MLA Raveendranath Reddy
-
ఏపీ ప్రజలు రాక్షసులా? తెలంగాణ మంత్రిపై రోజా ఆగ్రహం
సాక్షి, అమరావతి: కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు సరికాదని.. ప్రాంతాలు విడిపోయినా, తెలుగు వారంతా ఒక్కటేనని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తించాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని, దుర్మార్గం అని మండిపడ్డారు. కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఆపాలని, అక్రమ ప్రాజెక్టులనీ మాట్లాడటం సరికాదన్నారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. విభజన చట్టాన్ని గౌరవించాలి..: తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని గౌరవించడం లేదు. కేటాయింపులే లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోంది. 8 అక్రమ ప్రాజెక్టుల ద్వారా 178 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన వైఎస్సార్‌ను తూలనాడటం తెలంగాణ మంత్రులు, నాయకులను తగదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మహానేత ప్రాజెక్టులు చేపట్టారు. అందుకే ఆయన్ను అన్ని ప్రాంతాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని దేవుడిగా కొలిచారు. ముఖ్యమంత్రి జగన్ పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి లేని కేటాయింపులను వాడుకోవాలని భావించడం లేదు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకొనే యోచన మా రాష్ట్రానికి లేదు. కొత్త ప్రాజెక్టులు కడుతున్నది తెలంగాణే కొత్త ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫిల్మ్, ఐటీ ఇండస్ట్రీ తదితర పరిశ్రమలతో హైదరాబాద్‌ను ఆర్థిక పరిపుష్టి గల కేంద్రంగా తయారు చేశాం. విభజన వల్ల ఆ ప్రాంతాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. మంచి వాతావరణంలో ఇరువురం కలిసి ఉండి కర్ణాటక, మహరాష్ట్రతో పోరాడి సాగునీటిని తెచ్చుకోవాల్సింది పోయి స్థానికంగా ప్రజలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎంతో సంయమనంగా వ్యవహరిస్తున్నారు. -
‘చంద్రబాబు ఖాతాలో రూ. 15లక్షల కోట్లు’
సాక్షి, కర్నూలు : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి పేరుతో 15 లక్షల కోట్లు చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేసి, దిగువకు 22 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను మంగళవారం వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘునాథరెడ్డి, ఐజయ్య పరిశీలించారు. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డి పాడును రాయలసీమ రైతుల కోసం 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని తెలిపారు. పోతిరెడ్డి పాడు నుంచి భానకచెర్ల వరకు కాల్వ లైనింగ్ పనులు పూర్తి చేస్తే 22 వేల క్యూసెక్కుల నీరు భానచెర్లకు అక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, వెలుగోడు రిజర్వాయర్‌కు నీరు వదిలే అవకాశం ఉన్నా ఏమీ పట్టకుండా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాయలసీమకు నీరు తామే ఇచ్చామంటూ టీడీపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయిలో నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీరు విడుదల చేయడం లేదని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక వైఎస్ఆర్ కుటుంబానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ వైఎస్ఆర్ కుటుంబంలో 75లక్షల మంది భాగస్వామ్యులు అయ్యారన్నారు. -
రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగుతోంది
– ఎమ్మెల్యే రవీంద్రనాద్‌రెడ్డి కడప ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ప్రస్తుతం తుగ్లక్ పాలన సాగుతోంది. ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలో మంచి రోజులు వస్తాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరం డీసీఈబీలో ఆదివారం వైఎస్సార్‌టీఎఫ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న పలువురు ఎంఈఓలతోపాటు ఉపాధ్యాయులకు వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంధ్రనాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి కుమారుడు అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీటీసీ రవీంద్రనాద్‌రెడ్డిలు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. సమావేశానికి వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే రవీంద్రనాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రుల స్థానానికి వెన్నపూస గోపాల్‌రెడ్డికి , ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పొచంరెడ్డికి మద్దతను ప్రకటించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ పొచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైయ్యారన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు రవీంద్రారెడ్డి, ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు చెంచిరెడ్డి , వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్పరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎంఈఓలు, ఇద్దరు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు, ఐదుగురు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్పరెడ్డి, దివాకర్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లాబాధ్యులు అమర్నాద్రెడ్డి, గంగిరెడ్డి, శివారెడ్డి, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు