సీపీఎల్ జట్టులో వాటా కొన్న కేకేఆర్
టైటిల్ స్పాన్సర్‌గా హీరో
కింగ్స్టన్ : వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)పై భారత కార్పొరేట్ల కన్ను పడింది. ఆరు జట్లు ఆడే ఈ టోర్నీకి ప్రఖ్యాత మోటార్‌బైక్‌ల సంస్థ హీరో 2015 సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అలాగే ఈ లీగ్‌లో ఆడే ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్ జట్టులో ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం వాటా కొనుగోలు చేసింది. ‘మా సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచనలో భాగంగా రెడ్‌స్టీల్ జట్టులో వాటా కొన్నాం’ అని కేకేఆర్ జట్టు సహ యజమాని షారూఖ్ ఖాన్ చెప్పారు.