Mondodu
-
మంచి మనసున్న దొంగ
వృత్తి దొంగతనం. కానీ మనసు నిండా మంచితనం. తెలీని బిడ్డ కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని అమ్మతనం.. సింపుల్గా శ్రీకాంత్ కేరక్టరైజేషన్ ఇదే. ‘మొండోడు’లో శ్రీకాంత్ పాత్ర ప్రతి ఒక్కరూ ప్రేమించేలా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు ప్రభు. రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జర్నలిస్ట్ ప్రభు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ప్రభు మాట్లాడుతూ -‘‘భావోద్వేగపూరితమైన కథాంశమిది. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఎంతో అభినందించారు కూడా. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సాయికార్తీక్, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సమర్పణ: జోత్స్నారెడ్డి. -
ఈ దొంగ చాలా 'మొండోడు'
తన బిడ్డ కాకపోయినా, ఆ పాప ఎవరో తెలీకపోయినా.. ఆ పసిదాని కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని దొంగ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మొండోడు’. శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి జర్నలిస్ట్ ప్రభు దర్శకుడు. రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మాత. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘భావోద్వేగపూరితమైన మాస్ కథాంశమిది. ఇందులో శ్రీకాంత్ పాత్ర అన్ని వర్గాల వారికీ నచ్చేలా ఉంటుంది. దర్శకునిగా ప్రభుకి ఇది తొలి సినిమా అయినా, అనుభవం ఉన్న దర్శకునిగా తీర్చిదిద్దుతున్నారు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 16న విడుదల చేస్తున్నాం. ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. వినోదంతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉన్న సినిమా ఇదని ప్రభు చెప్పారు. పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సమర్పణ: జోత్స్నారెడ్డి.