Morning Walking
-
Silent walking: మనతో మనం మాత్రమే
మార్నింగ్ వాక్కు గుంపుగా బయలుదేరుతారు కొందరు. తోడు లేనిదే కదలరు కొందరు. ఒంటరిగా బయలుదేరితే పాటలు వింటూ నడుస్తారు కొందరు. లేదా ఫోన్లు మాట్లాడుతూ ఉభయతారకంగా నడుస్తారు ఇక మనతో మనం ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ‘సైలెంట్ వాకింగ్’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఫోన్లు, సాటి మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మనతో మనం ఉంటూ నడవడం. దీనివల్ల మానసికంగా, భౌతికంగా ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ టీచర్ విశ్వనాథం. ఆయన తన అపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు నలుగురితో కలిసి ఉదయాన్నే వాకింగ్‌కు వెళతారు. ఫోన్ తీసుకువెళతారు. ఆ ముగ్గురు నలుగురు కలవగానే ఇక కబుర్లు మొదలు. నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా ఎంతలేదన్నా రాజకీయాలు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు చర్చకు వస్తాయి. ఏవో పాత గొడవలు గుర్తుకు వస్తాయి. చిన్నపాటి వాదనలు జరుగుతాయి. ఈలోపు మెసేజ్‌లు, ఫేస్బుక్ చెకింగు, ఒక ఫోన్ కాల్ ఎవరిదో మాట్లాడటం... ఉదయాన్నే మనసు, శరీరం తేలిక కావాల్సింది పోయి బరువైపోతాయి. ఐ.టి. ఫీల్డ్‌లో పని చేసే అవివాహిత చందన సాయంత్రం ఇల్లు చేరుకుని వాకింగ్‌కు బయలుదేరుతుంది. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ నడుస్తుంటుంది. ఆ పాటల్లో పూర్తిగా లీనం కాకుండా మెసేజ్‌లు, కాల్సూ వస్తూనే ఉంటాయి. పాటలు కూడా విన్నవే వినడం వల్ల కొత్త అనుభూతి కలగదు. పాటలు వినాలి కాబట్టి వింటున్నానా అనే సందేహం వస్తుంది. గృహిణి సుభాషిణి సాయంత్రం వీలు చూసుకుని ఎలాగో వాకింగ్‌కు బయలుదేరుతుంది. కాని ఆమె వాకింగ్‌కు బయలుదేరిన వెంటనే ఊళ్లో ఉన్న తల్లికి ఫోన్ చేయాలి. అది తల్లి ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్. కూతురితో మాట్లాడకపోతే ఆమెకు తోచదు. సుభాషిణి వాకింగ్ మొదలెట్టి తల్లికి కాల్ చేయగానే తల్లి ఏవేవో విషయాలు ఏకరువు పెడుతుంది. కొన్ని ఫిర్యాదులు, కొడుకు మీద అభ్యంతరాలు, ఇంకేవో ఇరుగు పొరుగు గాసిప్... ఎంత లేదన్నా అలజడి కలిగిస్తాయి. ఇదా వాకింగ్ అంటే. ► సైలెంట్ వాకింగ్ విరుగుడు టిక్‌టాక్ ఇన్ఫ్లూయెన్సర్ మాడీ మాయో మొన్నటి సెప్టెంబర్‌లో ఈ ‘సైలెంట్ వాకింగ్’ను ప్రతిపాదించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా అన్ని లంపటాలను వదిలి ఎవరితోనూ వాగుడు పెట్టుకోకుండా హాయిగా మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం చాలా బాగుంది అని ఆమె పెట్టిన ఒక పోస్టు ఆమెను ఫాలో అయ్యే యువతకు నచ్చింది. అప్పటి నుంచి సైలెంట్ వాకింగ్ మెల్లమెల్లగా ప్రచారం పొందింది. ► మన గురించి ఆలోచిస్తున్నామా? మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి, మన లక్ష్యం వైపు దృష్టి నిలపడానికి ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఆఖరుకు నడకలో కూడా ఏదో ఒక అంతరాయం. ఇంటి నుంచి బయటకు వచ్చినా ఇంటి నుంచి ఫోన్ వస్తే ఇక ఇంట్లో ఉన్నట్టే తప్ప బయట ఉన్నట్టు అనిపించదు. ‘సైలెంట్ వాకింగ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి మన ఆలోచనలు మనల్ని వినేలా చేస్తుంది... రెండు ప్రకృతిని విని స్పందించేలా చేస్తుంది’ అని ఒక సైలెంట్ వాకర్ చెప్పింది. మరో స్టూడెంట్ అయితే ‘ఫోన్లు పారేసి హాయిగా అరగంట సేపు నడిస్తే నాకు చాలా స్వేచ్చతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదీగాక నా చదువు మీద దృష్టి నిలుస్తోంది’ అని చెప్పింది. ► వొత్తిడి తగ్గుతుంది భవ బంధాలు తెంచుకున్నట్టుగా ఏ కమ్యూనికేషన్ లేకుండా కనీసం రోజులో 30 నిమిషాలు ఒక రకమైన ఏకాంత సమయం గడపడమే సైలెంట్ వాకింగ్. దీని వల్ల యాంగ్జయిటీ వంటివి తగ్గి మానసికంగా ఒక ప్రశాంతత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఐదు నిమిషాలు ఫోన్ కనపడకపోతే కంగారు పడేవారు అరగంట ఫోన్‌ను ఇంట్లో పడేసి బయట పడి నడిస్తే ఆ స్వేచ్ఛ మనసుకు దొరుకుతుంది. ఈ అరగంటలో కొంపలేమీ మునిగిపోవు అని తెలుస్తుంది. మన గుప్పిట్లో ఫోన్ ఉన్నంత సేపు మెడ మీద కత్తి వేళ్లాడుతున్న భావనే... ఎప్పుడు ఎవరు ఏ విధంగా డిస్ట్రబ్ చేస్తారో తెలియదు కదా. ధ్యానంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం, ఆలోచనలను పరిశీలించుకోవడం ముఖ్యం అంటారు. సైలెంట్ వాకింగ్‌లో నడుస్తూ అలాంటి పనే చేస్తాం. క్రిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు పోయేందుకు దోహదం చేసేదే సైలెంట్ వాకింగ్. మౌన మునులుగా మారి రేపటి నుంచి మౌన నడకకు బయలుదేరండి. -
Hyderabad: స్పోర్ట్స్ బైక్ ఢీకొని ఇద్దరు మహిళలు.. మృతి
నగర రహదారులు ఆదివారం రక్తసిక్తంగా మారాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. బొల్లారం పరిధిలో ఇద్దరు మహిళలు మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని రోడ్డు దాటుతుండగా స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈసీఐఎల్ చౌరస్తాలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు యువకులు, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పరిధిలో విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు, రాజేంద్రనగర్‌లో బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బైక్ అదుపు తప్పి.. హైలాండ్‌ను ఢీకొట్టి.. కాప్రా: మౌలాలీ నుంచి కుషాయిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈసీఐఎల్ చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి అంబేడ్కర్ స్టాచ్యూ హైలాండ్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కుషాయిగూడ పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే ప్రమాదం చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులు మౌలాలీకి చెందిన క్రాంతి, జనగామకు చెందిన నరేష్‌గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మార్నింగ్ వాక్ ముగించుకుని.. రోడ్డు దాటుతుండగా.. రసూల్‌పురా: బొల్లారం రిసాలబజార్‌కు చెందిన రాధిక (48), కళాసిగూడ సాయి కాలనీకి చెందిన పొలం బాలమణి (60) స్నేహితులు. వీరు కొన్నేళ్లుగా ప్రతిరోజు బొల్లారంలోని కంటోన్మెంట్ పార్క్‌కు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తున్నారు. ఆదివారం ఉదయం వాకింగ్ ముగించుకుని రోడ్డు దాటుతున్న సమయంలో ఉప్పల్‌కు చెందిన ఆదిత్య అనే యువకుడు స్పోర్ట్స్ బైక్‌పై అతివేగంగా శామీర్‌పేట్ వైపు వెళ్తూ రాధిక, బాలమణిలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వీరిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యువకుడు ఆదిత్య చేయి విరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీ మాధవి పేర్కొన్నారు. అన్నదమ్ములిద్దరూ అనంత లోకాలకు.. శామీర్‌పేట్: తమ్ముడిని హాస్టల్లో చేర్చేందుకు బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన మహేశ్ (20), తమ్ముడు కృష్ణ (10)తో పాటు మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేట్– బాబాగూడ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అన్న మహేశ్‌తో పాటు కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శామీర్‌పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. రాజేంద్రనగర్: వేగంగా దూసుకువచ్చిన కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బుద్వేల్ రైల్వే స్టేషన్‌కు చెందిన రవికాంత్ (35) ఉస్మానియా ఆస్పత్రిలో ఎలక్ట్రీషన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి ఆరాంఘర్ సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టడంతో అతడు దాదాపు 20 మీటర్ల దూరం ఎగిరిపడి మెట్రో క్లాసిక్ గార్డెన్ వద్ద పడి మృతి చెందాడు. అక్కడినుంచి కారు డ్రైవర్ పరారయ్యాడు. కారులో ఉన్న రెండు మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరురాలైంది!!
