ఎస్బీఐ వర్క్ ఫ్రం హోమ్
ముంబై: ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మంగళవారం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అత్యవసర సమయాల్లో ప్రత్యేకంగా కార్యాలయానికి రానక్కర్లేకుండా మొబైల్ పరికరాల ద్వారా ఇంటి నుంచే విధులు నిర్వర్తించేందుకు తోడ్పడే ఈ విధానాన్ని బ్యాంక్ బోర్డు ఇటీవలే ఆమోదించింది. ఇందుకోసం ఉపయోగించే మొబైల్ డివైజ్లలోని యాప్స్, డేటా సురక్షితంగా ఉండేలా మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీలను ఎస్బీఐ వినియోగించుకోనుంది. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఫిర్యాదుల పరిష్కార అప్లికేషన్స్ మొదలైన వాటిని కూడా వర్క్ ఫ్రం హోమ్ సర్వీసుల్లో పొందుపర్చనున్నట్లు ఎస్బీఐ తెలిపింది.