Motera Stadium
-
Ind Vs Aus: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా..
India Vs Australia 4th Test Day 4 Records: నాలుగో టెస్టులో నాలుగో రోజు నాలుగో శతకం నమోదైన విషయం తెలిసిందే. ఒక టెస్టులో నాలుగు సెంచరీలు కొత్తేం కాదు... కానీ ఈ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో మాత్రం ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మూడు టెస్టులు కూడా మూడో రోజుల్లోనే ముగిశాయి. స్పిన్నర్లు తిప్పేసిన ఆ మ్యాచ్‌ల్లో బ్యాటర్లు విలవిలలాడారు. గత మ్యాచుల్ని శాసించిన బౌలర్లపై ఇరు జట్ల బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడ్డారు. మరి టీమిండియాకు అనుకూలంగా మారిన నాలుగో రోజు ఆటలో విశేషాలు, నమోదైన ప్రధాన రికార్డులన్నీ ఒకేచోట చూసేద్దామా?! 1205 రోజుల తర్వాత... భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... సుదీర్ఘ టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. ఆఖరి టెస్టులో మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 289/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌కు జడేజా (84 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రూపంలో గట్టిదెబ్బే తగిలింది. బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్‌పై కోహ్లికి జతయిన ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జతయ్యాడు. ‘రన్ మెషిన్’ అండతో భరత్ భారీ సిక్సర్లతో అలరించాడు. 363/4 వద్ద లంచ్‌కు వెళ్లొచ్చాక ఎంతో ఓపిగ్గా ఆడిన కోహ్లి 241 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2019లో నవంబర్ 23న క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లి 27వ టెస్ట్ శతకం సాధించాడు. మళ్లీ 43 టెస్టుల తర్వాత భారత గడ్డపైనే 28వ సెంచరీ చేసి 1205 రోజుల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించాక లయన్ బౌలింగ్‌లో భరత్... హ్యాండ్స్కాంబ్ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్ పటేల్ కూడా పట్టుదలతో ఆడటంతో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. ఇద్దరి జోడీ కుదరడంతో భారత్ భారీస్కోరుకు బాటపడింది. మూడో సెషన్లో టీమిండియా 500 మార్క్‌ను అందుకోగా, కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. కాసేపటికే అక్షర్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అక్షర్‌ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో ఆరో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కాసేపటికే భారత్ 571 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. నాలుగో రోజు ప్రధాన రికార్డులు 75: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 75వ సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 28వ శతకం. భారత గడ్డపై లియోన్ చరిత్ర భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ జట్టు బౌలర్‌గా నాథన్ లయన్ గుర్తింపు పొందాడు. భారత్‌లో 11 టెస్టులు ఆడిన లయన్ 56 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ అండర్వుడ్ (ఇంగ్లండ్; 16 టెస్టుల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును లయన్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కొట్టిన సిక్స్‌లు. 10: ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ కొట్టిన అత్యధిక సిక్స్‌లు ఇవే. 1986లో ముంబైలో, 2013లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో భారత్ ఎనిమిది చొప్పున సిక్స్‌లు కొట్టింది. మూడో జట్టుగా భారత్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఆరు వికెట్లకు 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా (1960లో వెస్టిండీస్‌పై), పాకిస్తాన్ (2015లో బంగ్లాదేశ్‌పై) ఈ ఘనత సాధించాయి. ఆస్ట్రేలియా రికార్డు బద్దలు నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా 480 పరుగులతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా ఆసీస్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు సాధించిన భారత్.. పర్యాటక జట్టు పేరిట ఉన్న ఘనతను కనుమరుగు చేసింది. అయ్యర్ అవుట్! భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగలేదు. వెన్నునొప్పితో బాధపడిన అతనికి స్కానింగ్ కూడా తీశారు. ముందు జాగ్రత్తగా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఆడించలేదు. మూడో రోజు ఆటలోనే అతనికి నొప్పి మొదలైనట్లు తెలిసింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఈ నెల 17 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. చదవండి: Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది! -
ఏదైతేనేం.. హార్దిక్ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. ఉద్వేగానికి లోనైన ‘స్కై’
India vs New Zealand, 3rd T20I- Suryakumar Yadav: ‘‘ఎలాంటి పిచ్‌పై ఆడామన్న విషయంతో పనిలేదు. మన ఆధీనంలో లేని అంశాల గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. మనం చేయగలిగింది చేయాలి. పరిస్థితికి తగ్గట్లుగా ముందుకు సాగాలి. వన్డే లేదంటే టీ20.. ఏదైనా లో స్కోరింగ్ లేదా భారీ స్కోరు.. ఆటలో పోటాపోటీ ఉంటేనే మజా. సవాలును స్వీకరించి ముందుకు సాగిపోవాల్సిందే’’ అని టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. లక్నో పిచ్ గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు. కాగా రెండో టీ20లో న్యూజిలాండ్‌ను 99 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు.. గెలుపు కోసం ఆపసోపాలు పడింది. సూర్య, హార్దిక్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడటంతో ఎట్టకేలకు ఓ బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఈ నేపథ్యంలో లక్నో పిచ్ తమను విస్మయానికి గురిచేసిందంటూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది ఇదిలా ఉంటే.. మూడో మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న టీమిండియా- న్యూజిలాండ్ అహ్మదాబాద్‌లో ఆఖరి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘లక్నో పిచ్ గురించి నేను, హార్దిక్ మ్యాచ్ తర్వాత మాట్లాడుకున్నాం. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. నిజానికి మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. గతంలోనూ మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశాం. రెండో టీ20లో ఆఖరి ఓవర్లో కాస్త ఒత్తిడికి గురైన మాట వాస్తవమే. అయినప్పటికీ చిరునవ్వుతోనే దానిని అధిగమించాలనుకున్నాం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాం’’ అని సూర్య పేర్కొన్నాడు. ఎమోషనల్ అయిన సూర్య ఇక మొతేరాలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్య.. ఆ తర్వాత ఇక్కడ ఆడనుండటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో.. ‘‘గత జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నేను ఇక్కడైతే మొదలుపెట్టానో ఈరోజు అక్కడే మరోసారి ఆడబోతున్నానని మా మేనేజర్‌తో అన్నాను’’అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. అయితే, అప్పటికి.. ఇప్పటికి తనలో చాలా మార్పు వచ్చిందన్న ఈ ముంబైకర్.. అందమైన స్టేడియంలో అద్భుతమైన ప్రేక్షకుల నడుమ ఆడటం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కాగా నాటి మ్యాచ్‌లో సూర్య అరంగ్రేటం చేసిన్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇషాన్ కిషన్(56), విరాట్ కోహ్లి(73) అర్ధ శతకాలతో చెలరేగడంతో 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉండగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున ‘స్కై’ ప్రస్తుతం టీ20లలో నంబర్ 1గా ఉండటమే గాక.. ఇటీవలే ఐసీసీ టీ20 క్రికెటర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: IND Vs AUS: భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్ Ind Vs NZ 3rd T20: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి! #TeamIndia vice-captain @surya_14kumar describes his excitement ahead of playing in front of a packed crowd in the #INDvNZ T20I decider at the iconic Narendra Modi Stadium 🏟️ in Ahmedabad, where he made his international debut 😃👌🏻 pic.twitter.com/Nu2shQUIxG — BCCI (@BCCI) January 31, 2023 -
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..?
ఈ ఏడాది (2022) మే 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా) వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1,01,566 మంది హాజరయ్యారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడం అదే తొలిసారి. దీంతో ఐపీఎల్-2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPL pic.twitter.com/PPhalj4yjI— BCCI (@BCCI) November 27, 2022 ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇవాళ (నవంబర్ 27) వెల్లడించింది. బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి నుంచి అవార్డు ప్రతిని అందుకున్న దృష్యాన్ని షేర్ చేసింది. భారతీయులకు ఇదో గర్వించదగ్గ క్షణం. భారత్.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇది మా అభిమానులకు అంకితం.. మొతేరా, ఐపీఎల్‌కు అభినందనలు అంటూ బీసీసీఐ ట్విటర్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే, నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఆడిన తొలి లీగ్‌లోనే అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఛాంపియన్‌గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి, 30 బంతుల్లో 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. -
అహ్మదాబాద్‌లో ఫైనల్
న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్–నవంబర్ నెలల్లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొమ్మిది వేదికలను ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఎంపికైన వేదికల్లో హైదరాబాద్‌తోపాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నో నగరాలు ఉన్నాయి. భారత్ ఆతిథ్యమిచ్చిన 2016 టి20 ప్రపంచకప్‌కు వేదికలుగా ఉన్న మొహాలీ, నాగ్‌పూర్‌లు మాత్రం ఈసారి చోటు దక్కించుకోలేదు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఫైనల్ జరగనుంది. తొలుత ఆరు వేదికల్లోనే టి20 ప్రపంచకప్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావించినా... రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో మరో మూడు వేదికలను అదనంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ప్లాన్ ‘బి’ కూడా ఉంది... ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. ఒకవేళ టి20 ప్రపంచకప్ నాటికి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోతే... 9 వేదికల మధ్య టోర్నీలో పాల్గొనే 16 జట్లు ప్రయాణించడానికి అంత సౌకర్యంగా ఉండదు. దాంతో ఇటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి బీసీసీఐ ప్లాన్ ‘బి’ని సిద్ధం చేసింది. అక్టోబర్ నాటికి కరోనా తీవ్రత తగ్గకపోతే ప్రపంచకప్‌ను నాలుగు వేదికల్లోనే నిర్వహించేలా బీసీసీఐ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరలోనే ఐసీసీకి నివేదించనుంది. పాక్ వీసాలకు ఢోకా ఉండదు... టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చే పాకిస్తాన్ క్రికెటర్లకు వీసాలను మంజూరు చేసేందుకు భారత ప్రభుత్వం సమ్మతించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. -
‘భారత్ మాతాకి జై’ అనే హక్కు మీకు లేదు
ముంబై: అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేయడంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్రమైన విమర్శలు చేశారు. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానం ఇస్తూ సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ మోటేరా స్టేడియానికి ఉన్న సర్దార్ పటేల్ పేరును చేరిపేసిందని మండిపడ్డారు. అదీ కాకుండా వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా తమకు హిందుత్వం నేర్పడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టామన్నారు. కానీ, బీజేపీ వాళ్లు ఏకంగా సర్దార్ పటేల్ స్టేడియం పేరును మార్చారని మండిపడ్డారు. ‘భారత్ మాతాకి జై’ అని నినాదాలు చేసినంత మాత్రనా మిమ్మల్ని మీరు(బీజేపీ) దేశభక్తులు అనుకోడం సరికాదన్నారు. ‘భారత్ మాతాకి జై’ అని నినాదించే హక్కు బీజేపీకి లేదని ఉద్దవ్ విమర్శించారు. చదవండి: పూజా చవాన్ ఆత్మహత్య.. మంత్రి రాజీనామా -
వాన్.. ఇక నువ్వు మారవా!
లండన్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ మరోసారి అహ్మదాబాద్ పిచ్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. మంగళవారం మొటేరా పిచ్‌ను దున్నిన పొలంతో పోలుస్తూ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా స్టిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వాన్ మరో వీడియోతో ముందుకు వచ్చాడు. ఈసారి మొటేరా పిచ్ రిపోర్ట్‌ను అందిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ''పిచ్ కండీషన్ సూపర్‌గా ఉంది.. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వారి సొంతం.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనిపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఆడమ్ లిత్, మాజీ ఫుట్‌బాలర్ జేమి రెడ్క్నాప్లు వాన్ పెట్టిన పోస్టుపై లాఫింగ్ ఎమోజీ జత చేశారు. అయితే వాన్‌ను మాత్రం నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. వాన్ ఇక నువ్వు మారవా.. ఇంగ్లండ్, టీమిండియాలు మూడో టెస్టును మరిచిపోయి నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్నాయి.. నువ్వు మాత్రం పిచ్‌ను పట్టుకునే వేలాడుతున్నావు.. వాన్ ఫ్రస్టేషన్లో ఉన్నాడు.. అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు... వాన్ చేసే పనులు నవ్వు తెప్పిస్తున్నా.. ప్రతీసారి అదే అంటే చిరాకు వేస్తుంది. అంటూ కామెంట్లు పెట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు రేపటినుంచి(గురువారం, మార్చి 4న) జరగనుంది. చదవండి: 'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్' మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి! View this post on Instagram A post shared by Michael vaughan (@michaelvaughan) -
'రూట్ భయ్యా.. ఈసారి పిచ్ ఎలా ఉంటుందంటావు!'
అహ్మదాబాద్: మొటేరా వేదికగా నాలుగో టెస్టుకు ఒక్కరోజు సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో పిచ్‌పై మరోసారి చర్చ నడుస్తుంది. ఈసారి పిచ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే వేదికలో మూడో టెస్టు జరిగినా అది డే నైట్ కావడం.. ఇప్పుడు జరగబోయేది డే టెస్టు కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ ఆటగాళ్లను ట్రోల్ చేస్తూ ఒక ఫన్నీ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో రూట్ సహా స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జానీ బెయిర్ స్టోలతో పాటు ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ మొటేరా పిచ్‌ను చూస్తూ ఏదో చర్చించుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే వారు మాట్లాడుకున్నట్లుగా ఊహించుకున్న జాఫర్ తనదైన శైలిలో వారి సంభాషణను రాసుకొచ్చాడు. ''బ్రాడ్: రూట్ భయ్యా.. ఈసారి పిచ్ ఎలా ఉందంటావు.. అలాగే ఉంటే మాత్రం టూర్ ముగిసినట్టే. మార్క్ వుడ్: బ్రాడ్.. నవ్వు కనీసం మ్యాచ్‌లు ఆడావు.. నాకు ఇంతవరకు అవకాశం రాలేదు.. బెయిర్ స్టో: నాకు ఇక్కడ ఫ్లాట్ పిచ్ మాత్రం కనబడట్లేదు.. ఈసారి కూడా డకౌట్‌గా వెనుదిరుగుతానా! కోలింగ్‌వుడ్: ఈసారి కూడా పిచ్ స్పిన్‌కే అనుకూలించనుందా? జో రూట్: చా! ఇంకోసారి ఇదే వేదికలో ఆడాల్సి వస్తుంది.. '' జాఫర్ షేర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మూడోటెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించగానే పలువురు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో పాటు యువరాజ్, హర్బజన్ లాంటి వారు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికి టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే మంగళవారం తగిన సమాధానం ఇచ్చాడు.''గులాబీ బంతి కొంత భిన్నంగా స్పందించింది కాబట్టి బ్యాటింగ్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. స్పిన్ పిచ్‌లపై నేరుగా లైన్లోనే ఆడాల్సి ఉంటుంది. బంతి బాగా స్పిన్ అయితే మాత్రం సమస్యే లేదు. ఒక్కో బ్యాట్స్‌మన్ శైలి ఒక్కోలా ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ లేదా బ్యాక్ ఫుట్ ఎలా ఆడినా కాళ్ల కదలికలు చాలా ముఖ్యం. టర్న్ ఎక్కువగా ఉంటే మీ డిఫెన్స్‌ను నమ్ముకోవాలి. స్పిన్నింగ్ పిచ్‌పై ఆడటం సవాలే కావచ్చు కానీ దానినీ అధిగమించవచ్చు. ఏమైనా మాట్లాడుకునే హక్కు జనాలకు ఉంది. మేం విదేశాల్లో ఆడినప్పుడు సీమింగ్ పిచ్‌ల గురించి ఎవరూ మాట్లాడరు. ఒక్కోసారి పచ్చికతో పిచ్ అనూహ్యంగా స్పందించినప్పుడు కూడా మేం ఫిర్యాదు చేయలేదు. అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడనే లేదు'' అంటూ విరుచుకుపడ్డాడు. చదవండి: బుమ్రా అందుకే సెలవు తీసుకున్నాడా?! 'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్' Broad: Guess my tour is over then. Wood: At least you played bro. Bairstow: Where me flat pitch?! Colly: Oh this one's gonna turn innit? Root: Ah shit here we go again..#INDvsENG pic.twitter.com/mJfcrjRFw8 — Wasim Jaffer (@WasimJaffer14) March 3, 2021 -
'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్'
అహ్మదాబాద్: మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లో ముగియడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ మొదటి నుంచి పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా మ్యాచ్‌ను పది వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత మొదలైన వాన్ విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉండడం విశేషం. ''అసలు టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగింది అసలు టెస్టు మ్యాచ్ కాదని.. టెస్టు మ్యాచ్ నిర్వహణకు పిచ్ ఏ మాత్రం సరిపోదని.. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించలేదంటూ'' వ్యంగ్యాస్త్రాలు సందించాడు. అంతేగాక నాలుగో టెస్టు కూడా అహ్మదాబాద్ వేదికగానే జరుగుతుండడంతో పిచ్ ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి అంటూ గత ఆదివారం రైతు పొలం దున్నుతున్న ఫోటోను షేర్ చేశాడు. తాజాగా మరో అడుగు ముందుకేసిన వాన్ .. ఆ పిచ్‌పై తన ప్రిపరేషన్ ఎలా ఉందో చూడండి అంటూ మరో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలో వాన్ దున్నిన పొలంలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఫోజిచ్చాడు. ''నాలుగో టెస్టుకు నా ప్రిపరేషన్ సూపర్‌గా జరుగుతుంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. వాన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ''సిరీస్‌ను టీమిండియా 3-1తో ఎగురేసుకుపోవడం ఖాయం.. నాలుగో టెస్టు.. పింక్ బాల్ టెస్టు కన్నా దారుణంగా ఉండబోతుంది.. మీ పోస్టులు నవ్వు తెప్పిస్తున్నా.. పిచ్ కండీషన్ మాత్రం భయకరంగా ఉంది'' అంటూ కామెంట్లు చేశారు. అహ్మదాబాద్ పిచ్‌పై వాన్తో పాటు యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, మార్క్ వా లాంటి మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు చేశారు. కాగా మూడో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం(మార్చి 4) నుంచి జరగనుంది. చదవండి: మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి! ఇది 5 రోజుల టెస్టు పిచ్ కాదు: మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by Michael vaughan (@michaelvaughan) -
నాల్గో టెస్టుకు సేమ్ పిచ్ కావాలి: మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: మొటేరా పిచ్ నాణ్యతపై చర్చ కొనసాగుతోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఇప్పటికే.. ‘‘ఇది ఐదు రోజుల టెస్టు పిచ్ కాదు’’ అంటూ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన నాటి నుంచి ఇంగ్లిష్ మీడియా సైతం ఇదే తరహా కామెంట్లు చేస్తోంది. ఈ విషయాల గురించి తాజాగా స్పందించిన వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్.. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడం తనకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు పిచ్ గురించి మాట్లాడటం మానేయాలని, స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై పర్యాటక జట్టు దృష్టి సారించాలని హితవు పలికాడు. ‘‘ఇండియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో, మూడో టెస్టు గురించి ఈ మధ్య కాలంలో చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాను. పిచ్ గురించి ఎవరైతే బాగా బాధపడుతున్నారో వారు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. టెస్టు మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. స్పిన్‌కు మాత్రమే పిచ్ అనుకూలిస్తుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. నిజానికి మీరు ఎక్కడ ఆడుతున్నారో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకు వెళ్తున్నారు అంటేనే స్పిన్ లాండ్కు వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. పిచ్ గురించి చింతించడం మానేయాలి’’ అని ఫేస్బుక్ వీడియోలో రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా నాలుగో టెస్టుకు కూడా సేమ్ పిచ్‌ను తయారు చేయాలని ఇండియాకు విజ్ఞప్తి చేశాడు. ‘‘రెండు రోజుల్లోనే మూడో టెస్టు ముగిసింది. కాబట్టి పిచ్‌ను అంచనా వేసేందుకు ఇంగ్లండ్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది. నాలుగో టెస్టు ఎలా ఉండబోతోందో అర్థమయింది. నేనైతే ఆఖరి టెస్టు మ్యాచ్‌కు కూడా అదే పిచ్ తయారుచేయాలని కోరుకుంటున్నా’’అని రిచర్డ్స్' పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పిచ్ నాణ్యతపై చర్చ చేయి దాటిపోతోందంటూ విమర్శకులపై మండిపడిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ‘‘పిచ్ స్పిన్నింగ్స్కు అనుకూలంగా మారినప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరు ఏడుపు మొదలెట్టేశారు’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: 'పిచ్‌ను నిందించడం కాదు.. ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టండి' మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి! -
మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి!
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయం సాధించినప్పటి నుంచి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ఏదో ఒక విమర్శ చేస్తూనే వచ్చాడు. అసలు ఇది టెస్టు మ్యాచ్ నిర్వహించాల్సిన పిచ్ కాదని.. మూడో టెస్టులో ఎవరు విజయం సాధించలేదని.. టీమిండియా ఏం చేసినా ఐసీసీ అభ్యంతరం చెప్పకుండా అనుమతిస్తుందంటూ ఇంగ్లీష్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా వాన్ మొటేరా పిచ్ నుంచి ఉద్దేశించి మరోసారి ట్రోల్ చేశాడు. నాలుగో టెస్టుకు సంబంధించి మొటేరా పిచ్‌ను క్యురేటర్ ఏ విధంగా రూపొందిస్తున్నాడో చూడండంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఒక రైతు తన ఎద్దులతో పొలం దున్నుతున్నట్లుగా ఉంది. వాన్ దీనిని మొటేరా పిచ్‌తో పోలుస్తూ.. 'మొటేరా పిచ్‌ను క్యురేటర్ కూడా ఇలానే సిద్ధం చేస్తున్నాడు. ఈసారి మాత్రం 5 రోజులు మ్యాచ్ జరిగేలా ప్రయత్నిస్తున్నట్లున్నాడు. ఈ ఐదు రోజులు కూడా పిచ్ స్పిన్‌కు అనుకూలించేలా రూపోందిస్తున్న అతన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా'అంటూ కామెంట్ చేశాడు. వాన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో టెస్టు విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆఖరి టెస్టులో విజయం సాధించినా లేదంటే డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మార్చి 4వ తేదీ నుంచి మొదలుకానుంది. చదవండి: ఇది 5 రోజుల టెస్టు పిచ్ కాదు: మాజీ క్రికెటర్ ఇలాంటి ప్లేస్‌లో 5 రోజులు ఉంటానా! View this post on Instagram A post shared by Michael vaughan (@michaelvaughan) -
మోదీ స్టేడియంగా మారిన మొతేరా
-
మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం
-
నరేంద్ర మోదీ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
అహ్మదాబాద్: కొత్తగా నిర్మించిన స్టేడియానికి కొత్త పేరు పెట్టారు. ‘ఉక్కుమనిషి’ సర్దార్ పటేల్ పేరుతో ఉన్న మైదానానికి ఉక్కు సంకల్పంతో అడుగువేసే భారత ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం’గా మార్చారు. అయితే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించేదాకా పేరు మార్పుపై గోప్యత పాటించారు. లాంఛనంగా ప్రారంభించాక రాష్ట్రపతి మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానం భారత్‌లో ఉండటం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు. 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు 90 వేల సీట్ల సామర్థ్యమున్న మెల్బోర్న్ స్టేడియంను చూశానని... అదే అప్పుడు అతిపెద్ద మైదానమని ఇప్పుడు అతిపెద్ద స్టేడియానికి భారత్ వేదికయిందని కోవింద్ వివరించారు. మోదీ పేరెందుకంటే... గుజరాత్ క్రికెట్ సంఘం(జీసీఏ)లో భాగమైన ఈ స్టేడియం కాబట్టి అంతా సర్దార్ పటేల్ పేరుతోనే కొత్తగా ముస్తాబైందనుకున్నారు. బుధవారం జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో నూతన సర్దార్ పటేల్ స్టేడియంలోనే పింక్‌బాల్ టెస్టు అనే రాశారు. కానీ రాష్ట్రపతి ఆవిష్కరించే సరికి ఇది మోదీ మైదానమని బయటపడింది. ఇది ఇప్పటి ప్రధాని, ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. సీఎంగా ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని స్టేడియాల్ని తలదన్నేలా ఓ ఎవరెస్ట్ అంతటి క్రికెట్ మైదానాన్ని నిర్మించాలనే సంకల్పంతో మోదీ పునాదిరాయి వేశారు. ఆఖరిదాకా అదే సంకల్పంతో పూర్తి చేశారు కాబట్టే మోదీ స్టేడియంగా మన ముందుకొచ్చింది. సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్... మోదీ స్టేడియం ఆవిష్కరించినప్పటికీ సర్దార్ పటేల్ నామఫలకం కనుమరుగేం కాలేదు. ఎందుకంటే 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలోనే ‘ది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్’కు రాష్ట్రపతి భూమిపూజ చేశారు. ఇందులో ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్‌టెన్నిస్ తదితర స్టేడియాలను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించనున్నారు. అధునాతన సదుపాయాలతో బహుళ క్రీడా మైదానాల సముదాయంగా సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు అంతర్జాతీయ స్థాయి మెరుగులు దిద్దనున్నారు. అందుకే ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇప్పుడు అహ్మదాబాద్ క్రీడానగరిగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు. When I went to Australia in Nov 2018, I learnt that 90,000-seater Melbourne Cricket Ground was the largest in world. It is a proud moment for India today that Motera's 1,32,000-seater stadium has become the world's largest cricket stadium: President Ram Nath Kovind in Ahmedabad pic.twitter.com/p7IoBsHjyf — ANI (@ANI) February 24, 2021 Coupled with Sardar Vallabhbhai Patel Sports Enclave & Narendra Modi Stadium in Motera, a sports complex will also be built in Naranpura. These 3 will be equipped to host any international sports event. Ahmedabad to be known as the 'sports city' of India: Union Home Min Amit Shah pic.twitter.com/4qkn4gBs04 — ANI (@ANI) February 24, 2021