పెళ్లి రోజే చివరి రోజు | Wedding day itself the last day | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజే చివరి రోజు

Published Tue, May 9 2017 12:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

పెళ్లి రోజే చివరి రోజు - Sakshi

పెళ్లి రోజే చివరి రోజు

- ఎస్‌ఐ పైకి దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి...
- వాకింగ్‌ చేస్తుండగా ప్రమాదం.. లంగర్‌హౌస్‌లో ఘటన


హైదరాబాద్‌: మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన ఎస్‌ఐ పైకి కారు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. పెళ్లి రోజే ఆయన ప్రాణాలు వదలడంతో లంగర్‌హౌస్‌లో సోమవారం పెను విషాదం   చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా యెడవల్లి గ్రామానికి చెందిన ఎం.కిష్టయ్య నలభై ఏళ్ల కిందట నగరానికి వచ్చి బాపూ ఘాట్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.

రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లంగర్‌హౌస్‌ టిప్పుఖానా బ్రిడ్జిపై వాకింగ్‌ చేస్తుండగా... వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు కిష్టయ్యను ఢీకొట్టింది. దీంతో కిష్టయ్య అక్క డిక క్కడే ప్రాణాలు వది లారు. కారు డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కిష్టయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యజమా నిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ సమయంలో తన డ్రైవర్‌ కారు నడిపినట్టు తెలిపారు. దీంతో డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి రోజు భర్త మరణ వార్త విన్న కిష్టయ్య భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement