Mohanlal hero
-
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. వామ్మో అన్ని కోట్లా?
మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తన ఇంటికి తీసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపుగా రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాాగా.. మోహన్‌లాల్ వద్ద ఇప్పటికే 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే లంబోర్గినీ కారును కలిగి ఉన్నాడు. టయోటా వెల్ఫైర్ రూ. 1 కోటి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350(సుమారు రూ. 80 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (సుమారు రూ. 2 కోట్లు) మోహన్ లాల్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారుగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ నిలవనుంది. కాగా.. మోహన్‌లాల్ ఇటీవలే రాజస్థాన్‌లో తన రాబోయే చిత్రం మలైకోట్టై వాలిబన్ షెడ్యూల్‌ను ముగించారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్ రజనీకాంత్ జైలర్‌లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. New one to the garage 🚗#RangeRover @Mohanlal #Mohanlal #MalaikottaiVaaliban pic.twitter.com/2bZBuBKL3K — Mohanlal Fans Club (@MohanlalMFC) April 10, 2023 -
మోహన్ లాల్ తో వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్న : మంచు లక్ష్మి
-
మోహన్‌లాలే కారణమంటున్న కమల్!
ఓ చిన్న కథ. కూతురు అనుకోకుండా ఓ ఆపదలో పడితే, తండ్రి తన కూతురినే కాక మొత్తం కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అది ఎలా అన్నది ఇప్పటికి నాలుగు భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ సినిమా కథ ‘దృశ్యం’ అని. ఎక్కడో మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హాట్ కేక్. ఈ సినిమా తెలుగు వెర్షన్లో వెంకటేశ్ హీరోగా నటించి ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కమల్‌హాసన్ ‘పాపనాశమ్’ పేరుతో తాజాగా తమిళంలో చేసి విజయం సాధించారు.కానీ ఆయన లాంటి పెద్ద నటుడు ఇంత సామాన్యమైన కథను చేయడానికి పరోక్ష కారణం మాత్రం మోహన్‌లాల్. ఆయన ఈ సినిమాను తమిళంలో కమల్‌హాసనే చేయాలని కోరుకున్నారు. ఆ సంగతి తెలిసిన కమల్, ‘‘‘దృశ్యం’ రీమేక్‌లో ప్రధాన పాత్ర నేను చేస్తే బాగుంటుందని మోహన్‌లాల్ అన్నారట. ఇంత మంచి కథకు నా పేరు సూచించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఈ సినిమా ఎవరైనా వేసుకోవాలనుకునే మంచి చొక్కా లాంటిది’’ అన్నారు.