MM kalburgi
-
రెండుసార్లు కాల్చి.. ఆయన్ని చంపేశాను!
ముంబై: ఆరేళ్ల కిందట జరిగిన ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్ (67) హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శరద్ కలస్కర్ కర్ణాటక పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నరేంద్ర ధబోల్కర్‌ను రెండుసార్లు తుపాకీతో కాల్చానని, మొదట వెనుక నుంచి తలలోకి బుల్లెట్ దింపానని, దీంతో కుప్పకూలి పడిపోయిన ఆయన కుడికన్నులోకి మరో బుల్లెట్ దింపానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడు పోలీసుల విచారణలో నేరాంగీకరం వాంగ్మూల ఇచ్చాడు. మొత్తం 14 పేజీలు ఉన్న నిందితుడి వాంగ్మూలాన్ని ఓ జాతీయ మీడియా చానెల్ గురువారం ప్రసారం చేసింది. ఒక కేసు విషయంలో శరద్ కలస్కర్ గత అక్టోబర్‌లో అరెస్టై.. జైల్లో ఉన్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్, ప్రముఖ హేతువాది గోవింద్ పన్సారే హత్యకేసుల్లోనూ ఇతను నిందితుడిగా ఉన్నాడు. గౌరీ లంకేశ్ హత్యకు కుట్ర పన్ని చంపినట్టు అతనిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ హత్యకేసు గురించి విచారిస్తున్న సమయంలోనే నరేంద్ర ధబోల్కర్‌ను కూడా తానే హత్య చేసినట్టు శరద్ కలస్కర్ అంగీకరించడం గమనార్హం. మొదట 2013 ఆగస్టులో పుణెలో మార్నింగ్ వాక్కు వెళ్లిన నరేంద్ర ధబోల్కర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం 2015 ఫిబ్రవరిలో గోవింద్ పన్సారే కోల్హాపూర్‌లో హత్యకు గురయ్యారు. అదే సంవత్సరం ఆగస్టులో ఎంఎం కల్బుర్గీ దారుణ హత్య చోటుచేసుకుంది. 2017 సెప్టెంబర్‌లో బెంగళూరులోని తన నివాసం వద్దే జర్నలిస్ట్ గౌరీలంకేశ్‌ను హతమార్చారు. -
ఆ ముగ్గురి హత్యల వెనుక ఒకే సంస్థ
ముంబై: హేతువాదులు నరేంద్ర దబోల్కర్, ఎంఎం కలబురిగి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యలకు ఒకే అతివాద సంస్థ కారణమని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యతో ఈ సంస్థకు లింకులున్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. ‘దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యల్లో ఒకే రకమైన భావాలున్న వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించాం. ఆ సంస్థలోని దాదాపు అందరు సభ్యులకూ సనాతన్ సంస్థతోనూ దాని అనుబంధ ‘హిందూ జనజాగృతి సమితి’తోనూ సంబంధాలున్నాయని తేలింది. పాల్ఘర్ జిల్లా నల్లసోపారలో ఇటీవల ఆయుధాలు, పేలుడు సామగ్రితోపాటు అరెస్టయిన వారికి దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యలతో ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే దబోల్కర్ హత్యతో సంబంధమున్న ఇద్దరిని అరెస్టు చేశాం. దీంతోపాటు ఈ ముగ్గురి హత్యలకు కీలక సూత్రధారి వీరేంద్ర సింగ్ తవాడేను కూడా పట్టుకున్నాం’ అని తెలిపారు. -
గౌరీ హంతకుడు పరశురామ్ వాగ్మారే
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను పరశురామ్ వాగ్మారే అనే దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల్లో వాగ్మారే ఒకడన్నారు. హేతువాదులు గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హత్యకు వాడిన తుపాకీనే లంకేశ్‌ను చంపేందుకు దుండగులు వినియోగించారని స్పష్టం చేశారు. తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్ వెనుకభాగంలో ఏర్పడ్డ ఒకేరకమైన గుర్తుల ఆధారంగా దీన్ని నిర్ధారించామన్నారు. ఈ హత్యలకు వాడిన తుపాకీని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. లంకేశ్ హత్యకు నిందితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు పథకం రచించారన్నారు. కన్నడ రచయిత కేఎస్ భగవాన్, ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్‌ల హత్యకూ ఈ గ్యాంగ్ రెక్కీ పూర్తి చేసిందనీ, ఇంతలోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. లంకేశ్, కల్బుర్గీ, పన్సారేల హత్య వెనుక అతిపెద్ద గ్యాంగ్ ఉందనీ, దాదాపు 60 మందితో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించిఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్‌చేసిన ప్రవీణ్ అలియాస్ సుజిత్ కుమార్ హిందూ జాగృతి సమితి, సనాతన సంస్థ వంటి అతివాద హిందుత్వ సంస్థల నుంచి ఈ గ్యాంగ్ సభ్యుల్ని ఎంపిక చేశాడన్నారు. ప్రవీణ్ ఏర్పాటుచేసిన గ్యాంగ్‌కు ఎలాంటి పేరు పెట్టలేదన్నారు. కర్నాడ్‌తో పాటు హిందుత్వ ఎజెండాను వ్యతిరేకిస్తున్న రచయిత బి.టి.లలిత నాయక్, హేతువాది సి.డి.ద్వారకనాథ్, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీని హతమార్చేందుకు వీరు తయారుచేసిన హిట్‌లిస్ట్ పోలీసుల తనిఖీల్లో లభ్యమైందన్నారు. బెంగళూరులోని స్వగృహంలో లంకేశ్‌ను గతేడాది సెప్టెంబర్ 5న దుండుగులు తుపాకీతో కాల్చిచంపారు. -
ఒకే తుపాకీతో గౌరీ, కల్బుర్గి హత్య
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌ను, హేతువాది ఎంఎం కల్బుర్గిని ఒకే తుపాకీతో కాల్చి చంపినట్టు తేలింది. కర్ణాటక రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ గౌరీ హత్య కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు నివేదిక అందజేసింది. కల్బుర్గి 2015 ఆగస్టు 30న ధార్వాడ్‌లోని తన ఇంట్లోనే హత్య చేశారు. గౌరి కిందటేడాది సెప్టెంబర్ 5న తన నివాసానికి సమీపంలో దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల తేడాతో వీరిద్దరినీ ఒకే తుపాకీతో చంపారని సిట్ గతంలో చెప్పినా ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతో వీరిని చంపినట్టు నివేదిక పేర్కొంది. గౌరీ లంకేశ్ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తొలి చార్జిషీట్ సమర్పించింది. అందులో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది. అందులో ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తనతో చెప్పాడని నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు పొందు పరిచారు. లంకేశ్‌ను హత్య చేసేందుకు బుల్లెట్లు సిద్ధం చేయమని ప్రవీణ్ అడిగాడని నవీన్ చెప్పినట్టు పేర్కొన్నారు. మరో హత్యకు కుట్ర హేతువాది, హిందుత్వ సిద్ధాంత విమర్శకుడు కేఎస్ భగవాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నవీన్ సిట్ వద్ద అంగీకరించాడు. కిందటేడాది నవంబర్‌లో సంజయ్ బన్సారే అను వ్యక్తి తనను కలసి కేఎస్ భగవాన్ను చంపేందుకు తుపాకీలను సిద్ధం చేయమని అడిగాడని సిట్‌తో చెప్పాడు. తనకు శ్రీరామ్ సేనే, బజరంగ్‌దళ్‌తో సంబంధాలున్నా యని, 2014లో హిందూ యువసేనే అనే సంస్థను స్థాపించానని నవీన్ వెల్లడించాడు. -
గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక పరిణామం
సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కేటీ నవీన్ కుమార్ స్టేట్మెంట్ను నమోదు చేసిన పోలీసులు, కోర్టులో దాఖలు చేసింది. ఇక ఛార్జీషీట్లో ఆమె హత్యకు గల కారణంపై సిట్ బృందం స్పష్టత ఇచ్చేసింది. ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు తనతో చెప్పినట్లు నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు ఛార్జీషీట్లో పొందుపరిచారు. అంతేకాదు ఆ ప్రధాన నిందితుడికి బుల్లెట్లు కూడా తానే సరఫరా నవీన్ ఒప్పుకున్నాడు. ఈ మేరకు మొత్తం 131 పాయింట్లతో 12 పేజీల ఛార్జీ షీట్‌ను రూపొందించిన సిట్ బృందం, మే 30న మెజిస్ట్రేట్‌కు సమర్పించింది. ఛార్జీషీట్లో వివరాలు... డిగ్రీ మధ్యలోనే ఆపేసిన కేటీ నవీన్ కుమార్.. హిందూ అతివాద సంఘాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2014లో హిందూ యువ సేనే అనే సంస్థను తానే సొంతంగా స్థాపించాడు. మంగళూర్ పబ్ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కున్న శ్రీరామ్ సేనే స్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌తో నవీన్ తరచూ భేటీ అయ్యేవాడు. మరోపక్క అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తాడన్న ఆరోపణలు నవీన్‌పై గతంలో వినిపించేవి. ఈ క్రమంలో ఓ సదస్సుకు హాజరైన నవీన్‌కు ప్రవీణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నిందితుడు నవీన్ కుమార్ బుల్లెట్ల కోసం... ఆ తర్వాత నవీన్‌తో సత్సంబంధాలు కొనసాగించిన ప్రవీణ్.. ఓ రోజు ఏకంగా ఇంటి వెళ్లి బుల్లెట్ల కోసం ఆరా తీశాడు. తొలుత నవీన్ అతనికి రెండు బుల్లెట్లు ఇవ్వగా.. ప్రవీణ్ మాత్రం నాణ్యమైనవి కావాలంటూ కోరాడు. ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి. ఆమెను చంపేందుకే ఈ బుల్లెట్లు’ అంటూ తనతో చెప్పినట్లు స్టేట్మెంట్లో నవీన్ పేర్కొన్నాడు. బెంగళూరు, బెలగామ్లో హత్యకు ప్రణాళిక రచించారని, హత్యకు ముందు ఆమె ఇంటి వద్ద పలు మార్లు హంతకులు రెక్కీ నిర్వహించారని నవీన్ పేర్కొన్నాడు. ఫ్లాన్ ప్రకారం చివరకు సెప్టెంబర్ 5వ తేదీన ఆమెను హత్య చేసినట్లు నవీన్ వివరించాడు. అయితే ఆమె హత్యకు గురైందన్న వార్త మరుసటి రోజు పేపర్లో చూసేదాకా తనకూ తెలీదని నవీన్ చెబుతున్నాడు. మరో హత్యకు కుట్ర... సాహితీవేత్త, హేతువాది కేఎస్ భగవాన్ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు నవీన్ అంగీకరించాడు. ఫోన్ కాల్స్‌లో సంభాషణల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి రాగా, విచారణలో నిందితుడు ఒప్పకున్నాడు. కాగా, ప్రముఖ రచయిత