
లండన్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ మరోసారి అహ్మదాబాద్ పిచ్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. మంగళవారం మొటేరా పిచ్‌ను దున్నిన పొలంతో పోలుస్తూ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా స్టిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వాన్ మరో వీడియోతో ముందుకు వచ్చాడు. ఈసారి మొటేరా పిచ్ రిపోర్ట్‌ను అందిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ''పిచ్ కండీషన్ సూపర్‌గా ఉంది.. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వారి సొంతం.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
దీనిపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఆడమ్ లిత్, మాజీ ఫుట్‌బాలర్ జేమి రెడ్క్‌నాప్‌లు వాన్ పెట్టిన పోస్టుపై లాఫింగ్ ఎమోజీ జత చేశారు. అయితే వాన్‌ను మాత్రం నెటిజన్లు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. వాన్ ఇక నువ్వు మారవా.. ఇంగ్లండ్, టీమిండియాలు మూడో టెస్టును మరిచిపోయి నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్నాయి.. నువ్వు మాత్రం పిచ్‌ను పట్టుకునే వేలాడుతున్నావు.. వాన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు.. అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు... వాన్ చేసే పనులు నవ్వు తెప్పిస్తున్నా.. ప్రతీసారి అదే అంటే చిరాకు వేస్తుంది. అంటూ కామెంట్లు పెట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు రేపటినుంచి(గురువారం, మార్చి 4న) జరగనుంది.
చదవండి: 'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్'
మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి!
Comments
Please login to add a commentAdd a comment