Mobile banking transactions
-
కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకే మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 విస్తృతి కారణంగా దేశంలో డిజిటల్ బ్యాంకింగ్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. నగదుకు బదులుగా డిజిటల్, కాంటాక్ట్ రహిత చెల్లింపులకే కస్టమర్లు మొగ్గుచూపుతున్నారని ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్నాలజీ కంపెనీ ఎఫ్ఐఎస్ సర్వేలో తేలింది. పేస్ పల్స్ పేరుతో చేపట్టిన ఈ సర్వేలో 2,000 మంది పాలుపంచుకున్నారు. 68 శాతం మంది ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ విధానంలో లావాదేవీలు జరుపుతున్నారు. మహమ్మారి తదనంతరం కూడా ఈ విధానాన్నే అనుసరిస్తామని 51 శాతం మంది స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్యాష్, కార్డ్స్‌కు బదులుగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లను జరుపుతామని 48 శాతం మంది వెల్లyì ంచారు. మొబైల్ వాలెట్లతో.. భారత్‌లో మొబైల్ పేమెంట్ వాలెట్ల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో మొబైల్ వాలెట్ల ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 124.3 కోట్లు. మే నాటికి ఇది రెండింతలకుపైగా చేరి 253.2 కోట్లకు ఎగసింది. లావాదేవీల విలువ ఇదే కాలంలో రూ.2,836 కోట్ల నుంచి రూ.11,080 కోట్లకు చేరింది. సర్వేలో పాలుపంచుకున్న వారిలో 93 శాతం మందికిపైగా మొబైల్ వాలెట్లను వాడుతున్నారు. వీరిలో 24–39 ఏళ్ల వయసున్నవారే అధికం. చెల్లింపు అభిరుచులు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటాయని ఎఫ్ఐఎస్ ఎండీ మహేశ్ రామమూర్తి తెలిపారు. ఈ మార్పులకు తగ్గట్టుగా ఫైనాన్షియల్ సంస్థలు, విక్రయదారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా కరోన ప్రభావం.. ప్రజలపై కరోన ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధికి సంబంధించిన సమస్యలను 70 శాతం మంది ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా తమ జీతాల్లో కోత పడిందని 49 శాతం మంది తెలిపారు. ఉద్యోగాలు తాత్కాలికంగా కోల్పోయామని 20 శాతం, శాశ్వతంగా పోయిందని 10 శాతం మంది చెప్పారు. 20 శాతం మందికి పదోన్నతి, 18 శాతం మందికి వేతనం పెంపు, 23 శాతం మందికి బోనస్ వాయిదా పడిందని వివరించారు. ఆదాయం తగ్గితే ఆర్థికంగా మూడు నెలలకు మించి భారాన్ని తట్టుకోలేమని 48 శాతం మంది వెల్లడించారు. ఆర్థిక ముప్పు అధికంగా యువ జంటలకే ఉందని సర్వే తేల్చి చెప్పింది. మహిళలపైనా ఈ ప్రభావం ఉందని పేర్కొంది. -
మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల జోరు!
ముంబై: మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు 3,360 లక్షలకు చేరతాయని, వీటి విలువ రూ.7,56,000 కోట్లుగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,706 లక్షల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.6,00,502 కోట్లని ఎస్బీఐ ఎమ్డీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ మొబైల్ బ్యాంకింగ్ చానెల్‌పై నమోదు చేసుకున్న ఖాతాదారుల సంఖ్య 305 లక్షలకు పైగా పెరిగిందని పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోందని, టెలికం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ కారణంగా చౌక ధరల్లోనే డేటా టారిఫ్‌లు లభిస్తున్నాయని, వై–ఫై, 4జీ నెట్‌వర్క్‌ల విస్తరణ కారణంగా మొబైల్ బ్యాంకింగ్ రంగంలో తమ అగ్రస్థానాన్ని కొనసాగించగలమని వివరించారు. కాగా మొత్తం బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం మాత్రమే బ్రాంచ్‌ల ద్వారా జరుగుతున్నాయని ఇటీవలే ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. -
మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్బీఐ టాప్
విలువపరంగా అగ్రస్థానంలో ఐసీఐసీఐ ముంబై: మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)దే అగ్రస్థానం. విలువ పరంగా చూస్తే ఐసీఐసీఐ మొదటి స్థానంలో ఉంది. భవిష్యత్తులో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జోరుగా ఉంటాయని నిపుణులంటున్నారు. జూన్‌లో జరిగిన మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఎస్బీఐ వాటా 50 శాతం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటా 50 శాతం వరకూ ఉందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. తమ మొత్తం రిటైల్ ఖాతాదారుల్లో 4.5 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్ యూజర్లున్నారని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి 1.15 కోట్ల మంది నమోదైన యూజర్లున్నారని వివరించారు. రెండేళ్లలో ఈ సంఖ్య 10-12 శాతానికి, ఐదేళ్లలో 30-35 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నాయన్నారు. ఇటీవలనే మెస్సేజ్-బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభమయ్యాయని, ప్రజలకు ఇది పూర్తిగా అర్థమైన పక్షంలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో విప్లవం సంభవిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. జూన్‌లో జరిగిన మొత్తం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో తమవే అధికమని భట్టాచార్య వివరించారు. రూ.1,000 కోట్లు దాటిన ఐసీఐసీఐ జూన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ మొత్తం రూ.1,000 కోట్లను దాటింది. ఒక నెలలో రూ.1,000 కోట్లకు పైబడిన మొబైల్ లావాదేవీలు నిర్వహించిన తొలి బ్యాంక్ తమదేనని ఐసీఐసీఐ పేర్కొంది. ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారుల్లో ఐదో వంతు మంది వినియోగదారులతోనే తాము ఈ ఘనతను సాధించామని వివరించింది. దాదాపు 20 లక్షల మంది ఐసీఐసీఐ యాక్టివ్ మొబైల్ యూజర్లున్నారని సమాచారం.