
రేఖ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి నలుగురు దారుణ పరిస్థితుల్లో చనిపోయారు. సకాలంలో వైద్యం అందక ఒకరు ప్రాణాలు కోల్పోతే.. ఫిజీషియన్ అందుబాటులో లేక ఒక హృద్రోగి మృతి చెందగా, కాన్పు కోసం వచ్చిన తల్లి.. కడుపులో ఉన్న బిడ్డ చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం తోనే వీరు చనిపోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహోదగ్రులయ్యారు. వైద్యాధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆసుపత్రిని అపోలో లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించినా సామాన్యుడికి అత్యవసర వైద్యం బహుదూరమని మరోమారు నిరూపితమైంది.
దిక్కులేని వ్యక్తి మృతి..
ప్రభుత్వాసుపత్రికి ఎలాంటి వారు వచ్చినా ప్రాథమికంగా వైద్య సేవలు అందించాలని చట్టం చెబుతోంది. ఆసుపత్రి ఆవరణలో సైకిల్ స్టాండు వద్ద మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దాదాపు 45 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ దారిలో వైద్యులు, సిబ్బంది నడిచి వెళుతున్నా ఏ ఒక్కరూ ప్రాణాపాయ స్థితిలో పడున్న వ్యక్తిని తీసుకెళ్లి వైద్యం అందించలేకపోయారు. సమాచారం అందుకున్న పాత్రికేయులు ఘటనా స్థలానికి చేరుకున్న తరువాత వైద్యాధికారులు మేల్కొన్నారు. వెంటనే అత్యవసర చికిత్స వి భాగానికి తీసుకెళ్లారు. అయిదు నిముషాల తరువాత ఇతను చనిపోయాడు. సకాలంలో చికిత్స అందించి ఉంటే బతికేవాడు.
నిండు చూలాలు కాటికి..
గంగాధరనెల్లూరు మండలం కొండేపల్లెకు చెందిన శీనయ్య రెండో కుమార్తె రేఖ (27)ను పదేళ్ల క్రితం తమిళనాడులోని పొన్నైకు చెందిన శశికుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. రేఖ, శశికుమా ర్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. నాలుగో కాన్పు కోసం వారం క్రితం రేఖ పుట్టింటికి వచ్చింది. మంగళవారం ప్రసవ నొప్పులు రావడంతో తూగుం డ్రం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఇక్కడ కాన్పు చేయలేమని వైద్యులు చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. రేఖను అడ్మిట్ చేసుకున్న వై ద్యులు సకాలంలో ట్రీట్‌మెంట్ ప్రారంభించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. సాయంత్రం 7 గంటల ప్రాం తంలో సిరేజియన్ చేయాలని, కొన్ని ఫారాల్లో శశికుమార్ వద్ద సంతకాలు తీసుకున్నారు. 5 నిముషాల తరువాత బిడ్డ తల పెద్దదిగా ఉండటంతో కడుపులోనే చనిపోయాడని చెప్పి, తల్లికి ఎ లాంటి ఇబ్బందిలేదన్నారు. 5నిముషా ల తరువాత వచ్చి మరో ఫారంలో సంతకం పెట్టమన్నారు.
అనుమానం వచ్చిన కుటుంబీకులు అసలు ఏం జరి గిందని ఆరా తీస్తే తల్లి కూడా చనిపోయిందని చెప్పారు. వెంటనే తల్లి బిడ్డ మృతదేహాలను ఓ ప్రైవేటు ఆంబులెన్సులో ఎక్కించి గంగాధరనెల్లూరు తీ సుకెళ్లాలని కొందరు వ్యక్తులు వాహనం ఎక్కించేశారు. పుట్టెడు దుఖం లో ఉంటే మృతదేహాలను ఉన్నఫలాన వ్యానులో ఎక్కించేయడంపై రేఖ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలను కిందకు దించి ఆసుపత్రిలో ధర్నా చేశారు. ఇక్కడి వైద్యులే తమ బిడ్డను చంపేశారని, బిడ్డ నొప్పులకు అరుస్తుంటే డాక్టర్ ఏ మా త్రం పట్టించుకోలేదని, ఇక్కడ పేదలకు వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేసా ్తమని పోలీసులు హామీ ఇవ్వడంతో వా రు మృతదేహాలను తీసుకుని వెళ్లారు.
గుండెపోటుతో మరో మహిళ..
చిత్తూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఆగ్నస్(52)కు ఛాతిలో నొప్పిరావడం తో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఫిజీషియన్ అందుబాటులో లేకపోవడంతో వేలూ రు సీఎంసీకి తీసుకెళ్లాలని సూచించా రు. వ్యాన్ ఎక్కించేలోపే మరోసారి గుం డెనొప్పి రావడంతో మృతిచెందింది.
Comments
Please login to add a commentAdd a comment