most promising entrepreneur
-
టాప్ ఆశావహ స్టార్టప్ 100 లిస్ట్: దేశీ సంస్థలు నాలుగు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిసు్కలను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషిం చే సాంకేతికతను జాక్‌మాజ్ రూపొందిస్తోంది. ఇదీ చదవండి: వేదాంతా భారీ పెట్టుబడులు: ఏకంగా రూ. 14,000 కోట్లు నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ ..క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్
జేమ్స్‌బాండ్ అంటే ఎవరండీ? ‘ఇది రిస్క్ సుమీ’ అని భయపడకుండా దూసుకుపోయేవాడు. పదిరూట్లు కనిపించినా... తనదైన సెపరేట్ రూట్ సృష్టించుకునేవాడు. విజయాలెప్పుడూ తన వెంటపడేలా కనిపించేవాడు. ఈ లక్షణాలు ఉన్న కరణ్‌ను జేమ్స్‌బాండ్ అని పిలుచుకోవచ్చు. అయితే తన పేరునే ‘బ్రాండ్’ చేసుకున్న అతడిని కాస్త సరదాగా జేమ్స్‘బ్రాండ్’ అని పిలుచుకుంటే మరీ బాగుంటుంది... ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు. కరణ్ తొరాని దిల్లీలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ కోర్స్ చేస్తున్న సమయంలో తండ్రి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఫ్యాషన్ డిగ్రీ చేతికి అందగానే ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనుకున్న తన కలలకు బ్రేక్ పడింది. చదువు పూర్తయిన తరువాత ఇద్దరు డిజైనర్ల దగ్గర పనిచేశాడు. మనసులో ఉన్న తన కల మాత్రం రోజూ పొద్దుటే హలో చెబుతూనే ఉంది. తన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. దీంతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘రిస్క్–టేకర్’ అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఫ్యాషన్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు చాలామంది వెనక్కి లాగారు. ‘అది అందరికీ వర్కవుట్ కాదు’ అని నిరుత్సాహ పరిచారు. ‘ఎలాగైనా చేయాల్సిందే’ అని అకాడమీ మెట్లు ఎక్కినప్పుడు ‘రిస్క్–టేకర్’ అనే బిరుదు తగిలించారు. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు ‘కడుపులో చల్ల కదలకుండా డబ్బు వస్తుంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు!’ అన్నారు. ‘చేయక తప్పదు’ అని మరోసారి అనుకున్నాడు కరణ్. మొదట తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో తాను డిజైన్ చేసిన గార్మెంట్స్ ఇమేజ్‌లను పోస్ట్ చేశాడు. అనూహ్యమైన స్పందన లభించింది. వారాల వ్యవధిలోనే అవి మల్టీ–బ్రాండ్ స్టోర్స్లలోకి వెళ్లాయి. హాట్‌కేకుల్లా అమ్ముడు అయ్యాయి. దీంతో తనలోని ఆత్మవిశ్వాసానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. బాలీవుడ్ అంటే తనకు వల్లమాలిన ఆసక్తి, అభిమానం. బాలీవుడ్లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవడానికి కరణ్‌కు ఎంతో కాలం పట్టలేదు. ఫ్యాషన్ ప్రపంచం ‘ఇతడొకడున్నాడు’ అని మన వైపు దృష్టి సారించడానికి, మనలో ‘మనదైన ప్రత్యేకత’ ఉండాలి. మరి కరణ్లోని ప్రత్యేకత గురించి చెప్పడానికి ముందు కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... దేశవిభజన సమయంలో కరణ్ పూర్వీకులు పాకిస్థాన్‌లోని సిం«ద్ నుంచి మనదేశానికి వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి పూర్వీకుల కథలు వింటూ పెరిగాడు కరణ్. కరణ్ బాల్యం ఎక్కువగా భోపాల్‌లోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది. అది ఇల్లు అనడం కంటే మ్యూజియం అంటే బెటర్. ఎందుకంటే ఇంటినలుమూలలలో చిన్న చిన్న దారుశిల్పాలు కనిపించేవి. అమ్మమ్మ వాటిని అంగట్లో కొని తెచ్చేది. రకరకాల చీరలు కనిపించేవి. చందేరి చీర తనను ఎంతో ఇన్స్పైర్ చేసింది. దిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో తండ్రికి ‘సింధి టెంట్‌హౌజ్’ ఉండేది. చిన్నప్పుడు తండ్రితో పాటు ఎన్నో వివాహవేడుకలకు వెళ్లేవాడు. ప్రతి పెళ్లివేడుకకు తనదైన గ్లామర్ గ్రామర్ ఉండేది. ఆ పాఠాలన్నీ తన మదిలో అలా నిలిచిపోయాయి. ఈ జ్ఙాపకాలన్నీ తన సృజనాత్మకతకు పదనుపెట్టాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్‌ను తన విజయసూత్రంగా చేశాయి. కరణ్ డిజైన్లలో జ్ఞాపకాలు పలకరిస్తాయి. కథలు చెబుతాయి. మరీ ఎక్కువగా మోడ్రన్‌గా ఉండకుండా, అలా అని తక్కువ కాకుండా గార్మెంట్స్ డిజైన్ చేస్తూ పాతజ్ఞాపకాల కొత్తలోకంలోకి తీసుకెళ్లడంలో చేయి తిరిగిన డిజైనర్ అనిపించుకున్నాడు కరణ్. ‘సైకిల్ ఆఫ్ ఫ్యాషన్’ అనే సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. అలనాటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ను కొత్త లుక్‌తో తీసుకువచ్చాడు. ఇద్దరు ఉద్యోగులతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాడు కరణ్. ఇప్పుడు రెండు వందల మంది ఉద్యోగులు అతడి దగ్గర పనిచేస్తున్నారు! -
నవయువం : చిట్టచివరికి, ఎట్టకేలకు ‘క్లిక్’ అయ్యాడు!
2013లో క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సందీప్ గెలుచుకొన్నాడు. ‘బిజినెస్ వరల్డ్’ మ్యాగజీన్ నుంచి ‘మోస్ట్ ప్రామిసింగ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డును అందుకొన్నాడు. స్టార్ యూత్ అచీవర్ అవార్డు, బ్రిటిష్ కౌన్సిల్ నుంచి యంగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డులు వచ్చాయి. ‘ఇటీ నౌ’ నుంచి పయోనీర్ ఆఫ్ టుమారో అవార్డును అందుకొన్నాడు. {పముఖ మ్యాగజీన్లకు ఫీచర్ ఆర్టికల్స్ రాస్తుంటాడు. సగటు యువత తమ జీవితంలో అతి పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పుకునే ‘పరాజయాలు’ అతడి జీవితంలో లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే ‘అపజయాలే విజయానికి మెట్లు’ అనే నమ్మకాన్ని తారక మంత్రంగా చేసుకొని ముందుకు సాగాడు. కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక సాధారణ కెమెరాతో ప్రస్థానం మొదలుపెట్టి అనితర సాధ్యమైన విజయాలు సాధించి, స్ఫూర్తిప్రదాతగా మారాడు. స్ఫూర్తిమంతమైన ప్రసంగాలు చేసే వక్త అయ్యాడు. అతడే సందీప్ పరమేశ్వరి. ఇరవై ఏడేళ్ల ఈ ఢిల్లీ యువకుడి విజయ ప్రస్థానం పన్నెండు వేల రూపాయల విలువచేసే ఒక కెమెరాతో మొదలైంది. పదమూడేళ్ల నుంచే వ్యాపార రంగంలో అనుభవం ఉంది! తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో పదిహేనేళ్ల వయసులోనే సొంతంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు సందీప్. ఎలాగంటే... ఇంటి దగ్గర