హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్ట్రా నైట్ మోడ్, బ్యూటిఫికేషన్, హైబ్రిడ్ జూమ్.. ఇప్పుడు ఇటువంటి ఫీచర్స్ గురించే స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు చర్చించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు దైనందిన జీవితంలో భాగం కావడంతో ఫొటోలకు ప్రాధాన్యత పెరిగింది. అమూల్యమైన సందర్భాలను, సంఘటనలను చేతిలో ఉన్న ఫోన్‌తో ‘క్లిక్’మనిపించి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. దీంతో సంప్రదాయ కెమెరాల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్లు భర్తీ చేస్తున్నాయి. 10 ఏళ్లలో కెమెరాల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 94 శాతం తగ్గాయంటే.. మొబైల్ ఫోన్లలో కెమెరా సెన్సార్స్, ఫీచర్స్ ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఒకదాన్ని మించి ఒకటి..: ఒక కెమెరాతో మొదలై ఇప్పుడు క్వాడ్ (4) కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లు హల్‌చల్ చేస్తున్నాయి. వీజీఏతో ప్రారంభమైన ప్రస్థానం నేడు 108 మెగాపిక్సెల్ సెన్సార్స్ స్థాయికి వచి్చందని బి–న్యూ మొబైల్స్ ఫౌండర్ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. సెలీ్ఫల కోసం ముందువైపు రెండు కెమెరాలతోనూ మోడళ్లు వచ్చి చేరాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వైడ్ యాంగిల్, ఫాస్ట్ ఆటో ఫోకస్, పోర్ట్రయిట్ మోడ్, ఆప్టికల్ జూమ్, ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సీన్ రికగి్నషన్, క్వాడ్ పిక్సెల్, మాక్రో విజన్, టెలిఫోటో, ఆటో స్మైల్ క్యాప్చర్, లైవ్ ఫిల్టర్ వంటి ఫీచర్లు తోడయ్యాయి. పాప్–అప్ కెమెరా స్మార్ట్‌ఫోన్లూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఫుల్ హెచ్‌డీ, 8కే రిజొల్యూషన్, సూ పర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సైతం సాధ్యపడుతోంది.
ఆవిష్కరణలన్నీ కెమెరాలోనే..
స్మార్ట్‌ఫోన్లో మెమరీ తర్వాత కెమెరాయే రెండో ప్రాధాన్యతగా నిలిచిందంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్ రంగంలో ఆవిష్కరణలు అధికంగా జరుగుతున్నది కెమెరా విభాగంలోనే అని బిగ్–సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో క్వాడ్ కెమెరాతో 250కిపైగా మోడళ్లు లభిస్తున్నాయి. అలాగే 64 ఎంపీ కెమెరా మోడళ్లు 110 దాకా వచ్చి చేరాయి. ఫ్రంట్ కెమెరా 16, ఆపైన ఎంపీతో సుమారు 530 మోడళ్లున్నాయి. శామ్‌సంగ్, మోటొరోలా, షావొమీ ప్రస్తుతం భారత్‌లో 108 ఎం పీ కెమెరా మోడళ్లను తీసుకొచ్చాయి. అయితే రూ.10,000 లోపు ధరలోనూ క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు వివరించారు.
ఆదరణ తగ్గిన కెమెరాలు..
సంప్రదాయ కెమెరాలకు ఆదరణ క్రమంగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్లే అని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. ముందువైపు 2 ఎంపీ, వెనుకవైపు 5 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్ 2010లో ఒక అద్భుతమని అన్నారు. ఇప్పుడు 108 ఎంపీ, క్వాడ్ కెమెరాల గురించి మాట్లాడుకుంటున్నామని వివరించారు. కెమెరా అండ్ ఇమేజింగ్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. 2010లో ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల యూనిట్ల డిజిటల్ కెమెరాలు అమ్ముడయ్యాయి. గతేడాది కెమెరాల విక్రయాలు 70 లక్షల యూనిట్లకు పరిమితం కావడం పరిస్థితికి నిదర్శనం.
‘నాలుగు కళ్ల’తో క్లిక్ చేస్తున్నారు..!
Published Wed, Oct 21 2020 4:26 AM | Last Updated on Wed, Oct 21 2020 5:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment