అహ్మదాబాద్: మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లో ముగియడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ మొదటి నుంచి పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా మ్యాచ్‌ను పది వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత మొదలైన వాన్ విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉండడం విశేషం. ''అసలు టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగింది అసలు టెస్టు మ్యాచ్ కాదని.. టెస్టు మ్యాచ్ నిర్వహణకు పిచ్ ఏ మాత్రం సరిపోదని.. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించలేదంటూ'' వ్యంగ్యాస్త్రాలు సందించాడు. అంతేగాక నాలుగో టెస్టు కూడా అహ్మదాబాద్ వేదికగానే జరుగుతుండడంతో పిచ్ ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి అంటూ గత ఆదివారం రైతు పొలం దున్నుతున్న ఫోటోను షేర్ చేశాడు.
తాజాగా మరో అడుగు ముందుకేసిన వాన్ .. ఆ పిచ్‌పై తన ప్రిపరేషన్ ఎలా ఉందో చూడండి అంటూ మరో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలో వాన్ దున్నిన పొలంలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఫోజిచ్చాడు. ''నాలుగో టెస్టుకు నా ప్రిపరేషన్ సూపర్‌గా జరుగుతుంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. వాన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
''సిరీస్‌ను టీమిండియా 3-1తో ఎగురేసుకుపోవడం ఖాయం.. నాలుగో టెస్టు.. పింక్ బాల్ టెస్టు కన్నా దారుణంగా ఉండబోతుంది.. మీ పోస్టులు నవ్వు తెప్పిస్తున్నా.. పిచ్ కండీషన్ మాత్రం భయకరంగా ఉంది'' అంటూ కామెంట్లు చేశారు. అహ్మదాబాద్ పిచ్‌పై వాన్‌తో పాటు యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, మార్క్ వా లాంటి మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు చేశారు. కాగా మూడో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం(మార్చి 4) నుంచి జరగనుంది.
చదవండి:
మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి!
ఇది 5 రోజుల టెస్టు పిచ్ కాదు: మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment