Mormugao
-
బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మర్ముగోవాపై నుంచి ప్రయోగించినట్లు ఆదివారం వెల్లడించారు. ఐఎన్ఎస్ మర్ముగోవాతోపాటు బ్రహ్మోస్ క్షిపణి కూడా దేశీయంగా తయారైనవేనని చెప్పారు. సముద్రజలాలపై మన నావికాదళ శక్తిని, దేశ ఆత్మనిర్భరతకు చాటిచెప్పే పరిణామమని వివరించారు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంతో ఇది దూసుకెళ్లిందన్నారు. భారత్–రష్యా ఉమ్మడిగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూమిపై నుంచి సైతం ప్రయోగించేందుకు వీలున్న బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తోంది. -
భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక.. ‘మర్ముగోవా’ జల ప్రవేశం
ముంబై: భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. శత్రుదుర్భేద్యమైన మిసైల్ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జలప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిల్లయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘ఈరోజు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాం. ఏడాది క్రితమే మనం సిస్టర్ షిప్ విశాకపట్నంను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాం. గత దశాబ్దకాలంలో యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో ఈ విజయం గొప్ప పురోగతిని సూచిస్తుంది. ఈ నౌకలకు నగరాల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాం.’ అని తెలిపారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్. మర్ముగోవా విశేషాలు.. ► ఈ యుద్ధనౌక రెండోతరానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిసైల్ విధ్వంసక నౌక. ► ప్రాజెక్టు 15బీ కింద ఈ యుద్ధ నౌకను రూపొందించారు. గోవాలోని ప్రముఖ పోర్టు సిటీ మర్ముగోవా నగరం పేరును ఈ వార్‌షిప్‌కు పెట్టారు. ► ఈ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు కాగా.. బరువు సుమారు 7,400 టన్నులు. అత్యధికంగా 30 నాటిక్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుందు. ►భారత నౌకాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం క్లాస్ విధ్వంసక నౌకల్లో ఇది రెండోది. దీనిని మజాగాన్ డాక్ నౌకానిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
నేవీ అమ్ముల పొదిలో 'ముర్ముగావ్'
-
క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ప్రారంభం
‘మోర్ముగావో’ను ఆవిష్కరించిన నేవీ చీఫ్ భార్య రీనా ముంబై: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ ‘మోర్ముగావో’ను శనివారం ప్రారంభించారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా ఈ నౌకను ఉదయం 11.50 గంటలకు ప్రారంభించి.. అరేబియా సముద్రంలోకి వదిలారు. ఎండీఎల్ తయారు చేసిన ఈ క్షిపణి నాశక నౌక ప్రపంచంలో ఉన్న అత్యాధునిక యుద్ధనౌకలతో సమానంగా పనిచేస్తుందని లాంబా తెలిపారు. అత్యాధునిక స్టెల్త్ డెస్ట్రాయర్‌ను అమర్చారన్నారు. దీన్ని విశాఖపట్నంలోని ఎండీఎల్‌లో 15బీ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారన్నారు.రూ. 29,700 కోట్లతో 15బీ నౌకల అభివృద్ధికి 2011లో కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం క్లాస్ కింద తొలి క్షిపణి నాశక నౌకను కిందటేడాది ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఈ నౌకలో ఉపరితలం నుంచి ఉపరితలానికి వెళ్లే క్షిపణులు, ఉపరితలం నుంచి గగనంలో దూసుకెళ్లే క్షిపణులు, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు ఉన్నాయి. 2020-24 మధ్య ఇలాంటి మరో 4 విధ్వంసక నౌకలను నిర్మిస్తామని ఎండీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. 1960 నుంచి భారత నేవీ, ఎండీఎల్‌లు నౌకలను నిర్మిస్తున్నాయి. ‘స్కార్పీన్’ లీకు ఫ్రాన్స్‌లో... సంచలనం సృష్టించిన స్కార్పీన్ జలాంతర్గాముల రహస్య పత్రాలు బహిర్గతమైంది ఫ్రాన్స్ రక్షణ విభాగ సంస్థ డీసీఎన్ఎస్లోనని, భారత్‌లో కాదని దర్యాప్తులో తేలినట్టు లాంబా చెప్పారు. -
నేవీ అమ్ముల పొదిలో 'ముర్ముగావ్'
ముంబై: ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంలో రూపొందించింన స్వదేశీ యుద్ధ నౌక ముర్ముగావ్ ను ముంబైలో ప్రారంభించారు. దీనిని ఇండియన్ నేవీ చీఫ్ సునిల్ లాంబా సతీమని రీనా లాంబా ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక ప్రపంచంలోనే అత్యుత్తమంగా పని చేస్తుందని,అనేక పరీక్షల అనంతరం దీనిని సముద్రంలోకి ప్రవేశపెడుతున్నట్టు సునీల్ లాంబా అన్నారు. దీనిని విశాఖపట్నంలోని మజ్ గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎమ్ డీఎల్) లో ప్రాజెక్ట్ 15బి లో భాగంగా నిర్మించారు.