Montessori school
-
యూపీ స్కూల్లో విద్యార్థిని మృతి.. అనుమానాలు
సాక్షి, డియోరియా: ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉదంతం మరిచిపోక ముందే ఉత్తర ప్రదేశ్ లో మరో విద్యార్థిని మరణం సంచలనంగా మారింది. డియోరియా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో అంతస్థు నుంచి పడి బాలిక మృతి చెందగా, అది హత్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడ్రన్ సిటీ మాంటిస్సోరీ స్కూల్లో నీతూ చౌహాన్(16) 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడో అంతస్థులోని టాయ్ లెట్‌కి వెళ్లింది. ఎంత సేపటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా.. రక్తపు మడగులో కింది ఫ్లోర్లో పడి ఉంది. వెంటనే విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లగా.. వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. అయితే ఆమెను హత్య చేశారని నీతూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ‘స్కూల్ యాజమాన్యం మాకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఘటన తర్వాత ప్రిన్సిపాల్ ఆద్య తివారీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. తోటి విద్యార్థినులు వచ్చి ఘటన గురించి మాకు తెలియజేశారు’ అని ఆమె తండ్రి పరమహంస్ చౌహాన్ చెబుతున్నారు. ఆస్పత్రికి తరలించే సమయంలో ఆమె తన సోదరుడితో ఎవరో వెనకాల నుంచి తనను తోసేసినట్లు చెప్పిందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇక స్కూల్ యాజమాన్యం మాత్రం తాము త్వరగానే స్పందించామని చెబుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ సిస్టమ్ గత కొంతకాలంగా పని చేయకపోవటంతో ఫుటేజీని స్వాధీనం చేసుకోలేకపోయామని సీనియర్ అధికారి రాజీవ్ మల్హోత్రా చెప్పారు. ఫోరెనిక్స్ బృందం ఘటనా స్థలి నుంచి ఆధారాలు సేకరించిందని, కేసును వీలైనంత త్వరగా చేధిస్తామని ఆయన అంటున్నారు. -
వెల్కం టూ న్యూ ఇయర్
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : తాడేపల్లిగూడెం మాంటిస్సోరి విద్యార్థులు శనివారం ఇదిగో ఇలా నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌తో పాటు జంక్ ఫుడ్లను పూర్తిగా నిషేధిస్తామని ప్రతినబూనారు. పాఠశాల డైరెక్టర్ ఎంఎల్ఎస్ఎ న్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జనాగ్రహం
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన టేకులపల్లి : జనం కన్నెర్రజేశారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందంటూ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. టేకులపల్లిలో వినూత్న ప్రదర్శన నిర్వహించి సర్కారు వైఖరిని ఎండగట్టారు. సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నిరసన శుక్రవారం జరిగింది. మాంటిస్సోరీ స్కూల్ సమీపంలోని గ్రౌండ్ నుంచి బయల్దేరిన ఈ ప్రదర్శన తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. అనంతరం న్యూడెమోక్రసీ నాయకులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పింఛను రాలేదనే మనస్తాపంతో గుండెపోటు వచ్చి మరణించిన వృద్ధులుగా అరుణోదయ కళాకారులు ర్యాలీ సందర్భంగా చేసిన అభినయం సమకాలిన పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చే తీరక లేదన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తిస్తున్నారనివిమర్శించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవరిస్తున్నారన్నారు. తమ బతులు బాగుపడతాయనే నమ్మకంతో అధికారంలోకి తెచ్చిన ప్రజలను టీఆర్ఎస్ సర్కారు విస్మరించిందని ధ్వజమెత్తారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వాలని, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, గిరిజనుల భూముల్లో ఫారెస్టు అధికారుల దారులు, పంట ధ్వంసం చర్యలను నిలిపివేయాలని అన్నారు. కార్యక్రమంలో గుర్రం అచ్చయ్య, ఎట్టి ప్రసాద్, డి.ప్రసాద్, ధర్మపురి వీరబ్రహ్మాచారి, జర్పుల సుందర్, గణితి కోటేశ్వరరావు, రాంచంద్, రాములు, పోతయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈత.. విషాదం
