నర్సు వైద్యం వికటించి గర్బిణి,శిశువు మృతి
అనంతపురం: జిల్లాలోని మండల కేంద్రం అమరాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నర్సు అందించిన వైద్యం వల్ల విషాదం నెలకొంది. ఓ గర్భిణికి నర్సు తెలిసి తెలియని వైద్యం అందించింది. అది వికటించింది. దాంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతి చెందింది.
దాంతో ఆ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వారు నిరసనగా ఆందోళన చేస్తున్నా వైద్యాధికారులు
మాత్రం పట్టించుకోవడంలేదు. తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.