ఏటీఎంల నుంచి ఎంతైనా తీసుకోవచ్చు!
పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు కొంతవరకు తీరేలాగే కనిపిస్తున్నాయి. ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడానికి ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను డిసెంబర్ 30వ తేదీ తర్వాత నుంచి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎంల నుంచి ఒకసారి రూ. 2500 మాత్రమే తీసుకోడానికి వీలున్న విషయం తెలిసిందే. అలా కాకుండా, మన ఖాతాలో ఉన్న మొత్తం.. బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అవకాశం ఉంటుంది.
అలాగే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునే మొత్తం మీద కూడా ఆంక్షలు ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి రూ. 24వేలు మాత్రమే తీసుకోడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఇక నగదు కొరత అనేది ఉండబోదని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.