MLA Buggana Rajendranath Reddy
-
అర్బన్ హౌసింగ్‌లో రూ.5 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు అమలు చేసిన బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని, ఇది రూ.5 వేల కోట్ల కుంభకోణమని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో మొదటిదశ అర్బన్ హౌసింగ్ పథకం కింద 136 పట్టణాల్లో 4.22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని, 2014 నుంచి 2017 వరకు గృహనిర్మాణ పథకం గురించి ఆలోచించని చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టులను నిర్ధారించారని తెలిపారు. గృహ నిర్మాణాలకోసం ఒక్కో చదరపు అడుగు రేటును రూ.1,600గా నిర్ధారించి కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారని, వీటికోసం ఆరు కంపెనీలు పోటీపడ్డాయని, అవన్నీ రింగై ఆయా జిల్లాల్లో కాంట్రాక్టు పనుల్ని పంచుకున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు సహకరించడంతో వాటి పని సులభతరమైందన్నారు. నెల్లూరు జిల్లాలో నాగార్జున నిర్మాణ సంస్థ, కర్నూలు జిల్లాలో షాపూర్జీ పల్లోంజీ కంపెనీ, వైఎస్సార్ జిల్లాలో నాగార్జున సంస్థ, అనంతపురం జిల్లా కాంట్రాక్టును షాపూర్జీ పల్లోంజీ, తిరుపతి కాంట్రాక్టును సింప్లెక్స్ కంపెనీ, విశాఖ జిల్లా కాంట్రాక్టును టాటా కంపెనీ, శ్రీకాకుళం జిల్లా కాంట్రాక్టును వీఎన్‌సీ అనే కంపెనీలు దక్కించుకున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రహదారి నిర్మాణ కాంట్రాక్టుల్లోనూ ఇవే ఆరు కంపెనీలు పోటీపడి తుదకు ఒక కంపెనీకి కాంట్రాక్టు దక్కేలా రింగయ్యాయన్నారు. -
ప్రజాస్వామ్యానికి పాతర
డోన్ : టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారని, డోన్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు, అవినీతి, అక్రమాల మూలంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ‘అరాచకాలు అంతం కావాలి.. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి’ అనే నినాదంతో శనివారం డోన్ పట్టణంలోని బుగ్గన స్వగృహం నుంచి పాతబస్టాండు వరకు వేలాది మందితో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండులో జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడారు. టీడీపీ నాయకుల అక్రమాలు, అన్యాయాలపై నిప్పులు చెరిగారు. కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనల మూలంగా నియోజకవర్గ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోందన్నారు. పట్టణ నడిబొడ్డున రౌడీషీటర్లు కన్నతండ్రిని కిరాతకంగా హతమార్చడం, చిన్న విషయానికే కొందరు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని పొట్టనబెట్టుకోవడం దారుణమన్నారు. ప్రేమపేరుతో నిండు గర్భిణీని హతమార్చిన నిందితునికి అధికార పార్టీ నాయకులు వంతపాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మునిసిపల్ టెండర్ల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసినా పోలీసులు చోద్యం చూశారన్నారు. ప్రజావైద్యశాల వీధిలో ఒక యువకున్ని కత్తులతో పొడిచినా, కేవీఎస్ ఆసుపత్రి వద్ద ఓ వ్యక్తిపై అధికార పార్టీ మద్దతుదారులు అమానుషంగా దాడిచేసినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు. అడుగడుగునా కబ్జాలు డోన్‌లోని టైలర్స్ కాలనీ, పేరంటాలమ్మ , గంగమ్మ మాన్యం భూములతో పాటు నాయీబ్రాహ్మణులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకులు కబ్జా చేశారని బుగ్గన అన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకొన్న బేస్‌మట్టాలను టీడీపీ వారు నేలమట్టం చేయడం దారుణమన్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు సైతం వారి కబ్జాకోరల్లో చిక్కుకున్నాయన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు సామాన్య, పేద ప్రజలకు అందకుండా పంది కొక్కుల్లా మింగేశారని విమర్శించారు. నీరు–చెట్టు, వాటర్షెడ్లు, ఉపాధి హామీ నిధులతో పాటు మరుగుదొడ్ల బిల్లులను సైతం దిగమింగారన్నారు. ఫ్లైఓవర్ కింద నిరుపేద వ్యాపారుల పొట్టకొట్టి రూ.36వేలు, రూ.26వేల చొప్పున అక్రమంగా కిరాయి వసూలు చేస్తోంది ఎవరో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. చెరువుల్లోని