'ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదు' | We did not expect to win by such big margins: Mortaza | Sakshi
Sakshi News home page

'ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదు'

Published Mon, Jun 22 2015 12:48 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

'ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదు'

'ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదు'

మీర్పూర్: భారత్తో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలవడం పట్ల బంగ్లాదేశ్ క్రికెటర్లు సంతోషంలో మునిగితేలుతున్నారు. టీమిండియాతో వరుసగా రెండు వన్డేల్లోనూ భారీ తేడాతో గెలుస్తామని ఊహించలేదని బంగ్లా కెప్టెన్ మోర్తజా అన్నాడు.

బంగ్లాతో తొలి వన్డేలో 79 పరుగులో, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ధోనీసేన పరాజయం చెందిన సంగతి తెలిసిందే. తాము సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని  మోర్తజా సంతోషంవ్యక్తం చేశాడు. ఈ సిరీస్కు ముందు తమ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, అయితే ఇంతటి భారీ విజయాన్ని అంచనా వేయలేదని చెప్పాడు. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడామని అన్నాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడితే ఇలాంటి విజయాలు సాధించగలమని, దీనికి కొంత అదృష్టం కూడా కలసి రావాలని మోర్తజా చెప్పాడు. కాగా నిలకడలేమి తమకు ప్రధాన సమస్యని, ఇదే ఆటతీరును కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement