money withdrawals
-
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?
ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్ చెల్లింపుల కంటే లిక్విడ్ క్యాష్తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. ఏటీఎంలో డెబిట్ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుండి నగదును విత్‌డ్రా చేస్తే.. సదరు విత్ డ్రాల్ పై సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ స్టేట్మెంట్లో యాడ్ అవుతాయి. వడ్డీ సాధారణంగా డెబిట్ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్‌తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డుతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్‌ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు. సిబిల్ స్కోర్ తగ్గుతుందా? క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్ కార్డు స్కోర్‌పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, డీల్స్ రెస్టారెంట్లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో ఏటీఎం కార్డ్‌తో పనిలేకుండా యూపీఐ పేమెంట్ ద్వారా ఏటీఏం సెంటర్లో ఈజీగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ట్రయల్ వెర్షన్లో ఉండగా త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం. దేశంలో యూపీఐ పేమెంట్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా కారణంగా మునుపెన్నడూ లేని విధంగా యూజర్లు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్‌పై మొగ్గు చూపుతున్నారు. వైరస్ వ్యాప్తితో పాటు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా ఉన్న చోటు నుంచి ఆన్లైన్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయడంతో యూజర్లు యూపీఏ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏటీఎం సెంటర్లలో జరిగే నేరాల్ని అరికడుతూ...యూపీఏ పేమెంట్స్‌ను మరింత పెంచేలా ఎన్సీఆర్ కార్పొరేషన్ అనే సాఫ్ట్వేర్ సంస్థ తొలిసారి యూపీఐ నెట్వర్క్ ఫ్లాట్ ఫామ్స్‌తో కలిసి ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రాల్(ఐసీసీడబ్ల్యూ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ ఫ్లాట్ ఫామ్‌తో యూజర్లు కార్డ్ లేకుండా ఏటీఎం సెంటర్లలో గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌తో పే పాటు ఇతర యూపీఐ పేమెంట్స్‌తో మనీ విత్ డ్రాల్ చేసుకునే సౌకర్యం ఉంటుందని ఎన్సీఆర్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్డ్ లెస్ మనీ విత్ డ్రాల్ జరగాలంటే..సంబంధిత బ్యాంక్‌లకు చెందిన ఏటీఎంలలో ఈ కొత్త యూపీఏ పేమెంట్ సదుపాయం ఉండాలని చెప్పారు. కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా ఎలా చేయాలంటే? ►ముందుగా ఏటీఎం మెషిన్లో విత్ డ్రా క్యాష్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి ►వెంటనే మీకు యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి ►అలా ట్యాప్ చేస్తే ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది ►ఆ కోడ్‌ను మీ యూపీఐ పేమెంట్(ఉదాహరణకు గూగుల్ పే) ను స్కాన్ చేసుకోవాలి ►స్కాన్ చేస్తే మీరు మనీ ఎంత డ్రా చేయాలనుకుంటున్నాని అడుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మనీ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం లిమిట్ రూ.5వేల వరకు ఉండనుందని తెలుస్తోంది. ►మీకు ఎంత క్యాష్ కావాలో..నెంబర్ (ఉదాహరణకు రూ.2వేలు) ఎంట్రీ చేసిన తర్వాత హింట్ ప్రాసెస్ బటన్ క్లిష్ చేస్తే మనీ విత్ డ్రా అవుతుంది. డీఫాల్డ్గా మీ యూపీఐ అకౌంట్ క్లోజ్ అవుతుంది. చదవండి👉వాటిని దాటేయనున్న డిజిటల్ వాలెట్లు -
రూపాయి ఎర వేసి... ఖాతా ఖాళీ చేసి!
ఓ ప్రైవేటు సంస్థను నడుపుతున్న కె.పవిత్ర బ్యాంకు ఖాతాలో ఈ నెల 21న అపరిచిత వ్యక్తి ఖాతా నుంచి రూ.1 జమ అయ్యింది. మరుక్షణమే ఆ అపరిచిత వ్యక్తి తిరిగి రూ.1 రివర్స్ చేసుకున్నాడు. ఇలా నాలుగుసార్లు వేసి.. తీసిన తర్వాత ఒక్కసారిగా రూ.7,900 డ్రా చేశాడు. మళ్లీ అదే పనిగా మరో రూ.1,100ను నాలుగు దఫాలుగా విత్‌డ్రా చేశాడు. అయితే ఖాతాదారుకు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్, మెసేజ్ ఏదీ లేదు. ఏదో అవసరం మీద తన ఖాతాలో నగదును పరిశీలిస్తే.. ఈ విత్‌డ్రా పర్వం వెలుగు చూసింది. వెంటనే ఎల్బీ నగర్‌లోని సైబర్ క్రైమ్ విభాగంలో, తర్వాత బ్యాంకులో ఫిర్యాదు చేయగా... తమ పొరపాటు కాదని బ్యాంకర్లు చేతులెత్తేయడం గమనార్హం. తన ప్రమేయం లేకుండా, కనీసం తన పొరపాటు లేకుండా నగదు పోవడంతో ఆమె బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న తరుణంలో నేరగాళ్లు ఇదే పరిజ్ఞానంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడమంటే అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ ద్వారా ఏటీఎం వివరాలు అడగడమో, లేక ఎస్ఎంఎస్లు పంపమనడమో, ఏదో లింక్ పంపి క్లిక్ చేయమనడమో జరిగేది. అలా అవతలి వ్యక్తులు వివరాలు తీసుకున్న తర్వాత ఖాతాలో నగదు స్వాహా చేయడం విన్నాం. కానీ ఎలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లేకుండా ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ విభాగానికి ఇలాంటి కేసులు అధికంగా వస్తున్నాయి. గత వారం సంగారెడ్డిలోని ఓ టీచరు ఖాతా నుంచి ఏకంగా 20వేలు ఇలా మాయమయ్యాయి. ఇన్సూరెన్స్‌తో కవరేజీ... బ్యాంకు ఖాతాలో నగదుపోతే వెంటనే బ్యాంకర్‌కు ఫిర్యాదు చేయాలి. వారి సూచనల ఆధారంగా.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఏటీఎం కార్డుకు ఇన్సూరెన్స్ ఉంటే పొగొట్టుకున్న మొత్తం తిరిగి పొందే వీలుంటుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదు. ఫిర్యాదు అనంతరం కార్డుదారు డాటాను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఖాతాదారు పొరపాటు లేదని గ్రహిస్తేనే ఇన్సూరెన్స్ వస్తుంది. ఖాతాదారు తన వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకుంటే లేదా నగదు పొగొట్టుకోవడంలో తన ప్రమేయం ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 21న కె. పవిత్ర ఖాతాలో రూ.9వేలు స్వాహా కావడంపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రమేయం లేకుండా నగదు విత్‌డ్రా చేయడంపై ఆమె బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అప్రమత్తత లేకుంటే అంతే బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడం అంత సులువైన విషయం కాదు. ఖాతా వివరాలు తెలిసి ఉండటంతోనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఏటీఎం కార్డు నంబర్‌తో పాటు సీవీవీ నంబర్లు తెలిస్తే చాలు మన ఖాతాలో నిల్వలు కొట్టేయొచ్చు. ఏటీఎంలో నగదు డ్రా చేసిన తర్వాత వచ్చే స్లిప్పు ఆధారంగా కూడా తస్కరించవచ్చు. బ్యాంకు ఖాతా, ఏటీఎం వివరాలు ఇతరులకు ఇవ్వొద్దనే దానిపై ఖాతాదారుల్లో కొంత అవగాహన పెరిగింది. ఈక్రమంలో సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఖాతాదారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏటీ ఎంలలో నగదు విత్‌డ్రా, ఇతర షాపింగ్ మాల్స్ లేదా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేశాక డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా జరిగే లావాదేవీలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని, లేకుంటే ఖాతా నిర్వహణ సై బర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంద ని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ పాతూరి వెంకటేశ్ గౌడ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
గూగుల్ పేతో డబ్బులు కాజేశాడు..
కంగ్టి(నారాయణఖేడ్): ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా గూగుల్ పే యాప్ ద్వారా డబ్బులు కాజేసిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 2.4 లక్షలు రికవరీ చేశారు. ఈ సంఘటనలో నిందితుడిని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగుర్(కే) గ్రామంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నాగుర్(కే) గ్రామానికి చెందిన నడిమిదొడ్డి శాంతమ్మకు కంగ్టిలోని ఏపీజీవీబీలో సేవింగ్ ఖాతా ఉంది. తొమ్మిది నెలల క్రితం ఆమె భర్త బాబు మృతి చెందడంతో రైతు బీమా డబ్బులు రూ.5 లక్షలు, కూతురు వివాహం జరగడంతో కల్యాణలక్ష్మి డబ్బులు రూ. 75 వేలు ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ ఖాతాల్లో సొమ్ము వచ్చేలా చూడాలని గ్రామంలో పైరవీలు చేసే వాగ్మారే తుకారాంకు బాధిత మహిళ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చింది. ఈ క్రమంలో తుకారాం మహిళను నమ్మించి మాయ మాట లు చెప్పి ఏటీఎం కార్డు సైతం తస్కరించాడు. శాంతమ్మ ఖాతాలో ఉన్న డబ్బులు కాజేయాల ని పథకం వేశాడు. అంతలోనే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి సెల్‌ఫోన్ పోగొట్టుకున్నాడు. అది తుకారాంకు దొరికింది. రాజు తన సిమ్ కార్డును రిచార్జీ చేసి దాన్ని వేరే ఫోన్లో యాక్టివేట్ చేయించుకొన్నాడు. తనకు దొరికిన ఫోన్లోని నంబర్‌ను శాంతమ్మ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకొనేందుకు మరో మహిళను తీసుకువెళ్లాడు. బ్యాంకులో మరో మహిళ ను పరిచయం చేసి ఆమె శాంతమ్మ అని ఫోన్ నంబర్ లింక్ చేయాలంటూ దరఖాస్తు చేయించాడు. దీంతో తుకారాం మార్గం సుగమం అయింది. తస్కరించిన ఏటీఎం కార్డును ఉపయోగించి తన మొబైల్లో గుగూల్‌పే యాప్‌లో డబ్బులను దశల వారీగా డ్రా చేయడం ప్రారంభించాడు. ఇలా రెండు నెలల వ్యవధిలో రూ. 2.5 లక్షలు డ్రా చేశాడు. గత నెల 29వ తేదిన శాంతమ్మ బ్యాంకుకు వెళ్లి ఆరా తీసి రూ. 2.5 లక్షలు డ్రా చేసినట్లు తేలడంతో గగ్గోలు పెట్టింది. ఏడుస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వివరాలు తెలుసుకొన్న పోలీసులు గురువారం నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి రూ. 2.4 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. నిందితున్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నారాయణ, సిబ్బంది ప్రేమ్‌సింగ్, తుకారం ఉన్నారు. -
కార్డు ఇక్కడ.. డబ్బు డ్రా చేసింది వైజాగ్‌లో..
ఆత్మకూరు: ఏటీఎం కార్డు తన వద్ద ఉండగా ఖాతాలోని నగదు రూ.40 వేలు డ్రా చేసినట్లుగా ఫోన్‌కు సమాచారం అందడంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బేల్దారి పనులు చేసే బడే వీరరాఘవులురెడ్డికి స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అతని బ్యాంకు ఖాతా నుంచి తొలుత రూ.20 వేలు ఏటీఎంలో డ్రా చేసినట్లు, అనంతరం కొద్దిసేపటికే మరో రూ.20 వేలు వేరొకరి ఖాతాలోకి బదిలీ అయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందింది. ఆలస్యంగా చూసుకున్న వీరరాఘవులురెడ్డి బ్యాంక్ అధికారులను సంప్రదించగా అతని ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.40 వేలు (ఏటీఎం ద్వారా, బదిలీ రూపంలో) వైజాగ్‌లో డ్రా చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. నగదు ఆ ఖాతా నుంచి కొద్దినిమిషాలకే ఛత్తీస్‌ఘడ్‌లోని మరొకరి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించి బాధితుడికి సమాచారం చెప్పారు. ఏటీఎం కార్డు తన వద్ద ఉండగానే తన ప్రమేయం లేకుండా ఖాతా నుంచి నగదు ఎలా మాయమవుతుందని బాధితుడు ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు వారికి తెలిపారు. దీంతో బుధవారం ఎస్సై పి.నరేష్‌కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తామని ఎస్సై వెల్లడించారు. -
కథువా కుటుంబానికి మరో షాక్
కశ్మీర్ : డిజిటల్ బ్యాంకింగ్ వంటి నూతన పోకడల వల్ల నిరక్షరాస్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ వార్త మన కళ్లకు కడుతుంది. గతేడాది జనవరిలో కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఆలయంలో బంధించి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కన్న బిడ్డను పోగొట్టుకున్న బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోనేలేదు. అప్పుడే వారికి మరోక షాక్ తగిలింది. బిడ్డ మరణంతో కుమిలి పోతున్న వారిని ఆదుకోవాడానికి విరాళాలు ఇచ్చారు కొందరు మానవతా వాదులు. కానీ జనాలు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారంటే.. అలా వచ్చిన సొమ్మును కూడా కాజేశారు. అది కూడా దర్జాగా బ్యాంక్ ఖాతా నుంచి కొట్టేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతా నుంచి ఖాతాదారునికి తెలియకుండా డ్రా చేశారు. వివరాలు.. కథువా సంఘటన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణ ప్రారంభించాయి. అలా వచ్చిన సొమ్మును బాధితురాలి తండ్రితో పాటు వారి కుటుంబానికి చెందిన అస్లాం ఖాన్ అనే వ్యక్తి పేరు మీద తీసిన జాయింట్ అకౌంట్లో వేశారు. ప్రస్తుతం ఈ అకౌంట్ నుంచి తనకు తెలియకుండా ఎవరో ఏకంగా 10 లక్షల రూపాయలను విత్‌డ్రా చేశారని బాధితురాలి తండ్రి వాపోతున్నాడు. తనకు చదువు రాదని.. ఈ మోసం ఎలా జరిగిందో తనకు తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.అంతేకాక ఈ విషయం గురించి అస్లాం ఖాన్‌ను ప్రశ్నించినప్పుడు అతడు సరిగా స్పందించలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. తనకు అతని మీద అనుమానం ఉందని పేర్కొన్నాడు. గత నెల జనవరి నుంచి నేటి వరకు తన అకౌంట్ నుంచి రూ. 22 లక్షలు డ్రా చేశారని తెలిపాడు. వాటిలో ఓ పది లక్షల రూపాయలు మాత్రమే తాను తీసుకున్నానని.. మిగతా మొత్తం గురించి తనకు తెలీదని వాపోతున్నాడు. ఈ విషయం గురించి బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా.. చెక్కులు తీసుకొచ్చి సొమ్ము డ్రా చేశారని.. వాటిలో అన్ని వివరాలు సరిగా ఉండటంతో సొమ్ము ఇచ్చామన్నారు. కొన్ని ట్రాన్సాక్షన్లు అస్లాం ఖాన్ పేరు మీద జరగ్గా.. మరి కొన్ని ట్రాన్సాక్షన్లు నజీమ్ అనే వ్యక్తి పేరు మీద జరిగినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా తెలిసిన వారే ఈ పని చేసుంటారని అధికారలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
‘మీ సేవ’లో నగదు
ఆదిలాబాద్‌అర్బన్: బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఎటీఎంలు, బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లోనూ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు పేరు, ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుంది. డబ్బులు చేతికొస్తాయి. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా నగదు చెల్లింపులకు ఆర్బీఐ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఆగస్టు 1 నుంచి ప్రారంభించింది. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఈ విధానాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభించే సాధ్యాసాధ్యాలపై మీసేవ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఏర్పడిన నగదు కొరత, పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన నగదు సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. పనిచేసేదిలా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఆధార్ సమన్వయంతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం’(ఏఈపీఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టం ద్వారా మీ సేవ కేంద్రానికి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ నంబర్, బ్యాంకు పేరు చెప్పి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి. బ్యాంకు ఖాతా నంబర్ చెప్పకుండానే డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. త్వరలో మీ సేవలో ఈ సిస్టం అందుబాటులోకి రానుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి వివిధ రకాల నాలుగు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుందాం.. డబ్బు డ్రా చేసేందుకు సదరు వ్యక్తి మీ సేవ కేంద్రానికి వచ్చినప్పుడు ఆధార్ వివరాలు చెప్పాలి. ఇదివరకే బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానమై ఉంది. మీ సేవ నిర్వాహకులు ఏఈపీఎస్ సిస్టంలో ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ వ్యక్తి పేరు మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయనేది స్పష్టంగా కన్పిస్తాయి. వ్యక్తి అభిప్రాయం మేరకు సదరు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా చేసి రశీదుతోపాటు నగదును మీసేవ నిర్వాహకులు సదరు వ్యక్తికి అందజేస్తారు. ఇలా ఒక రోజులో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో అన్ని చోట బ్యాంకు బ్రాంచీలు అందుబాటులో లేవు. కానీ.. మీ సేవ కేంద్రాలు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. దీని