డీబీఎం13 ఉపకాలువకు గండి
పరిశీలించిన డీఈ
శంకరపట్నం : మండలంలోని మొలంగూర్ గ్రామశివారులో డీబీఎం13 ఉపకాలువకు బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టారు. ఈ విషయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయగా ఎస్సారెస్పీ డీఈ కవిత కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలో గుడాటిపల్లె చెరువును నింపేందుకు గండిపెట్టి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు గండిపెట్టడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందే అవకాశం ఉండదని స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు. కాలువకు మరమ్మతులు చేస్తామని డీఈ తెలిపారు. గండిపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజాపూర్ సర్పంచ్ రెడ్డి గట్టుస్వామి, ఉపసర్పంచ్ లింగారెడ్డి అధికారులను కోరారు.