కుల్బర్గి హత్య(2015) తర్వాత.. భగవాన్‌కు పోలీసులు భద్రత పెంచిన విషయం తెలిసిందే. రచయిత ఎంఎం కుల్బర్గి ఒకే తుపాకీ... రెండేళ్ల క్రితం రచయిత ఎంఎం కుల్బర్గి(77) హత్య కోసం ఉపయోగించిన తుపాకీ, గౌరీ లంకేశ్ హత్య కోసం వాడిన తుపాకీ ఒక్కటేనని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు పోలీసులు మెజిస్ట్రేట్‌కు సమర్పించిన ఛార్జీషీట్లో ఈ విషయాన్ని పొందుపరిచారు. గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లౌకికవాదిగా, కన్నడ వార పత్రిక ‘లంకేశ్ పత్రికే’ ఎడిటర్‌గా ప్రసిద్ధి చెందిన గౌరీ హత్యకు గురికావడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. మాండ్యా జిల్లాకు చెందిన కేటీ నవీన్ కుమార్ ఈ ఏడాది మార్చిలో తన దగ్గర ఉన్న తుపాకీని ఓ వ్యక్తికి అమ్మేందుకు యత్నించాడు. అయితే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్.. అతనికి సహకరించిన వారు ఎవరన్నది తేలాల్సి ఉంది. -
గౌరీలంకేశ్ కేసులో మరో సంచలన విషయం
► గౌరీ లంకేశ్, ఎం.ఎం కాల్బుర్గీ హత్యలకు ఒకే ఆయుధం సాక్షి, బెంగుళూరు: ప్రముఖ జర్నలిస్ట్, సామాజికవేత్త గౌరీలంకేశ్ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2015 ఆగస్టులో హత్యకు గురైన ప్రముఖ రచయిత, హేతువాది డాక్టర్ ఎం.ఎం కాల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యలు ఒకే ఆయుధంతో చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ప్రాధమిక నిర్ధారణలో వెల్లడైంది. 7.65 ఎం.ఎం తో దేశంలో తయారైన తుపాకీతో చంపినట్లు ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఈరెండు హత్యల్లో సుమారు 80శాతం పోలికలు సరిపోలాయని, ఈ ఘోరాలను ఒకే తుపాకిని ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లంకేశ్ హత్యపై కుటుంబ సభ్యులు సీబీఐ విచారణను డిమాండ్ చేయగా, కర్ణాటక ప్రభుత్తం ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బెంగుళూరు, ఇతర మావోయిస్టు ప్రభావిత జిల్లాలో సిట్ సుమారు 80మందిపైగా విచారించింది. గౌరీలంకేష్ హత్య గావించబడిన రోజు ఆమె ఇంటిముందు మూడు సార్లు అనుమానాస్పదంగా తిరిగిన గుర్తు తెలియని వ్యక్తి గురించి ముమ్మరంగా గాలింపు చేపట్టింది. -
'సీఐడీ ఫెయిలయింది.. సీబీఐ వస్తోంది'!
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత, హేతువాది డాక్టర్ ఎంఎం కాల్బుర్గి హత్య కేసులో ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. ఆయన హత్య జరిగి 100 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా కనుక్కోలేకపోయారని, హత్యకు పాల్పడినవారెవరో గుర్తించలేక పోయారని సమాచారం. దీంతో విసిగిపోయిన ప్రభుత్వం ఆ కేసును ఇక సీబీఐకి అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. సరిగ్గా వంద రోజుల కిందట గుర్తు తెలియని కొందరు యువకులు కాల్బుర్గిపై దాడి చేసి కాల్పులు జరిపి హతమార్చి పారిపోయిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనానికి తెరతీసింది. 'సీఐడీ అధికారులు ఇటీవల నివేదిక సమర్పించారు. అందులో డాక్టర్ కాల్బుర్గి, నరేంద్ర దాబోల్కర్ వంటి నేతల హత్యలకు గల కారణాలు వెల్లడించింది. అయితే, వారిని హత్య చేసినవారు మాత్రం కచ్చితంగా కర్ణాటకలో లేరని దీని వెనుక ఓ ముఠా వ్యూహం దాగి ఉందని అందులో పేర్కొంది. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని భావిస్తున్నాం' అని ఓ సీనియర్ మంత్రి తెలిపారు. -
మతం-శాస్త్రీయత
సమాజంలో శాస్త్రీయ సంశోధననూ, వివేచననూ కలిగించడం పౌరులందరి బాధ్యతని భారత రాజ్యాంగంలోని 51 ఏ(హెచ్) అధికరణ చెబుతోంది. ఈ బాధ్యతను గుర్తించి నిర్వర్తించినందుకే పక్షం రోజులక్రితం కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్‌లో ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎంఎం కల్బుర్గిని ఉన్మాదులు కాల్చిచంపారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని చెప్పడం వంటివి అంతిమంగా తమకు ఎసరు తెస్తాయేమోనని...జనంపై తమ పట్టు సడలిపోతుందేమోనని ఉన్మాదులు భావిస్తారు. అందుకే అలాంటి చైతన్యం కలిగించేవారిపై దాడులకు దిగుతారు. బెదిరిస్తారు. ఈ బాపతు ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉంటారు. ఈ నేపథ్యంలో... శాస్త్రీయ ప్రాతిపదికలేని హిందూ మత విలువలను విడనాడాలని రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక సదస్సులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అధినేత మోహన్ భాగవత్ ఇచ్చిన పిలుపు స్వాగతించదగ్గది. విమర్శలను స్వీకరించడం, లోటుపాట్లున్నప్పుడు సరిదిద్దు కోవడం, తప్పుడు ఆలోచనలను, ఆచరణను గట్టిగా వ్యతిరేకించడం ఎవరైనా చేయవలసిందే. వాస్తవానికి ఆరెస్సెస్ సంస్థ హిందూ మతానికి ప్రతినిధి కాదు. హిందూ మత విశ్వాసాలుండేవారిని సంఘటితపరిచి, జాతీయ భావాలను పెంపొందింపజేసే ఆశయంతో 90 ఏళ్లక్రితం ఆరెస్సెస్ ఆవిర్భవించింది. వివాదాస్పద అంశాలను స్పృశించడం, వాటికి సంబంధించి తనదైన అభిప్రాయాన్ని చెప్పడం మోహన్ భాగవత్‌కు మొదటినుంచీ అలవాటే. ఆ అభిప్రాయాలు హాస్యాస్పదమైనవని కొట్టిపారేసే వారుండొచ్చు. అందులో తప్పులు వెతికేవారుండొచ్చు. అయితే ఆయన ఆ అంశాలను ప్రస్తావిస్తున్నందుకు, వాటిపై ఒక చర్చ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నందుకూ భాగవత్‌ను అభినందించాలి. మొన్న ఫిబ్రవరిలో ఒక సదస్సులో మాట్లాడుతూ దేశంపై దండయాత్రలకు వచ్చినవారే ఇక్కడి ప్రజలను కుల ప్రాతిపదికన విభజించే కుట్ర చేశారని ఆరోపించారు. దేశంలో అంటరానితనం వంటి దురాచారాలన్నిటికీ ఆ దండయాత్రలే కారణమని చెప్పారు. సమాజంలో ఆధిపత్య సంస్కృతికి, ప్రత్యేకించి కుల వివక్షకు, సాంఘిక దురాచారాలకు ఏ శక్తులు కారణమో, వాటి ప్రయోజనాలేమిటో ఎవరికీ తెలియనిది కాదు. సమాజం ఇలా చీలి ఉండటం, ఆ మేరకది బలహీనపడటంవల్లే దండెత్తి వచ్చినవారి పని సులభమైందనడం వాస్తవం. కానీ భాగవత్ దీన్ని తలకిందులు చేసి చెప్పారు. అయినా సమాజంలో కుల వివక్ష ఉన్నదని, అంటరానితనం ఉన్నదని అంగీకరించడం, దాని పరిష్కారానికి ఒక ప్రయత్నం చేయడం హర్షించదగింది. గ్రామాల్లో కొన్ని కులాలను తక్కువగా చూస్తూ ఆ కులాలకు చెందిన పౌరులను దేవాలయాల్లోకి ప్రవేశించనీయకపోవడం, బావుల్లో నుంచి, చెరువుల్లోనుంచి మంచి నీరు తెచ్చుకునేందుకు అనుమతించకపోవడం, ఆఖరికి మరణానంతరం స్మశాన వాటికలను వినియోగించుకోవడానికి కూడా అభ్యంతరం చెప్పడం ఈనాటికీ మన సమాజంలో అమలవుతున్న దురాచారాలు. మారుమూల ప్రాంతాల్లో ఇంత దుర్మార్గంగా అమలయ్యే ఈ బాపతు పద్ధతులు నాగరికత ఉందంటున్న పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో మరో రూపంలో...మరో విధంగా అమలవుతున్నాయి. ఎక్కువ మందిని ప్రభావితం చేయగల ఆరెస్సెస్ వంటి సంస్థ వీటిని ప్రస్తావించి సరిచేయడానికి పూనుకోవడం మంచిదే. ఈ క్రమంలో ఆ దురాచారాల పుట్టుకకు సంబంధించి భాగవత్కున్న అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. మతంలోని అశాస్త్రీయమైన విలువలను, ఆచరణను విడనాడాలని తాజాగా ఆయన ఇచ్చిన పిలుపుపైనా భిన్నాభిప్రాయాలుంటాయి. మతం పునాదులే అశాస్త్రీయమైన వని వాదించేవారికి ఈ పిలుపు వింతగా అనిపించవచ్చు. ఏడేళ్లక్రితం మహారాష్ట్రలోని మాలెగావ్‌లో పేలుళ్లకు పాల్పడి 37మంది ప్రాణాలను బలిగొన్నది అభినవ భారత్ అనే సంస్థ అని తొలిసారి వెల్లడయినప్పుడు అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఆ సంస్థకు సంబంధించి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌లు అరెస్టయ్యారు. ఆ తర్వాత శ్రీరాంసేన పేరిట కర్ణాటక రాష్ట్రంలో పార్క్‌ల్లో, పబ్‌లలో యువ జంటలపై దాడి చేసి అమానుషంగా కొట్టడంలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన డాక్టర్ దభోల్కర్, పన్సారే వంటివారిని కాల్చిచంపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక సంఘ్ పరివార్ నేతలు, కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా...అక్రమ సంతానమా తేల్చుకోవాలంటూ ఒక కేంద్రమంత్రి ఢిల్లీ ప్రజలకు పిలుపునివ్వడం, హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని మరికొందరు నేతలు అనడం, ఘర్‌వాపసీ పేరుమీద మత మార్పిడులకు దిగడంవంటివి అలజడిని రేకెత్తించాయి. ఢిల్లీలోనూ, కొన్ని ఇతరచోట్లా చర్చిలపై దాడులు జరిగాయి. విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులపై కఠిన చర్యలుంటాయని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించిన తర్వాతనే వీటికి అడ్డుకట్ట పడింది. ఇప్పుడు మోహన్ భాగవత్ శాస్త్రీయ ప్రాతిపదిక గురించి మాట్లాడటం కూడా ఆ తరహా ప్రభావాన్నే చూపుతుంది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు తమ మత ప్రయోజనాలను దెబ్బతీస్తాయనుకునే ఉన్మాదులను భాగవత్ చేసిన ప్రకటన ఆలోచింపజేస్తుంది. అబార్షన్లు చేయించుకున్న మహిళలను క్షమించాలని ఈ మధ్య పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపును చాలామంది స్వాగతించారు. అబార్షన్లపై వాటికన్ తన అభిప్రాయాలు మార్చుకొనకపోయినా కనీసం ఇలా పిలుపునివ్వడం మెచ్చదగిందన్నారు. ఇప్పుడు శాస్త్రీయతకు విరుద్ధంగా ఉన్న విలువలను విడనాడాలన్న భాగవత్ పిలుపు కూడా ఎన్ని పరిమితులున్నా హర్షించవలసిందే.