వారు ముగ్గురు స్నేహితులు.. ఎప్పుడూ కలిసి తిరి గే వారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెల వు ఇవ్వడంతో చెరువులో స్నానానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు చెరువులో ఉన్న గుంతలో పడి నీట మునిగిపోయారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్నబిడ్డలు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు వారిని చూసి గుండెలవిసేలా రోది స్తున్నారు. ‘ఇక మాకెవరు దిక్కు బిడ్డా.. ఎవల కో సం బతకాలి’ అని వారు రోదిస్తున్న తీరు అందరి నీ కలిచివేస్తోంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ము లున్నారు. ఈ హృదయ విదారక సంఘటన హుజూరాబాద్ మండలం కనుకులగిద్దలో శుక్రవారం జరిగింది. చింతకుంటలో జరిగిన మరో ప్రమాదంలో ఓ ఆరో తరగతి విద్యార్థి నీటి గుంతలో పడి చనిపోయాడు. హుజూరాబాద్ /హుజూరాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : హుజూరాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన అల్లి రమేశ్ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమేశ్, పుష్పలత దంపతులకు రోహి త్ (12), ప్రణీత్ (10) ఇద్దరే సంతానం. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో రోహిత్ ఆరో తరగతి చదువుతుండగా, ప్రణీత్ నాలుగో తరగతి చదువుతున్నా డు. ఇదే గ్రామానికి చెందిన దాసరి చంద్రారెడ్డి, సరోజన దంపతుల ఒక్కగానొక్క కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి(గణేశ్) (15) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరు ముగ్గురితోపాటు మరో ఇద్దరు శివాజీ, వినయ్ శుక్రవారం ఉదయం గిద్దె చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. రోహి త్, ప్రణీత్, గణేశ్ కలిసి చెరువులో దిగగా శివాజీ, వినయ్ ఒడ్డుపైనే కూర్చున్నారు. చెరువులో గుంత ఉన్న విషయాన్ని పసిగట్టలేక ముగ్గురు చిన్నారులు అందు లో మునిగారు. తాము మునిగిపోతున్నామని కేకలు వేయడంతో ఒడ్డుపై కూర్చున్న ఇద్దరు చిన్నారులు హు టాహుటిన గ్రామంలోకి పరుగెత్తుకొచ్చారు. ఈ విషయాన్ని అక్కడున్న వాళ్లకు చెప్పడంతో వారు చెరువు వద్దకు వెళ్లేసరికి ప్రణీత్, గణేశ్ నీటిలో పూర్తిగా మునిగి పోయారు. రోహిత్ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా బయటకు తీశారు. హుజూరాబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అత డు కూడా చనిపోయాడు. ప్రణీత్, గణేశ్‌ల ఆచూకీ కో సం చెరువులో గాలించగా వారి మృతదేహాలు కనిపిం చాయి. సంఘటన స్థలానికి హుజూరాబాద్ సీఐ శ్రీని వాస్, ఎస్సై జగదీశ్ వచ్చి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఒకే గ్రామానికి చెం దిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు కడుపు కోతే... అల్లి రమేశ్, పుష్పలత దంపతులు తమ కొడుకులు రోహిత్, ప్రణీత్‌లను అల్లారుముద్దుగా పెంచుకుంటూ కష్టపడి హుజూరాబాద్‌లో చదివిస్తున్నారు. కొడుకుల ను చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కడుపు కోతే మిగిలింది. ఒక్కగానొక్క కొడుకు. దాసరి చంద్రారెడ్డి, సరోజనలకు ఏకైక సంతానం గణే శ్. వీరిది వ్యవసాయ కుటుంబం. పెళ్లయిన తర్వాత ఆలస్యంగా జన్మించిన గణేశ్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కొడుకు కళ్లముందే ఉండాలని గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. చివరకు అతడు ఇలా చెరువులో తుది శ్వాస విడవడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలవు లేకున్నా బతికేవారు.. గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెలవు ఇవ్వడం తోనే ఈ ఘటన జరిగిందని, సెలవు లేకున్నా పిల్లలు బతికేవారని వారు తల్లిదండ్రులు రోదిస్తున్నారు. చింతకుంటలో ఆరో తరగతి విద్యార్థి.. కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : బోయినపల్లి మండ లం విలాసాగర్‌కు చెందిన సల్లా లచ్చయ్య, లత దంపతుల చిన్న కుమారుడు