monkhood
-
200 కోట్ల ఆస్తిని దానం చేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు
గాంధీ నగర్ : వాళ్లిద్దరూ భార్యభర్తలు. వ్యాపార సామ్రాజ్యం. వందల కోట్లలో ఆస్తులు. సమాజంలో బోలెడంత పలుకుబడి. కానీ పైవేవి వాళ్లిద్దరికి సంతృప్తినివ్వలేదు. అందుకే ఇప్పటికే సన్యాసం స్వీకరించిన కొడుకు, కుమార్తెల బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ కుబేరుల నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ సబర్కాంత జిల్లా వాసి భావేష్ భండారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం ఊపందుకుంది. ఊహించనంత లాభాల్ని కళ్ల జూశారు. ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. కానీ ఈ ఆస్తి పాస్తులు, వ్యాపారం ఆ దంపతులకు ఏ మాత్రం సంతృప్తి నివ్వలేదు. పిల్లల బాటలో తల్లిదండ్రులు చివరికి భావేష్ బండారి దంపతులిద్దరి 19 ఏళ్ల కుమార్తె , 16 ఏళ్ల కుమారుడు బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పిల్లలిద్దరూ 2022లో సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన భావేష్ బండారి దంపతులు.. తమ పిల్లలులాగే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 200 కోట్లు విరాళం సన్యాసానికి సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి, అతని భార్య తమ సంపద రూ.200 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగే కార్యక్రమంలో అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. మోక్షం పొందేదుకు యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు. చెప్పులు లేకుండా భండారీ దంపతులు, మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా బయలు దేరనున్నారు. అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేయనున్నారు. ఆ తర్వాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. భిక్ష కోసం ఒక గిన్నె తీసుకుని దేశం అంతటా చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు. భిక్షతో మాత్రమే జీవిస్తారు. -
వాళ్లు సన్యాసం స్వీకరిస్తే.. ఆ బుజ్జాయి సంగతేంటి?
అహ్మదాబాద్: జైన దంపతులు సుమిత్ రాథోడ్, అనామిక తమ మూడేళ్ల కూతురిని, వందకోట్ల సంపదను వదిలి సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గుజరాత్ బాలల హక్కుల సంస్థ ఈ వ్యవహారంపై స్పందించింది. జైన దంపతులు సన్యాసం స్వీకరిస్తున్న నేపథ్యంలో వారి కూతురి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరింది. మధ్యప్రదేశ్ జైనదంపతులైన సుమిత్, రాథోడ్ జైనమత సాధువులుగా మారాలని నిర్ణయించుకున్నారు. తమ మూడేళ్ల కూతురిని, రూ. 100 కోట్ల సందపను వదిలి..శ్వేతబంర జైనసాధువులుగా మారుతున్నామని వారు ప్రకటించడం చర్ఛనీయాంశమైన సంగతి తెలిసిందే. శనివారం సూరత్ లో జరిగే దీక్షా క్రతువు ద్వారా ఆ జైన దంపతులు సాధువులుగా మారనున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి కూతురి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడని, ఆ పాపాయిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని గుజరాత్ బాలల హక్కుల కమిషన్ ను కోరారని కమిషన్ చైర్ పర్సన్ జాగృతి పాండే తెలిపారు. జైనదంపతుల సన్యాస దీక్ష కార్యక్రమం సూరత్ లో జరుగుతున్న నేపథ్యంలో వారి చిన్నారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకొని తమకు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్టు తెలిపారు. అయితే, అనామిక తండ్రి, బీజేపీ నీముచ్ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ చండిలాయ తెలిపారు. -
100 కోట్లు, మూడేళ్ల కూతుర్ని వదులుకుని..
సాక్షి, భోపాల్ : డబ్బుంటేనే తమ సమస్యలు తీరుతాయి అనుకునేవారు కొందరు. కోట్ల ఆస్తిని వదిలేసినా ఏ సమస్యా లేకుండా జీవించవచ్చునని నమ్మేవారు మరికొందరు. మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు రెండో కోవకే చెందుతారు. కానీ జైన్ వర్గానికి చెందిన భార్యాభర్తలు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ లోని నీమచ్ కు సుమీత్ రాథోడ్(35), అనామిక(34) లకు రూ.100 కోట్లకు పైగా ఆస్తి ఉంది. వీరికి మూడేళ్ల పాప సంతానం. అయితే వీరు వందకోట్ల ఆస్తితో పాటు తమ మూడేళ్ల చిన్నారిని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం కొన్ని రోజుల్లో వీరు సన్యాసం స్వీకరించనున్నారు. గుజరాత్ లోని సూరత్‌కు చెందిన సుధామార్గి ఆచార్య రామ్‌లాల్ మహరాజ్ కింద వీరు శిష్యులుగా ఉండనున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. సెప్టెంబర్ 23న ఇందుకు తాము తొలి అడుగు వేయనున్నట్లు సుమీత్ దంపతులు చెబుతున్నారు. మూడేళ్ల కూతురు ఐభ్య పరిస్థితి ఏమౌతుందో ఆలోచించుకోవాలని, ఆధ్యాత్మికత వైపునకు వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని బంధువులతో పాటు వీరి స్నేహితులు, స్థానికులు చెప్పిచూసినా లాభం లేకపోయింది. 100 కోట్ల ఆస్తిని, మూడేళ్ల పాపను వద్దనుకుని.. మీరు ఏం పనిచేస్తున్నారో అర్థమవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ వ్యాపారి, సిమెంట్ ఫ్యాక్టరీల అధినేత అయిన సుమీత్ తండ్రి రాజేంద్ర సింగ్ రాథోడ్ వీరి నిర్ణయానికి మద్ధతు తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టు 22న సుమీత్ తాను ఆధ్యాత్మికత దిశగా వెళ్తున్నానని చెప్పగా భార్య అనామిక తాను కూడా వెంట ఉంటానని భర్త దారినే ఎంచుకున్నారు.