monditoka jaganmohanarao
-
కోడి పందెం ముసుగులో గొడవ.. వైఎస్సార్సీపీ నాయకుడి హత్య!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ యువనేత మణితేజ అనుమానస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక, మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామలోని ఆసుపత్రి వద్దకు వైస్సార్సీపీ నాయకులు చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు.అనంతరం, దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. మణితేజ కుటుంబం వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటోంది. వారంతా పార్టీలో యాక్టివ్గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి.ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. మణితేజ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. మణితేజ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. మణితేజ కుటుంబానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు. మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే అని ప్రశ్నించారు.అనంతరం, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సంక్షేమం,అభివృద్ధిని ప్రజలు చేరువ చేస్తున్నాం
-
విలువలు ప్రతిబింబించేలా ‘స్థానిక ఎన్నికలు’
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనను ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు గమనించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సాహసోపేత నిర్ణయాలతో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రజలంతా సీఎం జగన్ వైపే చూస్తున్నారని తెలిపారు. డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ‘అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎన్నిక రద్దు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలను ఓట్లు అడుగుతామని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. (ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా) ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేస్తోంది: మొండితోక జగన్మోహన్రావు ప్రజాస్వామ్యం విలువలు ప్రతిబింబించేలా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు. ఏ విధమైన ప్రలోభాలు లేకుండా ఎన్నికల నిర్వహణ జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చిన..ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు గెలవాలన్నదే ఆయన సంకల్పమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తోందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేశామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో విజయ గంట మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు దేశానికే తలమానికంగా నిలవనున్నాయని తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉందని జగన్మోహన్రావు పేర్కొన్నారు. -
శ్రీశైలం చేరుకున్న నందిగామ ఎమ్మెల్యే పాదయాత్ర
సాక్షి, కర్నూలు: వికేంద్రీకరణకు మద్ధతుగా కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చేపట్టిన పాద్రయాత్ర ఆదివారం రోజున కర్నూలు జిల్లా శ్రీశైలంకు చేరుకుంది. ఈ నెల 21న నందిగామ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈ రోజు ఉదయం శ్రీశైలానికి చేరుకొని శ్రీభ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం వికేంద్రీకరణకు మద్దతు తెలిపేలా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహనరావుతో పాటు శ్రీశైలం వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి
పెద్ద దోర్నాల: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ ఎంతో అవసరమని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ప్రకటించారని తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కృష్ణా జిల్లా నందిగామ నుంచి శ్రీశైలం వరకు ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలకు చేరింది. ఈ సందర్భంగా మండల సరిహద్దులోని చిన్న గుడిపాడు, చిన్నదోర్నాల అడ్డరోడ్డు, జమ్మిదోర్నాల, హసానబాద్లో నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టారు. స్థానిక నటరాజ్ సెంటర్లోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. పశ్చిమ ప్రకాశం వరప్రదాయని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయటమే సీఎం ముఖ్య లక్ష్యమన్నారు. అనంతరం దోర్నాల నుంచి ఎమ్మెల్యే పాదయాత్రను కొనసాగించి నల్లమల అటవీ ప్రాంతమైన చింతల చెంచుగూడేనికి చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్కుమార్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు పాదయాత్ర
-
రైతుల బకాయిలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలం
నందిగామ : ఎస్పీఎం కంపెనీ సుబాబుల్ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎస్పీం కంపెనీ ఏఎంసీకి కేవలం రూ. రెండు కోట్ల విలువ చేసే బ్యాంకు గ్యారంటీ ఉండగా రూ.14 కోట్ల వరకు ఎలా అప్పు పెట్టారని ప్రశ్నించారు. కంపెనీ వారు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ కలెక్టర్ కంపెనీకి నోటీసుల పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏఎంసీ నిధుల నుంచి కానీ, ప్రభుత్వం కానీ వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కంపెనీ వారు ఈ ప్రాంత రైతులకు డబ్బులు ఇవ్వకుండా వేరే ప్రాంతంలో సుబాబుల్ కర్ర కొంటున్నారని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. దీక్ష చేస్తున్న రైతులు, రైతు నాయకులకు జగన్మోహన్రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కోవెలమూడి ప్రమీల, ఎంపీపీ వల్లంకొండ భద్రఖాళి, పార్టీ నియోజకవర్గ నాయకుడు కోవెలమూడి వెంకట నారాయణ, కార్యాలయ ఇన్చార్జి డాక్టర్ ఎం. అరుణకుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగునూరి కొండారెడ్డి, మండల కన్వీనర్ నెలకుదిటి శివనాగేశ్వరరావు, మండల రైతు కన్వీనర్ చిలుకూరి బుచ్చిరెడ్డి, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యుడు కత్తురోజు శ్రీనివాసాచారి, పలు విభాగాల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాకాలపాటి రోజానమ్మ, జిల్లేపల్లి రంగారావు, మువ్వల శ్రీనివాసరావు, కొండా కృష్ణారెడ్డి, నెలకుర్తి సత్యనారాయణ, రవికిరణ్ రెడ్డి, షేక్ ఫాతిమా, ఆవుల విజయ్, కిరణ్ పాల్గొన్నారు.