దృష్ట్యా మీ సేవ కేంద్రాల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసిస్తే.. నగదు కొరతను అధిగమించవచ్చనే దిశగా ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 93 వివిధ బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచీల పరిధిలో ప్రస్తుతం 12,86,171 మంది ఖాతాదారులు ఉన్నారు. జిల్లాలో 76 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. బ్యాంకు బ్రాంచీల కన్నా మీ సేవ కేంద్రాలు తక్కువగా ఉన్నా.. ఎక్కువ శాతం మీ సేవ సెంటర్లు గ్రామాల్లోనే ఉన్నాయి. మీసేవ కార్యకలాపాలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతుంటాయి. వివిధ రకాల సర్టిఫికెట్లు, ధ్రువపత్రాల జారీ, కరెంట్ బిల్లుల రూపంలో మీ సేవలకు వచ్చిన నగదును బ్యాంకు లావాదేవీలకు వాడనున్నారు. ఆధార్ ఆధారిత లావాదేవీలను ప్రవేశపెట్టడంతో ఇటు బ్యాంకులకు.. అటు మీ సేవ నిర్వాహకులకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. బ్యాంకు తరఫున లావాదేవీలు నిర్వహించినందుకు మీ సేవ కేంద్రం ఆపరేటర్లకు అదనపు ఆధాయం లభిస్తుంది. మీ సేవలకు వివిధ రకాల సేవలు అందించినందుకు చార్జీల రూపంలో వచ్చిన మొత్తాన్ని ఈఎస్డీ విభాగానికి పంపేందుకు ఆపరేటర్లు బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయాల్సి వస్తోంది. ఇలా డిపాజిట్ చేసినందుకుగాను సహజంగానే బ్యాంకు క్యాష్ హ్యాడ్లింగ్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆపరేటర్లు తమ కష్టార్జీతాన్ని ఈ రూపంలో కోల్పోవాల్సి వస్తోంది. తాజా విధానంతో వినియోగదారులకే సొమ్ము అందించడంతో బ్యాంకుకు చెల్లించే చార్జీలు తగ్గడంతోపాటు అదనపు ఆదాయం రానున్నదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభం కావచ్చు మీ సేవ కేంద్రాల్లో బ్యాంకు సేవలను అక్టోబర్ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఆగస్టు 1 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విధానంతో నగదు కొరత అనేది ఉండదు. ఖాతాదారులకు బ్యాంకులు, ఏటీఎం చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయి. – రఘువీర్‌సింగ్, మీసేవ జిల్లా కో–ఆర్డినేటర్, ఆదిలాబాద్ -
ఇదేం ఏటీఎం బాబోయ్!
కర్నూలు, పగిడ్యాల: స్థానిక బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన ఇండియా ఏటీఎంలో రూ. 500 నోటుకు బదులు రూ. 100 నోటు వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోయారు. విద్యుత్ బిల్ రీడింగ్ ఆపరేటర్‌గా పనిచేసే కేశవనాయుడు గురువారం ఉదయం తన ఖాతా నుంచి ఏటీఎం ద్వారా రూ.2 వేలు డ్రా చేసేందుకు కంప్యూటర్లో నమోదు చేశాడు. అయితే కేవలం 4 వంద నోట్లు మాత్రమే వచ్చాయి. వెంటనే రూ.రెండు వేలు డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చినట్లు బాధితుడు వాపోయాడు. బీరవోలుకు చెందిన రాఘవరెడ్డి మొదటి సారి రూ. 500 డ్రా చేస్తే ఒక వంద నోటు రాగా మళ్లీ రూ. 4500 విత్‌డ్రా చేయగా వంద నోట్లు ఐదు రావడంతో లబోదిబోమన్నాడు. పగిడ్యాలకు చెందిన మరో వినియోగదారుడు నాగన్న రూ. 2వేలు డ్రా చేస్తే నాలుగు వంద నోట్లు వచ్చాయి. దీంతో అతడు వెంటనే మినీ స్టేట్మెంట్ తీయగా రూ.2 వేలు డ్రా చేసినట్లు వచ్చింది. చివరకు బాధితులు ఇండియా ఏటీఎం టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేశారు. అయితే కంపెనీ వారు ఏటీఎం కార్డు ఏ బ్యాంక్‌కు సంబంధించినదో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు బాధితులు వాపోయారు. -
ఏటీఎంల నుంచి ఎంతైనా తీసుకోవచ్చు!
-
ఏటీఎంల నుంచి ఎంతైనా తీసుకోవచ్చు!
పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు కొంతవరకు తీరేలాగే కనిపిస్తున్నాయి. ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడానికి ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను డిసెంబర్ 30వ తేదీ తర్వాత నుంచి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎంల నుంచి ఒకసారి రూ. 2500 మాత్రమే తీసుకోడానికి వీలున్న విషయం తెలిసిందే. అలా కాకుండా, మన ఖాతాలో ఉన్న మొత్తం.. బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునే మొత్తం మీద కూడా ఆంక్షలు ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి రూ. 24వేలు మాత్రమే తీసుకోడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఇక నగదు కొరత అనేది ఉండబోదని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.