MLA balaraju
-
ఈనాడు రోత రాతలపై ఎమ్మెల్యే బాలరాజు ఫైర్
-
'చంద్రబాబుకు భయం పట్టుకుంది'
ఏలూరు: వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై విభజనకు సహకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. కుమ్మక్కై రాజకీయాలతో ఆరు కోట్ల సీమాంధ్ర ప్రజలతో ఆడుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలోకి వస్తే జగన్ సుపరిపాలన ద్వారా టీడీపీ కనుమరుగవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజాసంక్షేమం కోసం పోరాడింది వైఎస్ కుటుంబం మాత్రమేనని, రాజన్న రాజ్యం రావడానికి ఎంతో దూరం లేదన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం వైఎస్ జగన్ వల్లే సాధ్యమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వీరు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాల రాజేష్‌కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ముంపు, పంట నష్టాలపై వైఎస్ జగన్ ఆరా
ఏలూరు, న్యూస్‌లైన్ : అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో ఏర్పడిన ముంపు, పంట నష్టాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆరా తీశారు. పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు వైఎస్ జగన్ ఫోన్‌చేసి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకూ సం భవించిన పంట, ఆస్తి నష్టాలను బాలరాజు ఆయనకు వివరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల డెల్టాలో వరికి తీవ్ర నష్టం ఏర్పడిందని బాలరాజు తెలిపారు. ఎర్రకాలువ పొంగటం వల్ల మెట్ట ప్రాంతంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఏజెన్సీలో పొగాకు రైతులకు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్పందించిన వైఎస్ జగన్ కష్టకాలంలో ఉన్న రైతులు, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని ఆదేశించారు.