మల్లిగాడు ఫుల్‌గా నవ్విస్తాడు
మల్లిగాడు ఫుల్‌గా నవ్విస్తాడు
Published Mon, Sep 30 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
‘‘ఈ మధ్య మాస్ సినిమాలు ఎక్కువగా చేయడంతో కొంచెం విసుగు అనిపించింది. వినోద ప్రధానంగా సాగే సినిమా చేస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో ఉదయ్‌రాజ్ ఓ కథ చెప్పాడు. చాలా నచ్చింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా చిత్రాల తర్వాత బ్రహ్మానందంగారి కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాను. ఈ సినిమా ఫుల్‌గా నవ్విస్తుంది’’ అన్నారు శ్రీకాంత్.
ఉదయ్‌రాజ్ .ఎ దర్శకత్వంలో మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. శ్రీకాంత్, మనోచిత్ర నాయకా నాయికలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పెళ్లి సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘రచయితగా శ్రీకాంత్‌తో ప్రారంభమైన నా కెరీర్ దర్శకుడిగా కూడా ఆయనతోనే ప్రారంభం కావడం ఆనందంగా ఉంది.
హీరో మ్యారేజ్ బ్యూరో ఎందుకు నడుపుతాడు? అనేది ఆసక్తికరమైన అంశం’’ అన్నారు. వచ్చే నెల 5 నుండి చిక్‌మగళూర్, హంపీల్లో పాటలను చిత్రీకరించాలనుకుంటున్నామని, సినిమా బాగా వస్తోందని మల్లెల సీతారామరాజు చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో మనోచిత్ర, రఘురామ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement