mother and child dead
-
తల్లీబిడ్డ దారుణ హత్య
చీమకుర్తి: తల్లీబిడ్డను హత్య చేసి దహనం చేసిన అమానుష ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో మంగళవారం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని పసిబిడ్డతో సహా సుమారు 23 సంవత్సరాల వయస్సు గల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అతి దారుణంగా హత్యచేశారు. వీరిద్దరినీ తల్లీబిడ్డలుగా పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఈ సంఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో దిశ ఘటన మరువక ముందే జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు, మద్దిపాడు మండలం పెదకొత్తపల్లికి మధ్య రోడ్డులోని పొలాల్లో ఓ రైతు మంటలను గమనించి పేర్నమిట్టలో కొందరికి చెప్పాడు. వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తల్లీబిడ్డ మృతదేహాలు కొంతమేర కాలిపోయి గుర్తించడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బా, పెద్ద బండ రాయి ఉన్నాయి. తల్లిని పెద్ద బండరాయితో తలపై మోది చంపి ఉంటారని, ఆ తర్వాత బిడ్డను చంపి ఇద్దరిపై పెట్రోల్ పోసి దహనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చిన్న బిడ్డను బాలికగా గుర్తించారు. హత్యకు గురైన మహిళ గులాబీ రంగు చీర, అదే రంగు చెప్పులు ధరించి ఉంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ నేతృత్వంలో స్థానిక పోలీసులు ఘటనా ప్రాంతంలో వివరాలు సేకరించారు. నిందితులు ఎవరు?, ఎందుకీ ఘోరానికి పాల్పడ్డారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
వైద్యుల నిర్వాకానికి బలైన నిండు ప్రాణాలు..
సాక్షి, మహబూబ్‌నగర్ : వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలో కొందరు ప్రైవేట్ వైద్యుల నిర్వాకంతో బాలింతతో పాటు నవజాత శిశువు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గొల్లబండతండాకు చెందిన రాజేశ్వరి ప్రసవం కోసం గురువారం పట్టణంలోని వన్‌టౌన్ సమీపంలోని శ్రీలతరెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో పని చేసే వైద్యులు రాజేశ్వరికి ఆపరేషన్ చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అధిక రక్తస్రావం, ఇతర కారణాల వల్ల మొదట బాలింత మృతి చెందగా.. కొద్ది నిమిషాల్లోనే నవజాత శిశువు కూడా మృతి చెందింది. బాలింత రాజేశ్వరి మృతదేహం ఆస్పత్రి అద్దాలు ధ్వంసం బాలింత రాజేశ్వరి, శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ధర్నా చేశారు. ఆస్పత్రికి సంబంధించిన కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి వన్‌టౌన్ పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయంపై సంబంధిత వైద్యురాలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందరూ అర్హత కల్గిన వైద్యులే పని చేస్తున్నారని, అధిక రక్తస్రావం వల్లే బాలింత మృతి చెందిందని, దీంట్లో వైద్యుల తప్పులేదని చెప్పారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులతో సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు భేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. -
పండగవేళ.. ప్రమాదం
తూర్పుగోదావరి ,గండేపల్లి (జగ్గంపేట): సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో పండగపూట విషాదం నెలకొంది. రెప్పపాటులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లీకూతురు, మరోచోట ఓ మహిళ ఇలా వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. లారీ ఢీకొని తల్లీకూతురు.. పండగకు సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చిన ఆ తల్లీకూతరు దుర్మరణం చెందారు. బంధువులతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన ఆచంట అప్పలరాజు అనే మహిళతో పాటు శ్రీను, శెట్టిపల్లి నాగవీరదుర్గ(దేవి)(23), అమ్ము(4)లు ఈ నలుగురు గురువారం మోటార్ సైకిల్‌పై మండలంలోని తాళ్లూరులో బట్టల షాపునకు వచ్చారు. తిరుగుప్రయాణంలో జెడ్ రాగంపేట పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకుని సొసైటీ కార్యాలయం సమీపంలో ఉన్న డివైడర్ వద్ద రోడ్డు దాటారు. ముందు వెళుతున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వెనుకే వస్తున్న లారీ వీరిని ఢీకొని మోటార్ సైకిల్‌ను కొంతమేర ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో నాగ వీర దుర్గ ఎడమవైపు శరీరం నడుమ నుంచి మోకాలి వరకు నుజ్జునుజ్జయ్యి అక్కడిక్కడే మృతి చెందింది. చిన్నారి అమ్ము కూడా ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై పడిపోవడంతో శ్రీను, అప్పలరాజుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అప్పలరాజును జగ్గంపేట ప్రైవేట్ ఆస్పత్రికి, శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీవనోపాధి నిమిత్తం నాగ వీరదుర్గ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారని, ఇటీవల ఈమె పండగ నిమిత్తం లింగంపర్తి వచ్చినట్టు తెలిసింది. వీరందరూ సమీప బంధువులని చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం సేవించినట్టు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై రాస్త్రారోకో.. తమకళ్లెదుటే ప్రమాదం జరగడంతో ఆగ్రహించిన స్థానికులు, ఇతర ప్రయాణికులు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. సుమారు గంటపాటు నిర్వహించిన ఈ ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు దీరి ట్రాఫిక్ నిలిచిపోయింది. డివైడర్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మల్లేపల్లిలో మండలంలోని మల్లేపల్లికి చెందిన దిడ్డి సుబ్బలక్ష్మి (47) లారీ ఢీకొని మృతి చెందింది. శుక్రవారం ఉదయం గ్రామంలోని కొత్తూరు సెంటర్లో రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళుతున్న లారీ ఈమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈమె అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు. గండేపల్లిలో..: గ్రామానికి చెందిన రాయుడు అన్నవరం (57) స్థానికంగా ఉన్న కాన్ చెరువులో పడి మృతిచెందాడు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన అన్నవరం ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి తొట్టెలో పడి తల్లీబిడ్డలు మృతి
చిత్తూరు, శాంతిపురం: కర్ణాటక పరిధిలోని బుల్లంపల్లి వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడిన కొడుకును కాపాడే ప్రయత్నంలో బిడ్డతో సహా తల్లి మృతి చెందింది. కేజీఎఫ్‌లోని ఆండర్‌సన్‌పేట్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ హరీష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాంతిపురానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దేవరాజులు మాదిగ బుల్లంపల్లికి చెందిన శోభ(28)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 6, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. శోభ మంగళవారం పిల్లలతో పుట్టింటికి వచ్చింది. బుధవారం మద్యాహ్నం ఇంటి బయట ఆడుకొంటున్న కొడుకు రఘు(4) కనిపించక పోవడంతో వెతుకుతూ వెళ్లింది. గ్రా మ సమీపంలోని ఇంకుడు గుంతలోపడి ఉన్న కొడుకును చూసి కాపాడే ప్రయత్నంలో తానూ నీటిలోకి పడిపోయింది. దీంతో తల్లి, బిడ్డలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లీబిడ్డలు ఎంతకూ రాకపోవటంతో వెతికిన కుటుంబ సభ్యులు ఇంకుడు గుంతలో మృతదేహాలను గమనించి బయటకు తీశారు. గంట క్రితం వరకూ ఆడుతూ కనిపించిన పిల్లాడు, అందరితో మంచి గా ఉండే శోభ ఒక్కసారిగా శవాలుగా మారటంతో బాధిత కుటుంబం ఆక్రందనలు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతదేహాలను కేజీఎఫ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. -
ఆస్పత్రి కాటేసింది..
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి నలుగురు దారుణ పరిస్థితుల్లో చనిపోయారు. సకాలంలో వైద్యం అందక ఒకరు ప్రాణాలు కోల్పోతే.. ఫిజీషియన్ అందుబాటులో లేక ఒక హృద్రోగి మృతి చెందగా, కాన్పు కోసం వచ్చిన తల్లి.. కడుపులో ఉన్న బిడ్డ చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం తోనే వీరు చనిపోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహోదగ్రులయ్యారు. వైద్యాధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆసుపత్రిని అపోలో లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించినా సామాన్యుడికి అత్యవసర వైద్యం బహుదూరమని మరోమారు నిరూపితమైంది. దిక్కులేని వ్యక్తి మృతి.. ప్రభుత్వాసుపత్రికి ఎలాంటి వారు వచ్చినా ప్రాథమికంగా వైద్య సేవలు అందించాలని చట్టం చెబుతోంది. ఆసుపత్రి ఆవరణలో సైకిల్ స్టాండు వద్ద మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దాదాపు 45 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ దారిలో వైద్యులు, సిబ్బంది నడిచి వెళుతున్నా ఏ ఒక్కరూ ప్రాణాపాయ స్థితిలో పడున్న వ్యక్తిని తీసుకెళ్లి వైద్యం అందించలేకపోయారు. సమాచారం అందుకున్న పాత్రికేయులు ఘటనా స్థలానికి చేరుకున్న తరువాత వైద్యాధికారులు మేల్కొన్నారు. వెంటనే అత్యవసర చికిత్స వి భాగానికి తీసుకెళ్లారు. అయిదు నిముషాల తరువాత ఇతను చనిపోయాడు. సకాలంలో చికిత్స అందించి ఉంటే బతికేవాడు. నిండు చూలాలు కాటికి.. గంగాధరనెల్లూరు మండలం కొండేపల్లెకు చెందిన శీనయ్య రెండో కుమార్తె రేఖ (27)ను పదేళ్ల క్రితం తమిళనాడులోని పొన్నైకు చెందిన శశికుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. రేఖ, శశికుమా ర్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. నాలుగో కాన్పు కోసం వారం క్రితం రేఖ పుట్టింటికి వచ్చింది. మంగళవారం ప్రసవ నొప్పులు రావడంతో తూగుం డ్రం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఇక్కడ కాన్పు చేయలేమని వైద్యులు చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. రేఖను అడ్మిట్ చేసుకున్న వై ద్యులు సకాలంలో ట్రీట్మెంట్ ప్రారంభించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. సాయంత్రం 7 గంటల ప్రాం తంలో సిరేజియన్ చేయాలని, కొన్ని ఫారాల్లో శశికుమార్ వద్ద సంతకాలు తీసుకున్నారు. 5 నిముషాల తరువాత బిడ్డ తల పెద్దదిగా ఉండటంతో కడుపులోనే చనిపోయాడని చెప్పి, తల్లికి ఎ లాంటి ఇబ్బందిలేదన్నారు. 5నిముషా ల తరువాత వచ్చి మరో ఫారంలో సంతకం పెట్టమన్నారు. అనుమానం వచ్చిన కుటుంబీకులు అసలు ఏం జరి గిందని ఆరా తీస్తే తల్లి కూడా చనిపోయిందని చెప్పారు. వెంటనే తల్లి బిడ్డ మృతదేహాలను ఓ ప్రైవేటు ఆంబులెన్సులో ఎక్కించి గంగాధరనెల్లూరు తీ సుకెళ్లాలని కొందరు వ్యక్తులు వాహనం ఎక్కించేశారు. పుట్టెడు దుఖం లో ఉంటే మృతదేహాలను ఉన్నఫలాన వ్యానులో ఎక్కించేయడంపై రేఖ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలను కిందకు దించి ఆసుపత్రిలో ధర్నా చేశారు. ఇక్కడి వైద్యులే తమ బిడ్డను చంపేశారని, బిడ్డ నొప్పులకు అరుస్తుంటే డాక్టర్ ఏ మా త్రం పట్టించుకోలేదని, ఇక్కడ పేదలకు వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేసా ్తమని పోలీసులు హామీ ఇవ్వడంతో వా రు మృతదేహాలను తీసుకుని వెళ్లారు. గుండెపోటుతో మరో మహిళ.. చిత్తూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఆగ్నస్(52)కు ఛాతిలో నొప్పిరావడం తో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఫిజీషియన్ అందుబాటులో లేకపోవడంతో వేలూ రు సీఎంసీకి తీసుకెళ్లాలని సూచించా రు. వ్యాన్ ఎక్కించేలోపే మరోసారి గుం డెనొప్పి రావడంతో మృతిచెందింది. -
దుబాయ్‌లో 11వ అంతస్తు నుంచి పడి భారతీయ తల్లీబిడ్డల మృతి
దుబాయ్‌లో ఘోరం జరిగింది. ఓ ఆకాశ హర్మ్యంలోని 11వ అంతస్థు నుంచి పడి భారత దేశానికి చెందిన తల్లీబిడ్డలు మరణించారు. ఈ సంఘటనలో మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన్‌హట్టన్ టవర్స్‌లో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు దుబాయ్ పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధినేత బ్రిగెడియర్ ఒమర్ అల్ షమ్సీ తెలిపారు. అంత చిన్నపిల్ల కూడా అంత ఎత్తు నుంచి పడిపోయి చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తోందని, సంఘటన గురించి చెప్పడానికి నోట మాటలు రావట్లేదని అదే భవనంలో నివాసం ఉండే ఓ వ్యక్తి చెప్పారు. ఇలాంటిది ఎప్పుడూ చూడకూడదని, పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదని అన్నారు. తల్లీ బిడ్డలు బాల్కనీ నుంచి పడిపోయి చనిపోయే సమయానికి భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. దాదాపు ఏడాది కాలం నుంచి ఆ కుటుంబం అదే భవనంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐడీ విభాగం అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య లేఖ ఏదీ కూడా ఇంట్లో లేనందున అది ఆత్మహత్య కాకపోవచ్చని భావిస్తున్నారు. వాళ్లు ప్రమాదవశాత్తు పడిపోయారా లేక ఇందులో ఏమైనా కుట్ర ఉందా అనే విషయాలు దర్యాప్తు తర్వాతే తేలాల్సి ఉంది.