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపుతడుతుందో చెప్పలేం! ఒక్కొసారి వారి జీవితం అనూహ్య మలుపు తిరగడం కూడా జరుగుతుంది. అలాంటి అనూహ్య సంఘటనే జరిగింది. ఎప్పటిలాగే మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఓ మహిళకు అదృష్టం 4 క్యారెట్ల డైమండ్ రూపంలో కలిసిసొచ్చింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నొరీన్ రిడ్ బెర్గ్ అనే మహిళ ప్రతిరోజూ మాదిరిగానే సమీపంలోని అర్కన్సాస్ స్టేట్ పార్క్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లింది. సడెన్‌గా ఆమెకు పసుపు రంగులో ఉన్న 4.38 క్యారెట్ డైమండ్ దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు 2 వేల నుంచి 20,000 డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) ఉంటుందట. పసుపు రంగులో తళతళ మెరిసిపోతున్న డైమండ్ ఆమె జీవితాన్ని అనూహ్యమలుపు తిప్పింది. 1972 తర్వాత ఇటువంటి డైమండ్ మళ్లీ ఇన్నాళ్లకి దొరికిందని పార్క్ నిర్వాహకులు తెలిపారు. 1972 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 75 వేల డైమాండ్లు దొరికాయట. ఈ యేడాది 258 వజ్రాలు అక్కడి ప్రజలకు దొరికాయని స్థానిక మీడియా తెల్పింది. ఈ పార్కును సందర్శించే వారికి రోజుకు కనీసం ఒకటి రెండైన వజ్రాలు దొరకుతాయట. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! కాగా ప్రపంచవ్యాప్తంగా అర్కన్సాస్ స్టేట్ పార్క్ డైమండ్లకు ఫేమస్. ఈ పార్క్ ఉన్న ప్రదేశంలో అగ్నిపర్వతం నుంచి పైకి ఉబికి వచ్చిన శిలాద్రవం అంతా విస్తరించి ఉంటుంది.అందువల్ల ఈ పబ్లిక్ పార్కులో తరచుగా విలువైన వజ్రాలు దొకుతాయట. ఇక్కడ ఎవరైనా డైమండ్ల కోసం వెతకొచ్చట. అంతేకాకుండా దొరికిన డైమండ్ వాళ్లదగ్గరే ఉంచుకోవచ్చు లేదా అమ్ముకొవచ్చు. ప్రపంచంలోనే వజ్రాలు దొరికే ఏకైక పబ్లిక్ పార్క్ ఇదేనట..!! చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! -
CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు
ఆయన ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చుట్టూ భారీ కాన్వాయ్, మందీమార్బలం లేకుండా సహజంగా ఏ సీఎం కూడా కాలు బయటపెట్టరు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. సాధారణ పౌరుడిలా ‘ఎన్నమ్మా..సౌఖ్యమా’ (ఏమ్మా క్షేమంగా ఉన్నారా) అంటూ ప్రజలను నేరుగా పలుకరించి ‘వావ్ గ్రేట్’ అనిపించుకున్నారు. స్టాలిన్‌తో స్థానికులు అపూర్వమైన అనుభూతిని పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. సాక్షి, చెన్నై(తమిళనాడు): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతుంటారు. ప్రతి రోజూ ఉదయం నగరంలో సైక్లింగ్, జాగింగ్ చేయడం ఆయనకు అలవాటు. సీఎం అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్లో వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో స్థానికులు జాగింగ్ చేస్తూ స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిని చూడగానే స్టాలిన్ రోడ్డుపై నిలబడి మాట కలిపారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళ.. ‘మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్ అయ్యాను’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది’ అంటూ మరో మహిళ ప్రశంశించారు. ‘మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఇంకో మహిళ స్టాలిన్‌తో అన్నారు. ‘అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం..మార్కెండేయుల్లా ఉన్నారే’ అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి. చదవండి: ‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో’ M K Stalin blushes as a lady asks the secret of his youthful look, during his morning walk. He responds "diet control". pic.twitter.com/178TnzrNxE — J Sam Daniel Stalin (@jsamdaniel) September 21, 2021 -
సూర్యుడి కంటే ముందే సుధీరన్న..
సాక్షి, ఎల్బీనగర్: మార్నింగ్ వాక్ పాదచారిగా పేరుగాంచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హయత్‌నగర్‌లో శనివారం చేసిన పాదయాత్రతో 34 ఏళ్లు పూర్తయ్యాయి. కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో చేసిన మార్నింగ్ వాక్కు మంచి ఆదరణ రావడంతో మొదటిసారిగా హుడా చైర్మన్‌గా, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో మార్నింగ్ వాక్ చేసి ప్రజల మన్ననలను పొందారు ఆయన. ఆదే స్ఫూర్తితో పదవిలో ఉన్నా లేకున్నా సమస్యల కోసం నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ చేసేవారు. ఇలా 34 సంవత్సరాల పాటు మార్నింగ్‌వాక్ చేసిన ఘనత సుధీర్‌రెడ్డికే దక్కింది. ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు 1987 జనవరి 23న అప్పట్లో అక్బర్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో మంచినీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. సూర్యుడి కంటే ముందే సుధీరన్న అనే కార్యక్రమం ద్వారా తొలిసారిగా ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు మార్నింగ్ వాక్ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. సమస్యలు సైతం సత్వరమే పరిష్కారమయ్యేవి. ఇలా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 100కుపైగా కాలనీల్లో మార్నింగ్ వాక్ చేసిన ఘనత ఆయనది. తొలుత మంచినీటి కోసం చేసిన మార్నింగ్ వాక్ ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, కాల్వలు, చెరువుల సుందరీకరణ తదితర అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్నింగ్ వాక్కు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
పెళ్లి రోజే చివరి రోజు
- ఎస్ఐ పైకి దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి... - వాకింగ్ చేస్తుండగా ప్రమాదం.. లంగర్‌హౌస్‌లో ఘటన హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన ఎస్ఐ పైకి కారు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. పెళ్లి రోజే ఆయన ప్రాణాలు వదలడంతో లంగర్‌హౌస్‌లో సోమవారం పెను విషాదం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా యెడవల్లి గ్రామానికి చెందిన ఎం.కిష్టయ్య నలభై ఏళ్ల కిందట నగరానికి వచ్చి బాపూ ఘాట్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లంగర్‌హౌస్ టిప్పుఖానా బ్రిడ్జిపై వాకింగ్ చేస్తుండగా... వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు కిష్టయ్యను ఢీకొట్టింది. దీంతో కిష్టయ్య అక్క డిక క్కడే ప్రాణాలు వది లారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కిష్టయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యజమా నిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ సమయంలో తన డ్రైవర్ కారు నడిపినట్టు తెలిపారు. దీంతో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి రోజు భర్త మరణ వార్త విన్న కిష్టయ్య భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.