Mortaza
-
నువ్వు లేకుండా క్రికెట్ ఎలా ఆడాలి?
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించడాన్ని అతడి సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. హసన్ లేకుండా క్రికెట్ ఎలా ఆడాలంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. హసన్‌తో తమకున్న అనుబంధాన్ని సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం, వెటరన్ బౌలర్ మోర్తాజా సోషల్ మీడియా వేదికగా పంచుకుకున్నారు. చాంపియన్‌లా హసన్ తిరిగొస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సమ వయస్కులమైన మనమిద్దరం 18 ఏళ్ల పాటు కలిసి క్రికెట్ ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా క్రికెట్ ఆడాలన్న ఆలోచన ఎంతో బాధగా ఉంది. త్వరలోనే నువ్వు చాంపియన్‌లా తిరిగొస్తావు. నీకు ఎల్లప్పుడు నా మద్దతు, మొత్తం బంగ్లాదేశ్ అండదండలు ఉంటాయి. ధైరంగా ఉండు’ అంటూ ముష్ఫికర్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. హసన్‌తో కలిసివున్న ఫొటోను షేర్ చేశాడు. షకీబ్ కెప్టెన్సీలో వరల్డ్‌కప్ ఫైనల్ ఆడతాం: మోర్తాజా షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ నిషేధం తదనంతర పరిణామాలతో తాను నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని మోర్తాజా పేర్కొన్నాడు. భవిష్యత్తులో కచ్చితంగా హాయిగా నిద్రపోతానని అన్నాడు. షకీబ్ కెప్టెన్సీలో 2023 ప్రపంచకప్ ఫైనల్ ఆడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. (చదవండి: షకీబ్ అల్ హసన్‌పై రెండేళ్ల నిషేధం) -
'ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదు'
మీర్పూర్: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలవడం పట్ల బంగ్లాదేశ్ క్రికెటర్లు సంతోషంలో మునిగితేలుతున్నారు. టీమిండియాతో వరుసగా రెండు వన్డేల్లోనూ భారీ తేడాతో గెలుస్తామని ఊహించలేదని బంగ్లా కెప్టెన్ మోర్తజా అన్నాడు. బంగ్లాతో తొలి వన్డేలో 79 పరుగులో, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ధోనీసేన పరాజయం చెందిన సంగతి తెలిసిందే. తాము సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని మోర్తజా సంతోషంవ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌కు ముందు తమ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, అయితే ఇంతటి భారీ విజయాన్ని అంచనా వేయలేదని చెప్పాడు. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడామని అన్నాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడితే ఇలాంటి విజయాలు సాధించగలమని, దీనికి కొంత అదృష్టం కూడా కలసి రావాలని మోర్తజా చెప్పాడు. కాగా నిలకడలేమి తమకు ప్రధాన సమస్యని, ఇదే ఆటతీరును కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.