Mother therissa
-
మదర్‌థెరిసా విద్యార్థినికి బంగారు పతకం
గంగవరం: మండలంలోని మదర్‌థెరిసా ఇంజినీరింగ్ విద్యార్థిని రోహిత బంగారు పతకం సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ రవీంద్రబాబు తెలిపారు. ఐదు జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తమ కళాశాలకు ఈ పతకం రావడం హర్షదాయకమన్నారు. కళాశాలలో 2013– 17 బ్యాచ్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివిన రోహిత 86.01శాతం మార్కులతో జేఎన్టీయూ పరిధిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థినిని కళాశాల యాజమాన్యం రాజేంద్రరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి అభినందించారు. -
మదర్‌కు జన నీరాజనం
బత్తిలి (భామిని) : నోబుల్ శాంతి అవార్డు గ్రహీత, విశ్వమాతగా గుర్తింపు పొందిన మదర్ థెరిసాకు వాటికన్ సిటీలో పోప్ సెయింట్ హూడ్గా ప్రకటించిన వేళ క్రైస్తవుల్లో ఆనందం వెళ్లివిరిసింది. మదర్ భారీ చిత్రపటంతో ఆదివారం బత్తిలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేదలకు సేవలు చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తన వంతు మానవతా ధృక్పథంతో సేవలందించిన మదర్ విశ్వమాతగా గుర్తింపు పొందిన వేళ ఈ ప్రాంత క్రైస్తవులు ఆనందంలో మునిగిపోయారు. బత్తిలి ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో థెరిసా చిత్రపటానికి పూజలు చేశారు. చర్చి ఫాదర్ వార శౌరి, ఆనందబాబుల ఆధ్వర్యంలో తిరు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. క్రైస్తవ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ప్యారీస్ కమిటీ అధ్యక్షుడు టింగ అన్నాజీరావు, సహకార ౖyð రెక్టర్ టింగ సుమలత, మాజీ సర్పంచ్ గడబ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
మదర్‌థెరిస్సా జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
మరికల్ (ధన్వాడ) : మదర్‌థెరిస్సా జయంతిని పురష్కరించుకుని మరికల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రతిష్ఠించిన మదర్‌థెరిస్సా విగ్రహానికి ఆ సంఘం సభ్యులు గురువారం రంగులు వేయించారు. శుక్రవారం జరిగే జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
మనసున్న మా‘రాజా’
పంజగుట్ట: ‘మానవ సేవే మాధవ సేవ’గా భావించిన అతను రోడ్డుపై పడి ఉన్న అభాగ్యులను అక్కున చేర్చుకుని సేవచేస్తున్నాడు. వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ముందుకు రాకపోయినా తనే స్వయంగా వారికి అవసరమైన అన్ని సేవలు చేస్తున్నాడు. అతనే బెంగళూరుకు చెందిన ఆటో రాజా. 18 ఏళ్ల క్రితం బెంగళూరులో ‘హోం ఆఫ్ హోప్’ పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేసి వేలాదిమందికి చేయూతనందించిన రాజా తెలుగు రాష్ట్రాల్లోనూ తన సేవలు విస్తరింపజేస్తానని తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 1998లో మథర్ థెరీస్సాను ఆదర్శంగా తీసుకుని సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ఇందుకుగాను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని 18 మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించాడు. తరువాత దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తతృతం చేశానన్నాడు. సేవచేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని పేర్కొంటున్న రాజా తన ఆశ్రమం స్త్రీ, పురుషులు, పిల్లలకు వేర్వేరుగా వసతి కల్పిస్తున్నట్లు తెలిపాడు. తన భార్య దేవకృప, ముగ్గురు పిల్లలు ఇందులో భాగస్వాములవుతున్నట్లు తెలిపాడు. ‘హోమ్ ఆఫ్ హోప్’లో ప్రస్తుతం 540 మంది ఆశ్రమం పొందుతున్నారని, వారికి మూడు పూటలా భోజనం, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపాడు. రాజా సేవలను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి. సిఎన్ఎన్, ఐబీఎన్ మీడియా ఆధ్వర్యంలో ముఖేష్ అంబానీ చేతులమీదుగా ‘రియల్ హీరో 2010’ అవార్డు అందుకున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనను స్వయంగా అభినందించారన్నారు. స్టార్‌ప్లస్‌లో ఆజ్‌కీ రాత్ జిందగీ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అమితాబచ్చన్ అభినందనలు అందుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం ‘బెంగళూరు ఎంజిల్’ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ సమాజ సేవ 2013 అవార్డు అందించారు. హైదరాబాద్‌లోనూ తన సేవా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.