సాయికుమార్(12) ఓ నీటి గుంతలో పడి చనిపోయాడు. వీరు చింత కుంట శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. సా యికుమార్ ధన్గర్వాడి పాఠశాలలో చదువుతు న్నాడు. శుక్రవారం సోదరుడు సతీష్, స్నేహితులు నవీన్, కుమార్‌తో కలిసి ఇంటి సమీపంలో ఉన్న లోతైన గుంతకు ఈత కొట్టడానికి వెళ్లాడు. మొద ట సాయికుమార్, కుమార్ లోపలికి దిగారు. దిగి న వెంటనే మట్టిజారి మునిగిపోయారు. గమనిం చిన సతీష్ పరుగెత్తుకెళ్లి సమీపంలో ఉన్న ఒడిశా కార్మికులకు చెప్పగా వారు కుమార్‌ను కాపాడారు. సాయికుమార్ అప్పటికే మునిగిపోయాడు. కాసే పటికి అతడి మృతదేహం కనిపించింది. కొడుకు మృతదేహాన్నిచూసి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. -
గ్రిగ్ మెమోరియల్ పోటీలు ప్రారంభం
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : పోటీతత్వంతో ఆడి విజయం సొంతం చేసుకోవాలని గుడివాడ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి జి.వెంకటేశ్వరరావు సూచిం చారు. కృష్ణాజిల్లా సెకండరీ పాఠశాలల 77వ గ్రిగ్ మెమోరియల్ బాలికల సబ్జోన్ క్రీడలు గురువారం స్థానిక మాంటిస్సోరి పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను ఉప విద్యాశాఖ అధాకారి జి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ క్రీడల్లో డివిజన్లోని 60పాఠశాలలకు చెందిన 650మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఉపవిద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, పాఠశాల పతకాన్ని మండల విద్యాశాఖ అధికారి ఆర్.వి.సోమశేఖరరావు, క్రీడాపతకాన్ని మాంటిస్సోరి విద్యాసంస్థల కరస్పాం డెంట్ బొప్పన రాజేశ్వరి ఎగురవేశారు. అనంతరం డీవైఈవో మాట్లాడుతూ పోటీతత్వం ఉంటేనే విజయాలను సులభంగా అంది పుచ్చుకోవచ్చన్నారు. ఎంఈవో ఆర్.వి.సోమశేఖరరావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. పెదపారుపూడి ఎంఈవో హనుమంతరావు మాట్లాడుతూ ఒకప్పుడు బాలురకే పరిమితమైన ఆటలను నేడు బాలికలు కూడా ఆడి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించడం అభినందనీయమన్నారు. పట్టణ ప్రముఖులు బొగ్గారపు తిరపతయ్య, మహిళా సంఘం కార్యదర్శి వి.లక్ష్మి, వైస్ ప్రెసిడెంట్లు వి.శారద, జాస్తి రాజ్యలక్ష్మి, పాఠశాల ప్రధానోసపాధ్యాయుడు ఎన్.ఎస్.ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు తొలి రోజు కబడ్డీ జూనియర్స్ విభాగంలో ఏపీజేఆర్సీ నిమ్మకూరు, గుడివాడ ఫాదర్ బియాంకి స్కూల్ విద్యార్థులు తలపడ్డారు. ఏపీజేఆర్సీ నిమ్మకూరు జట్టు ఫైనల్స్‌కు చేరింది. బాల్‌బ్యాడ్మింటన్ జూనియర్స్ విభాగంలో జెడ్పీహెచ్ఎస్ కలిదిండి, జెడ్పీహెచ్ఎస్ దోసపాడుతో తలపడగా కలిదిండి ఫైనల్స్‌కు చేరింది. ఖోఖో సీనియర్స్ విభాగంలో జెడ్పీహెచ్ఎస్ కలిదిండి, బొమ్మినింపాడులు తలపడగా బొమ్మినింపాడు విద్యార్థులు ఫైనల్‌కు చేరారు. బందరు డివిజన్ బాలికల ఆటలపోటీలు ప్రారంభం చల్లపల్లి : చల్లపల్లి ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాల ఆవరణలో బందరు డివిజన్‌స్థాయి 77వ గ్రిగ్మెమోరియల్ బాలికల ఆటలపోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ టి.సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు పోటీపడాలని సూచించారు. హోరాహోరీగా పోటీలు బందరు డివిజన్లోని మచిలీపట్నం అర్బన్, రూరల్, గూడూరు, పెడన, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు పలు క్రీడల్లో పోటీపడుతున్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాల్‌బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, త్రోబాల్, టెన్నికాయిట్, షటిల్ విభాగాల్లో హోరాహోరీగా తలపడ్డారు. అండర్-14, 17 విభాగాల్లో రెండు రోజులపాటు ఈ పోటీలు జరుగనున్నాయి. 11 మండలాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనటంతో ఈ ప్రాంతం పండుగ వాతావరణం నెలకొంది. ఆయా మండలాల నుంచి 60మందికిపైగా పీడీ, పీఈటీలు ఈ పోటీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.