జిల్లా కోసం ‘ముత్తిరెడ్డి’ రాజీనామా చేయాలి
ప్లకార్డులతో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన
జనగామకు అన్యాయం చేస్తే సత్తా చాటుతామని హెచ్చరిక
అంబేద్కర్ విగ్రహం ఎదుట చెవిలో పువ్వులుపెట్టుకుని నిరసన
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రైల్వేస్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ చౌరస్తాకు చేరుకున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్రిగహం ఎదుట ప్లకార్డులతో చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. జిల్లా చేయకుండా అన్యాయం చేస్తే తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐకాస నాయకులు మంగళ్లపల్లి రాజు, ఆరుట్ల దశమంతరెడ్డి, ఆకుల వేణుగోపాల్‌రావు, ఆకుల సతీష్, న్యాయవాది సాధిక్‌అలీ, మహంకాళి హరిచ్ఛంద్రగుప్త, తిప్పారపు విజయ్, సౌడ రమేష్, జి.క్రిష్ణ మా ట్లాడారు. జనగామ జిల్లా ఏర్పాటుపై వస్తున్న అనుమానాల తొలగించేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. జనగామ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చి న హామీని మరచిపోవద్దని విజ్ఞప్తి చేశారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేరుగా సీఎంను కలవాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్‌చేసి జిల్లా ఇస్తున్నట్లు ప్రకటించుకున్న ఎమ్మెల్యే ఆ మాటను నిజం చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమంలో కలిసి పోరాటం చేయాలన్నారు.మంగళ్లపల్లి రాజు, దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ, రాజమౌళి, వేణుగోపాల్‌రావు, సతీష్, శ్రీను, ధర్మపురి శ్రీనివాస్, సాధిక్ అలీ మహంకాళి హరిచ్చంద్రగుప్త, జక్కుల వేణుమాధవ్, మాశెట్టి వెంకన్న, తిప్పారపు విజయ్, రమేష్, చంద్రశేఖర్, సిద్ధూగౌడ్, జి,క్రిష్ణ, కుమార్, రత్నాకర్‌రెడ్డి, సత్యం, జగదీష్, మైసయ్య, మణి, మాజీద్, సురేష్ పాల్గొన్నారు.