిజన్లోని ఆచారివీధి, దేవిరెడ్డివారి వీధి, కాపు వీధి, ముత్తరాజువారివీధి, మంగళవీధి ప్రాంతాల్లో కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నర్తకీ సెంటర్, కాపువీధి ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య అధికంగా ఉందని, కాలువల్లో దుర్గంధం వెదజల్లుతోందని చెప్పారు. నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్తున్నారని, అయితే పారిశుధ్యానికి సంబంధించి విఫలమయ్యారని ఆరోపించారు. నగరంలోని కాలువలను సక్రమంగా శుభ్రం చేయడంలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వివిధ పనుల నిమిత్తం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారని, శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వేలూరు మహేష్, వేలూరు రఘు, రామ్‌లక్ష్మణ్, అరవింద్, నారాయణరెడ్డి, కుమార్, అశోక్, సుబ్బారావు, జయకృష్ణ, రాజా, సుదర్శన్, రమేష్, మురళి, వెంకటేశ్వర్లు, నీలి రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిది ఉన్మాద పాలన
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఆగ్రహం నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాలన ఉన్మాది పాలనను తలపిస్తోందని నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరులతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటేశారని ఆరోపించారు. ఐదేళ్లుగా టౌన్‌ప్లానింగ్ అధికారుల కారణంగా కార్పొరేషన్ భ్రష్టుపట్టిందని, ప్రక్షాళన చేసేందుకే సస్పెండ్ చేశారని చెప్పారని, అయితే ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ ఆర్నెల్లు, ఏడాది క్రితం వచ్చిన వారేనని చెప్పారు. మంత్రి ఉన్మాద నిర్ణయాలతో తప్పులు చేయనివారు బలికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమ్మర్ స్టోరేజీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై విచారణ జరుపుతామన్న మంత్రి ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. చేతనైతే కార్పొరేషన్‌కు నిధులు తీసుకురావాలని హితవు పలికారు. జిల్లాలో సీనియర్ నేతలను కాదని నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నారాయణను సాగనంపి, మంచి మంత్రిని ఎన్నుకోవాలని సూచించారు. కార్పొరేషన్‌లోని అన్ని వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మేయర్ షాడో హోటల్లో దందా దేశంలో ఎక్కడా ఏడుగురు ఉద్యోగులపై విచారణ కూడా లేకుండా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆరోపించారు. మేయర్ షాడో హోటల్లో దందా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దందా చేసే వారిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని నిరూపించగలరానని ప్రశ్నించారు. ముందుగా మంత్రి వద్ద నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఆక్రమణలు చేసినట్లు నిరూపిస్తానని, మంత్రి నారాయణ రాజీనామా చేస్తారానని సవాల్ విసిరారు. తాను నిరూపించలేకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, పుల్లారెడ్డి, సత్తార్, తదితరులు పాల్గొన్నారు. -
చిన్న చిన్న డబ్బాల్లా స్కూళ్లు
► నారాయణ, చైతన్య స్కూళ్లే నిదర్శనం ► ఆత్మహత్యలకు వ్యాయామ విద్య లేకపోవడమే కారణం ► అరగంట సమయం ఇస్తే నిరూపిస్తా ► అసెంబ్లీలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ చాలెంజ్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ‘కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు చిన్న చిన్న డబ్బాలాంటి అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహిస్తున్నారు. వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో వి ద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే విధం గా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అరగంట సమయం ఇస్తే ఆధారాలతో నిరూపిస్తా. సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలోనే 40 పాఠశాలల ఫొటోలను సైతం తెప్పిస్తా’ అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్ చేశారు. అసెం బ్లీలో సోమవారం ఇంటర్మీడియట్ విద్యా సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌యాదవ్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల నిర్వహణపై విరుచుకుపడ్డారు. ఇంటర్‌తో పాటు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలకు మైదానాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని పాఠశాలలు చిన్న చిన్న బిల్డింగ్‌లలో విద్యార్థులను పెట్టి ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారనే మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాటలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రి 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉన్నాయో పరిశీలించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి నారాయణ నెల్లూరులో ఓ స్కూలును విజిట్ చేశారని, అక్కడ ఓ విద్యార్థిని బేసిక్స్ లేకుండా కార్పొరేట్ విద్యను ఎలా అందిస్తామని మంత్రిని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.