మట్టిని రైతుల పంట పొలాలకు ఇవ్వకుండా బయట విక్రయించి లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారని విమర్శించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు డోన్ నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ, ఆస్తులకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ బుగ్గన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డోన్ పోలీస్ స్టేషన్ ఎదుట మండుటెండలో బైఠాయించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, ఆక్రమణలను అరికట్టి.. ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించాలని పోలీసు అధికారులను కోరారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ నాయకుల అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఐ రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ చంద్రబాబు నాయుడు, నర్సింహులు, శ్రీధర్ తదితరులు ఆయనతో చర్చించి.. నూతన డీఎస్పీ ఖాదర్‌బాషతో మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు. ఇందుకు బుగ్గన సమ్మతించి డీఎస్పీతో మాట్లాడారు. అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్, చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దినేష్ గౌడ్, ఆర్ఈ రాజవర్దన్, పోస్ట్రుపసాద్, వెంకోబారావ్, రామచంద్రారెడ్డి, నర్సింహరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటాపురం చిన్నమాదన్న, మద్దిలేటి, రఫీ, బుర్రు శేఖర్, దారా ప్రతాప్‌రెడ్డి, తాడూరు లచ్చప్ప, అనుంపల్లె వెంకటరాముడు, నాగన్న, ఎద్దుపెంట శ్రీను, జయరాముడు, రామలింగడు, తిరుమల్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, దేవేంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, తొర్రెడ్డి, ఓబులాపురం సుధాకర్ యాదవ్, శివారెడ్డి, పెద్దనర్సింహులు, సుధాకర్ రెడ్డి, హనుమన్న, చిరంజీవి, గంగన్న, లక్ష్మిపల్లె ఓబులేస్, పెద్ద తిమ్మారెడ్డి, నాయుడు, ధనుంజయ, మద్దిలేటి, గోసానిపల్లె మధుసూదన్‌రెడ్డి, కొచ్చెర్వు కృష్ణారెడ్డి, రమణయ్యశెట్టి, చింతలపేట గంగాధర్‌రెడ్డి, మాధవస్వామి, చిన్నమల్కాపురం బద్దల నాగరాజు, సుబ్బరాయుడు, శివయ్య, రామనాయుడు, లక్ష్మన్న, వలిసెల హనుమంతరెడ్డి, కటిక వేణు, ఎద్దుపెంట వెంకటేశ్వర్లు, మహేశ్వరరెడ్డి, ప్యాపిలి మండల నాయకులు బోరెడ్డి శ్రీరామ్‌రెడ్డి, బోరా మల్లికార్జునరెడ్డి, ఊటకొండ గోపాల్‌రెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, బాబయ్య, శ్రీనివాసరెడ్డి, రంగన్న, బోరెడ్డి రఘు, జలదుర్గం శ్రీను, రసూల్, బాలవెంకటేశ్, సీమ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల ఏపీలో లేదా?
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు అర్థం లేని కార్యక్రమాలను పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన కేంద్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ డబ్బుతో టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సొమ్ముతో ఏమైనా చేసుకోండి. కానీ ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగించాలన్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలపై ఒత్తిడి పెంచి బలవంతంగా రప్పించుకోవడం మంచిది కాదన్నారు. నవనిర్మాణ దీక్షలకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారులను, కలెక్టర్లను పనిచేసుకోనివడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌కు సహకరిస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే అని గత ఏడాది నవనిర్మాణ దీక్షలో ప్రకటించిన చంద్రబాబు కర్ణాటకలో రాహుల్ గాంధీతో చేతులు కలపడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఎవరనేది తెలిసిందన్నారు. అవినీతి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అవినీతి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బుగ్గన విమర్శించారు. చంద్రన్న మజ్జిగ పథకంలో కూడా బాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అనవసర ప్రకటనలతో, పనులతో ఏడాదికి రూ.12 వేల కోట్లు నష్టం తెస్తున్నారని పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో మీరు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందులకు కూడా నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఏంటి? పులివెందుల ఏపీలో లేదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా కేంద్రానికి వంగి వంగి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. విబేధాల పేరుతో ప్రస్తుతం దూరమయ్యారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. బాగున్న రైతును బలి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడదామని ప్రతిజ్ఞ చేయాలని బుగ్గన కోరారు. -
నంద్యాల: ఈవీఎంలపై టీడీపీ దుర్మార్గ ప్రచారం
- వెరిఫికేషన్ స్లిప్ప్ పేరుతో ఓటర్లను భయపెట్టిస్తున్నారు - సూరత్ గ్రాండ్ హోటల్ ఏపీ క్యాపిటల్‌గా మారింది - పథకం ప్రకారమే చంద్రబాబు రూ.5వేల పాట.. బాలకృష్ణ షో - ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ - వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నంద్యాల: ఓటమి భయంతో అధికార తెలుగుదేశం పార్టీ.. నంద్యాలలో దుర్మార్గాలకు పాల్పడుతున్నదని, ఈవీఎంల పేరు చెప్పి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ వెరిఫికేషన్ స్లిప్(వీవీఎస్) ద్వారా ఎవరెవరు ఎవరికి ఓటేశారో తెలిసిపోతుందనే తప్పుడు ప్రచారాన్ని టీడీపీ చేయిస్తున్నదని, నిజానికి ఆ స్లిప్పులు బయటికి రాకపోయినా, వాటి ఆధారంగా పెన్షన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులను తొలగిస్తామని ఓటర్లను భయపెట్టిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. వెరిఫికేషన్ స్లిప్పులు బయటికి రావు: ‘‘ఎన్నికల సంఘం(ఈసీ) నిబంధనల మేరకు.. ఓటరు తాను ఎవరికి ఓటు వేశాడో తెలుసుకునేలా వెరిఫికేషన్ స్లిప్ వస్తుంది. దానిని పోలింగ్ బూత్ ఆఫీసర్ ముందుండే డబ్బాలో వేసిన తర్వాతే బయటికి రావాల్సిఉంటుంది. ఓటు ఎవరికి వేశామన్న విషయం ఓటరుకు తప్ప ఎవ్వరికీ తెలిసే అవకాశమేలేదు. కానీ టీడీపీ దీనిపై విషప్రచారం చేస్తోంది. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులను తీసుకొచ్చి సర్వేల పేరుతో నంద్యాలలో తిప్పుతున్నారు. ప్రజల నుంచి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పెన్షన్ల వివరాలు సేకరిస్తూ.. టీడీపీకి ఓటేయకుంటే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయిస్తున్నారు. ఈ దుర్మార్గ పద్ధతులపై నెల రోజుల కింటనే మేం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశాం’’ అని బుగ్గన చెప్పారు. కావాలనే బాలకృష్ణ కొట్టారు: వందల కెమెరాలు తనను చూస్తున్నాయని తెలిసికూడా బాలకృష్ణ.. ఒక వ్యక్తిని కొట్టడం, మనిషికో రూ.5 వేలు ఇస్తానని చంద్రబాబు అనడం కాకతాళీయం కాదని, తమ దగ్గర డబ్బు, అధికారం ఉందన్న విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే వారలా ప్రవర్తించారని ఎమ్మెల్యే బుగ్గన అన్నారు. ‘చూశారా.. నేను డబ్బులు పంచినా, ఒకరిని కొట్టినా నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు’ అనే మెసేజ్ ఇవ్వడానికే బాలకృష్ణ అలా చేశారు. మా దగ్గర డబ్బుందని చెప్పడానికే చంద్రబాబు మనిషికి 5వేలు ఇస్తానని అన్నారు. ఒక ఉప ఎన్నిక కోసం వీళ్లు ఇంతలా దిగజారిందికాక, మిగతా వాళ్లు కూడా అలానే చేస్తారని భావించడం మరీ దారుణం’ అని బుగ్గర వాపోయారు. ప్రజలకు చేరువ కావడమే జగన్ లక్ష్యం: ‘‘ప్రజలు స్వచ్ఛందంగా పార్టీకి దగ్గర కావాలన్నది వైఎస్ జగన్ అభిప్రాయం. నిజాయితీ, నిబద్ధత, ఇచ్చిన మాటకు కట్టుబడటం అనేవి ఆయన ఎంచుకున్న మార్గాలు. గడిచిన 12 రోజులుగా వైఎస్ జగన్ ప్రజలలో తిరుగుతున్నారు. నిజాయితీగా ఓట్లు అడుగుతున్నారు. దీనికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతోన్న టీడీపీ.. తిరిగి జగన్‌ను విమర్శించడం దారుణం. గతంలోనూ మంచి నాయకులను చట్టసభలకు పంపింపిన నంద్యాల ప్రజలు.. ఈ సారి కూడా నిజాయితీకే ఓటేస్తారు’ అని బుగ్గన అన్నారు. బుగ్గన చెప్పిన విషయాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు.. ఏపీ క్యాపిటల్ సూరత్ గ్రాడ్ హోటల్: రైతుల దగ్గరనుంచి వేల ఎకరాల భూములు గుంజుకున్న చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతమైన నగరం కడతారనుకుంటే.. చివరికి నంద్యాలలోని సూరత్ గ్రాండ్ హోటల్‌ను రాజధానిగా మార్చేశారు. మంత్రివర్గం మొత్తం అక్కడే తిష్టవేసి అక్రమప్రచారానికి నేతృత్వం వహిస్తోంది. భోజనం టోకెన్లతో మద్యం సరఫరా: ‘అన్నపూర్ణా హోటల్ - రూ.10 భోజనం’ అని రాసున్న టోకెన్లను పంచుతున్నారు. వాటిని తీసుకెళితే భోజనంకాదు మద్యం బాటిళ్లు ఇస్తున్నారు. జగన్ పర్యటనకు వచ్చే ప్రాంతాల్లో డబ్బులిచ్చిమరీ జనాన్ని ఇళ్ల నుంచి బయటికి పంపేస్తున్నారు. టీడీపీ వాళ్లే స్లిప్పులు కొట్టిస్తున్నారు: ‘జై జగన్ జై వైఎస్సార్’ అని ముద్రించిన స్లిప్పులను జనానికి పంచి, శిల్పా మోహన్‌రెడ్డి దగ్గరికెళ్లి డబ్బులు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు కొత్త కుట్రకు తెరలేపారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్న విజయవాడ ఎమ్మెల్యే ఒకరు ఈ కుట్రలో కీలక సూత్రధారి. -
నంద్యాల: ఈవీఎంలపై టీడీపీ దుర్మార్గ ప్రచారం
-
చంద్రబాబు అవినీతిపై చర్చకు సిద్ధం
అసెంబ్లీలో విపక్షం ప్రతిసవాల్.. ప్రతిపక్ష సభ్యులపై సీఎం ఆగ్రహం సాక్షి, అమరావతి: దేశంలోనే అవినీతిలో నంబర్‌వన్ చంద్రబాబు అని శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినదించారు. బడ్జెట్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగం పూర్తికాకుండానే స్పీకర్ కోడెల టీడీపీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులుకు మైకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమకు మాట్లాడేందుకు మూడు నిమిషాలైనా సమయం ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ను వేడుకున్నారు. అయినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. ఈ దశలో ప్రతిపక్షంపై సీఎం చంద్రబాబు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షం తీరు చూస్తుంటే తనకు కోపం, విసుగు, ఇరిటేషన్ వస్తున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని, గిల్లికజ్జాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రితం రోజు సభలో చేసిన వ్యాఖ్యలకు సవరణ ఇచ్చుకున్నారు. అవినీతి అంతంలో, అభివృద్ధిలో ఏపీ నంబర్‌వన్ అని చెప్పాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అవినీతిలో రాష్ట్రం నంబర్‌వన్ అని చెప్పానని తెలిపారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, విపక్షం సిద్ధమేనా? అంటూ సవాలు విసిరారు. సీఎం విసిరిన సవాలుకు బదులిచ్చేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు సిద్ధమైనప్పటికీ మైకు లభించకపోవడంతో పోడియం వద్ద నుంచే ప్రతిస్పందించారు. చంద్రబాబు అవినీతిపై తాము చర్చకు సిద్ధమేనంటూ ప్రతిసవాలు విసిరారు. -
నేడు కర్నూలుకు వైఎస్ జగన్
కర్నూలు(ఓల్డ్‌సిటీ) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 6న మధ్యాహ్నం 12 గంటలకు డోన్‌కు చేరుకుని కృష్ణగిరి సమీపంలోని గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారన్నారు. 1998వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డోన్ మీదుగా పాదయాత్ర చేపట్టారని.. ఆ సందర్భంగా ఫ్లోరైడ్ నీటితో ఎదుర్కొంటున్న అవస్థలను డోన్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఆ తర్వాత 2009లో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 0.06 టీఎంసీల నీటిని డోన్‌కు తరలించి ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు వైఎస్ సంకల్పించారన్నారు. అందులో భాగంగా సుమారు రూ.52 కోట్లు మంజూరు చేసి ప్రజారోగ్య శాఖ ద్వారా పనులు ప్రారంభింపజేశారన్నారు. పథకం పూర్తయినందున బుధవారం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు చెప్పారు. అక్కడే ప్రజలతో ముఖాముఖి ఉంటుందన్నారు. ఆ తర్వాత వెంకటాపురం చెరువును సందర్శిస్తారు. ఒకటి నుంచి రెండు గంటల వరకు భోజన విరామం.. అనంతరం గత ఫిబ్రవరి 19న వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్యాపిలి ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ నేత చేరుకులపాడు లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు.