మంచి మనసున్న దొంగ
మంచి మనసున్న దొంగ
Published Sat, Sep 7 2013 11:25 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
వృత్తి దొంగతనం. కానీ మనసు నిండా మంచితనం. తెలీని బిడ్డ కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని అమ్మతనం.. సింపుల్‌గా శ్రీకాంత్ కేరక్టరైజేషన్ ఇదే. ‘మొండోడు’లో శ్రీకాంత్ పాత్ర ప్రతి ఒక్కరూ ప్రేమించేలా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు ప్రభు. రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జర్నలిస్ట్ ప్రభు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ప్రభు మాట్లాడుతూ -‘‘భావోద్వేగపూరితమైన కథాంశమిది.
ఇటీవలే సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఎంతో అభినందించారు కూడా. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సాయికార్తీక్, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సమర్పణ: జోత్స్నారెడ్డి.
Advertisement
Advertisement