MLA venkataramana
-
పాడె మోసిన కరుణ
తిరుపతి: మంగళవారం ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వెంక టరమణ అంత్యక్రియల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పాల్గొని స్వయంగా పాడె మోశారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని అవి ఆత్మీయతకు అడ్డుకావని నిరూపించారు. గతంలో రమణ కుటుంబంతో మెలగినట్లే వారిలో ఒకరుగా సాన్నిహిత్యంగా మెలగి వెంక టరమణ పట్ల తనకు గల అభిమానాన్ని చాటుకున్నారు. కరుణాకర రెడ్డి మంగళవారం ఉదయం 9 గంటలకే వెంకటరమణ నివాసానికి చేరుకున్నారు. అంతిమ సంస్కారాలకు భౌతికకాయం ఊరేగింపుగా బయలుదేరే (మధ్యాహ్నం ఒంటి గంట) వరకు అక్కడే ఉన్నారు. అంతిమ యాత్రకు భౌతిక కాయాన్ని తరలించే క్రమంలో వెంకటరమణ కుటుంబ సభ్యులతో చేయి కలిపారు. అనంతరం భౌతికకాయం అంతిమ యాత్రకు బయలుదేరే వరకు అక్కడే వేచి ఉండి కొంతదూరం భుజం కలిపి పాడె మోశారు. ఆర్నెల్లకు ముందు హోరాహోరీగా జరిగిన సార ్వత్రిక ఎన్నికల్లో కరుణాకర రెడ్డి (వైఎస్ఆర్సీపీ), వెంకటరమణ (టీడీపీ) రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులతో నెల క్రితం వెంకటరమణ చికిత్స కోసం స్విమ్స్‌లో చేరినపుడు కరుణాకర రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి రమణను పరామర్శించి వచ్చారు. సోమవారం చెన్నై అపోలో ఆస్పత్రి నుంచి రమణ భౌతికకాయం తిరుపతికి చేరుకోగానే కరుణాకరరెడి ్డ తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి అశ్రునివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
జన్మభూమిలో ఎమ్మెల్యే నిలదీత
అందరికీ పింఛన్లు ఇవ్వాలంటూ నినాదాలు తిరుపతి కార్పొరేషన్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యూరని, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు ఎమ్మెల్యే వెంకటరమణను అడ్డుకున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో శుక్రవారం సప్తగిరినగర్, యశోదనగర్ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా యశోదనగర్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన జన్మభూమి సభకు ఆయన చేరుకున్నారు. ఈసందర్భంగా అక్కడికి చేరుకున్న సిపిఎం పార్టీ నాయకులు, స్థానికులు ఎమ్మెల్యేను సమస్యలపై నిలదీశారు. సుందరయ్యనగర్, రైల్వేకాలనీ, యశోదనగర్‌లోని తాగునీరు, అండర్ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. దీనికి ఎమ్మెల్యే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా హడావిడిగా ఐదుగురికి పింఛన్లు ఇచ్చేసి, అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీపీఎం నాయకులు పాఠశాల ప్రధాన గేట్లకు అడ్డంగా నిలుచుకుని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అక్కడి నుంచి కదలకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అర్హులందరికి పింఛన్లు, ఇంటి పట్టాలు కేటాయించాలని నినాదాలు చేశారు. గేటు ముందు బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి సుబ్రమణ్యం మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు ఇస్తామని లబ్ధిదారులందరిని ఆహ్వానించి, కేవలం ఐదుగురికే ఇచ్చి తప్పుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. సుందరయ్య నగర్, రైల్వే కాలనీ, యశోదనగర్‌లో రోడ్డు, తాగునీరు, యూడీఎస్, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని పలు మార్లు చెప్పినా స్పందించక పోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి సీపీఎం నాయకులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. సీపీఎం నాయకులు జయచంద్ర, యాదగిరి, గురుప్రసాద్, చిన్న పాల్గొన్నారు. -
'మాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు'
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. తమ పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కలమట వెంకట రమణ డిమాండ్ చేశారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన అన్నారు. -
ఇద్దరే పిల్లలున్నారంటూ ఎమ్మెల్యే వెంకటరమణ తప్పుడు అఫిడవిట్: భార్య ఫిర్యాదు
కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై ఆయన భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకులివ్వాలంటూ తనను వేధిస్తున్నారని, వరకట్న వేధింపులకు కూడా గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. పైపెచ్చు, తమకు ముగ్గరు పిల్లలుంటే, ఇద్దరే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేర్కొన్నారని తెలిపారు. వెంకటరమణ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తనపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె చెప్పారు. తక్షణమే ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సునీత పోలీసు స్టేషన్లో బైఠాయించారు. ఎమ్మెల్యే వ్యవహారంపై మండవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి, వాస్తవాలు తెలిశాక ఎన్నికల కమిషన్‌కు , కలెక్టర్‌కు పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు.