ఈ దొంగ చాలా 'మొండోడు'
ఈ దొంగ చాలా 'మొండోడు'
Published Sat, Aug 10 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
తన బిడ్డ కాకపోయినా, ఆ పాప ఎవరో తెలీకపోయినా.. ఆ పసిదాని కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని దొంగ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మొండోడు’. శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి జర్నలిస్ట్ ప్రభు దర్శకుడు. రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మాత. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘భావోద్వేగపూరితమైన మాస్ కథాంశమిది. ఇందులో శ్రీకాంత్ పాత్ర అన్ని వర్గాల వారికీ నచ్చేలా ఉంటుంది. దర్శకునిగా ప్రభుకి ఇది తొలి సినిమా అయినా, అనుభవం ఉన్న దర్శకునిగా తీర్చిదిద్దుతున్నారు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 16న విడుదల చేస్తున్నాం. ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
వినోదంతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉన్న సినిమా ఇదని ప్రభు చెప్పారు. పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సమర్పణ: జోత్స్నారెడ్డి.
Advertisement
Advertisement