'సీఐడీ ఫెయిలయింది.. సీబీఐ వస్తోంది'! | No clue on Kalburgi killers, Karnataka may seek CBI probe | Sakshi
Sakshi News home page

'సీఐడీ ఫెయిలయింది.. సీబీఐ వస్తోంది'!

Published Sun, Dec 13 2015 12:25 PM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

'సీఐడీ ఫెయిలయింది.. సీబీఐ వస్తోంది'! - Sakshi

'సీఐడీ ఫెయిలయింది.. సీబీఐ వస్తోంది'!

బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత, హేతువాది డాక్టర్ ఎంఎం కాల్బుర్గి హత్య కేసులో ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. ఆయన హత్య జరిగి 100 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా కనుక్కోలేకపోయారని, హత్యకు పాల్పడినవారెవరో గుర్తించలేక పోయారని సమాచారం. దీంతో విసిగిపోయిన ప్రభుత్వం ఆ కేసును ఇక సీబీఐకి అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.

సరిగ్గా వంద రోజుల కిందట గుర్తు తెలియని కొందరు యువకులు కాల్బుర్గిపై దాడి చేసి కాల్పులు జరిపి హతమార్చి పారిపోయిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనానికి తెరతీసింది. 'సీఐడీ అధికారులు ఇటీవల నివేదిక సమర్పించారు. అందులో డాక్టర్ కాల్బుర్గి, నరేంద్ర దాబోల్కర్ వంటి నేతల హత్యలకు గల కారణాలు వెల్లడించింది. అయితే, వారిని హత్య చేసినవారు మాత్రం కచ్చితంగా కర్ణాటకలో లేరని దీని వెనుక ఓ ముఠా వ్యూహం దాగి ఉందని అందులో పేర్కొంది. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని భావిస్తున్నాం' అని ఓ సీనియర్ మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement