Mobile phones sector
-
మేడిన్ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రూ.45,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో రూ.90,000 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్ వాటా ఏకంగా 50 శాతం ఉందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. శామ్సంగ్ రూ.36,000 కోట్ల ఎగుమతులతో 40 శాతం వాటా కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే మొబైల్స్ ఎక్స్‌పోర్ట్స్ రెండింతలయ్యాయి. భారత్ నుంచి విదేశాలకు చేరిన ఎలక్ట్రానిక్స్ 58 శాతం అధికమై గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,85,000 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్స్ ఎగుమతుల విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా చేసుకున్న రూ.75,000 కోట్లను అధిగమించడం ఆనందంగా ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు చేరుతున్న మొత్తం ఎలక్ట్రానిక్స్‌లో మొబైల్స్ వాటా 46 శాతంగా ఉంది. -
భారీగా మొబైల్ ఫోన్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ ఎగుమతులు భారీ వృద్ధిని చూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి 9.5 బిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. ఇందులో యాపిల్ ఫోన్ల ఎగుమతులే సగం విలువను ఆక్రమించగా, 40 శాతం శామ్సంగ్ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ వివరాలను మొబైల్ తయారీ పరిశ్రమ సంఘం ఐసీఈఏ తెలిపింది. జనవరి నాటికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఫిబ్రవరి చివరికి 9.5 బిలియన్ డాలర్లకు చేరినట్టు అంచనా వేస్తున్నామని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రా నిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 10 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశం నుంచి 5.5 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. -
‘నాలుగు కళ్ల’తో క్లిక్ చేస్తున్నారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్ట్రా నైట్ మోడ్, బ్యూటిఫికేషన్, హైబ్రిడ్ జూమ్.. ఇప్పుడు ఇటువంటి ఫీచర్స్ గురించే స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు చర్చించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు దైనందిన జీవితంలో భాగం కావడంతో ఫొటోలకు ప్రాధాన్యత పెరిగింది. అమూల్యమైన సందర్భాలను, సంఘటనలను చేతిలో ఉన్న ఫోన్‌తో ‘క్లిక్’మనిపించి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. దీంతో సంప్రదాయ కెమెరాల స్థానాన్ని స్మార్ట్ఫోన్లు భర్తీ చేస్తున్నాయి. 10 ఏళ్లలో కెమెరాల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 94 శాతం తగ్గాయంటే.. మొబైల్ ఫోన్లలో కెమెరా సెన్సార్స్, ఫీచర్స్ ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకదాన్ని మించి ఒకటి..: ఒక కెమెరాతో మొదలై ఇప్పుడు క్వాడ్ (4) కెమెరాలతో స్మార్ట్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. వీజీఏతో ప్రారంభమైన ప్రస్థానం నేడు 108 మెగాపిక్సెల్ సెన్సార్స్ స్థాయికి వచి్చందని బి–న్యూ మొబైల్స్ ఫౌండర్ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. సెలీ్ఫల కోసం ముందువైపు రెండు కెమెరాలతోనూ మోడళ్లు వచ్చి చేరాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వైడ్ యాంగిల్, ఫాస్ట్ ఆటో ఫోకస్, పోర్ట్రయిట్ మోడ్, ఆప్టికల్ జూమ్, ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సీన్ రికగి్నషన్, క్వాడ్ పిక్సెల్, మాక్రో విజన్, టెలిఫోటో, ఆటో స్మైల్ క్యాప్చర్, లైవ్ ఫిల్టర్ వంటి ఫీచర్లు తోడయ్యాయి. పాప్–అప్ కెమెరా స్మార్ట్ఫోన్లూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఫుల్ హెచ్డీ, 8కే రిజొల్యూషన్, సూ పర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సైతం సాధ్యపడుతోంది. ఆవిష్కరణలన్నీ కెమెరాలోనే.. స్మార్ట్‌ఫోన్‌లో మెమరీ తర్వాత కెమెరాయే రెండో ప్రాధాన్యతగా నిలిచిందంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్ రంగంలో ఆవిష్కరణలు అధికంగా జరుగుతున్నది కెమెరా విభాగంలోనే అని బిగ్–సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో క్వాడ్ కెమెరాతో 250కిపైగా మోడళ్లు లభిస్తున్నాయి. అలాగే 64 ఎంపీ కెమెరా మోడళ్లు 110 దాకా వచ్చి చేరాయి. ఫ్రంట్ కెమెరా 16, ఆపైన ఎంపీతో సుమారు 530 మోడళ్లున్నాయి. శామ్సంగ్, మోటొరోలా, షావొమీ ప్రస్తుతం భారత్‌లో 108 ఎం పీ కెమెరా మోడళ్లను తీసుకొచ్చాయి. అయితే రూ.10,000 లోపు ధరలోనూ క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు వివరించారు. ఆదరణ తగ్గిన కెమెరాలు.. సంప్రదాయ కెమెరాలకు ఆదరణ క్రమంగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ఫోన్లే అని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. ముందువైపు 2 ఎంపీ, వెనుకవైపు 5 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్ 2010లో ఒక అద్భుతమని అన్నారు. ఇప్పుడు 108 ఎంపీ, క్వాడ్ కెమెరాల గురించి మాట్లాడుకుంటున్నామని వివరించారు. కెమెరా అండ్ ఇమేజింగ్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. 2010లో ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల యూనిట్ల డిజిటల్ కెమెరాలు అమ్ముడయ్యాయి. గతేడాది కెమెరాల విక్రయాలు 70 లక్షల యూనిట్లకు పరిమితం కావడం పరిస్థితికి నిదర్శనం. -
సెల్కాన్ అసెంబ్లింగ్ ప్లాంట్ రెడీ..
మేడ్చల్ వద్ద ఏర్పాటు ♦ వారంలో కేటీఆర్‌తో ప్రారంభం ♦ సెల్కాన్ సీఎండీ వై. గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్.. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద అసెంబ్లింగ్ ప్లాంట్‌ను స్థాపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో సెల్ఫోన్ల అసెంబ్లింగ్ ప్లాంటు నెలకొనడం ఇదే తొలిసారి. ప్లాంటులో నాలుగు లైన్లను ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో మరో నాలుగు లైన్లు జోడిస్తారు. ఒక్కో లైన్లో 8 గంటల్లో 2,500 ఫోన్లు అసెంబుల్ చేయవచ్చు. తొలుత నెలకు 3 లక్షల ఫోన్లను అసెంబుల్ చేస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు గురువారం తెలిపారు. దీనిని 10 లక్షల స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో శాశ్వత ప్లాంటు ఏర్పాటయ్యే వరకు మొబైల్ ఫోన్లను ఇక్కడే అసెంబుల్ చేస్తామని అన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా వారం రోజుల్లో ప్లాంటును ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆర్అండ్డీ కూడా ఇక్కడే.. సెల్‌కాన్‌కు చైనాలోని షెంజెన్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే ఈ కేంద్రాన్ని ఇక్కడికి తరలిస్తామని గురు తెలిపారు. ‘50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్అండ్డీ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మొబైల్ ఫోన్ల డిజైనింగ్ ఇక్కడే చేపడతాం. 500 మంది నిపుణులు పనిచేసే అవకాశం ఉంది. రెండేళ్లలో పూర్తి స్థాయిలో తయారీని దేశీయంగా చేపట్టాలన్నది మా లక్ష్యం. ఇప్పటికే విడిభాగాల తయారీ కంపెనీలతో చర్చిస్తున్నాం. లక్ష్యానికి చేరువ కావడంలో మేడ్చల్ ప్లాంటు చుక్కానిగా నిలుస్తుంది’ అని అన్నారు. మానవ వనరులను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. త్వరలో స్మార్ట్ఫోన్లు సైతం.. ప్రస్తుతం నాలుగు బేసిక్ ఫోన్లను మేడ్చల్ ప్లాంటులో అసెంబుల్ చేస్తారు. జూలై నుంచి స్మార్ట్ఫోన్లు కూడా తోడవనున్నాయి. మొత్తం ఏడు రకాల మోడళ్లు ఇక్కడ రూపొందనున్నాయి. సెల్కాన్ నెలకు 5 లక్షల సెల్ఫోన్లను విక్రయిస్తోంది. 2010లో ప్రస్థానాన్ని ప్రారంభించిన కంపెనీ భారత్‌తోపాటు 30 దేశాలకు విస్తరించింది. ప్లాంటు ఏర్పాటవడం ద్వారా కస్టమర్లకు సెల్కాన్ బ్రాండ్ మరింత దగ్గరవుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ వ్యాఖ్యానించారు. మొబైల్స్ హబ్‌లో నెలకు 10 లక్షల మొబైల్స్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పనున్నట్టు సెల్కాన్ ఇప్పటికే ప్రకటించింది. కార్బన్‌తోపాటు మరో మూడు కంపెనీలు హబ్‌లో ప్లాంట్లు స్థాపించేందుకు సుముఖంగా ఉన్నాయి. హబ్ కార్యరూపం దాలిస్తే మరిన్ని కంపెనీలు ప్లాంట్లు పెట్టనున్నాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో చర్చిస్తోంది కూడా.