ఉన్న రెండు టూ వీలర్స్‌ను అద్దెకు ఇచ్చేవాడు సందీప్. అలా ఢిల్లీవీధుల్లో అమ్మాయిలతో బైక్‌పై తిరగాలని తపించే యువకులకు సందీప్ ఆపద్బాంధవుడు అయ్యాడు. పెట్రోల్ వారిదే. గంటకు యాభై రూపాయలు అద్దె. ఇలా సంపాదన మొదలు పెట్టిన సందీప్‌కు కొన్నిరోజుల్లోనే చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది. చిన్న వయసులోనే కొంతమంది స్నేహితులతో కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టాడు. అయితే అది ఆరు నెలలకే మూత పడింది. తనతో పాటు పెట్టుబడి పెట్టిన స్నేహితులకు కూడా బంధువులందరిలోనూ చెడ్డపేరు వచ్చింది. ఎన్నో ఆశలతో, ఆశయాలతో మొదలు పెట్టిన వ్యాపారం దెబ్బతినడం, ఇదే సమయంలో ఇంట్లో ఆర్థికపరమైన కష్టాలు మొదలు కావడంతో ఏదైనా ఉపాధి మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో సందీప్‌కు ఫోటోగ్రఫీపై ఉన్న ఆసక్తి ఒక ఉద్యోగాన్ని సంపాదించిపెట్టింది. మోడలింగ్ ఏజెన్సీలో కెమెరామెన్‌గా జాయిన్ అయ్యాడు. లిమ్కా బుక్‌లోకి ఎక్కాడు! జీవితంలో అంతవరకూ ఎదురైన అనుభవాలను బట్టి ... ఎంచుకొన్న పని ఏదైనా సరే... దాంట్లో అంకిత భావాన్ని చూపాలనే పాఠాన్ని నేర్చుకొన్నాడు సందీప్. మోడలింగ్ ఫొటోగ్రాఫర్‌గా చేరిన కొన్ని రోజుల్లోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడంటే అతని తపన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదిగంటలా నలభై అయిదు నిమిషాల వ్యవధిలో నూట ఇరవై రెండు మంది మోడల్స్‌కు పదివేల షాట్స్ తీయడం ద్వారా ఇతడు లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించాడు. కెరీర్ మార్చుకున్నాడు! లిమ్కా రికార్డ్‌తో మోడలింగ్ ప్రపంచంలో సందీప్‌కు మంచి పేరు వచ్చింది. అయితే అలాగని అక్కడే సెటిలైపోదామని అనుకోలేదు. వేరే వ్యాపారం చేయాలనే ఆలోచన కొత్త మార్గాలను చూపింది. తాను సృజనాత్మకతతో తీసిన ఫొటోలపై తన హక్కులను ఉపయోగించుకుంటూ చేసిన ప్రయత్నం అతడిని పెద్ద వ్యాపారవేత్తను చేసింది. ‘ఇమేజ్ బజార్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో తను తీసిన ఫొటోలను అప్లోడ్ చేయసాగాడు. అతి తక్కువ రోజుల్లోనే లెక్కకు మించి ‘ఇండియన్ ఫేసెస్’ను కలిగి ఉన్న వెబ్‌సైట్‌గా ‘ఇమేజ్ బజార్’కు పేరొచ్చింది. అనేక వార్తాసంస్థలు ఇమేజెస్ కోసం సందీప్‌ను సంప్రదించడం మొదలుపెట్టాయి. ఈ ఫోటోల బిజినెస్ అతి తక్కువ సమయంలోనే సందీప్‌ను కోటీశ్వరుడిని చేసింది. ‘ఇమేజ్ బజార్’కు వెబ్ ఫ్లోటింగ్ పెరిగింది. ఏకంగా నలభై అయిదు సంస్థలు ఫొటోల విషయంలో ఈ సైట్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఇరవెరైండేళ్ల వయసులోనే ఈ వెబ్సైట్ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని పొందాడు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ టర్నోవర్ పది హేను కోట్ల రూపాయల వరకూ ఉంది. ప్రసంగాలతో స్ఫూర్తిని పంచుతున్నాడు! ప్రస్తుతం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయగల వక్తగా కూడా సందీప్‌కు మంచి గుర్తింపు ఉంది. అనేక కాలేజీల్లో, పాఠశాలల్లో ప్రసంగిస్తూ... యువతలో స్ఫూర్తిని నింపుతున్నాడు. ‘సక్సెస్ నాట్ జస్ట్ అబౌట్ వర్కింగ్హార్డ్’ అంటున్నాడు.