
నేడు కర్నూలుకు వైఎస్ జగన్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
కర్నూలు(ఓల్డ్‌సిటీ) : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 6న మధ్యాహ్నం 12 గంటలకు డోన్‌కు చేరుకుని కృష్ణగిరి సమీపంలోని గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారన్నారు. 1998వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డోన్ మీదుగా పాదయాత్ర చేపట్టారని.. ఆ సందర్భంగా ఫ్లోరైడ్ నీటితో ఎదుర్కొంటున్న అవస్థలను డోన్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు.
ఆ తర్వాత 2009లో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 0.06 టీఎంసీల నీటిని డోన్‌కు తరలించి ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు వైఎస్ సంకల్పించారన్నారు. అందులో భాగంగా సుమారు రూ.52 కోట్లు మంజూరు చేసి ప్రజారోగ్య శాఖ ద్వారా పనులు ప్రారంభింపజేశారన్నారు. పథకం పూర్తయినందున బుధవారం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు చెప్పారు. అక్కడే ప్రజలతో ముఖాముఖి ఉంటుందన్నారు.
ఆ తర్వాత వెంకటాపురం చెరువును సందర్శిస్తారు. ఒకటి నుంచి రెండు గంటల వరకు భోజన విరామం.. అనంతరం గత ఫిబ్రవరి 19న వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్యాపిలి ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ నేత చేరుకులపాడు లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు.