the movie
-
‘ఓకే బంగారం’ఆడియో ఆవిష్కరణ
-
దిల్ రాజు 'ఓకే బంగారం'
చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న రొమాంటిక్ మూవీ 'ఓకే కన్మణి' చిత్రాన్ని తెలుగులో 'ఓకే బంగారం' పేరుతో నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మళయాళ హీరో మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ''తెలుగులో ఈ చిత్రానికి 'ఓకే బంగారం' అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఏప్రిల్‌లో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. మణిరత్నంకు నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాకు తెలుగులో నాకు అనుమతులు రావటం ఆనందంగా ఉంది. 'ఓకే కన్మణి' చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు" అని నిర్మాత దిల్ రాజు మీడియాతో అన్నారు. -
పెళ్లా.. దానికింకా చాలా సమయం ఉంది
చెన్నై: తాను చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని పెళ్లి ఆలోచన ఇప్పుడే లేదని చెబుతోంది అందాల తార సమంత. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బెంగళూర్ డేస్' చిత్రం రీమేక్‌లో తాను నటించట్లేదని అందాల తార సమంత చెప్పారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకి రీమేక్ అవుతోంది. ప్రస్తుతం తన చేతిలో అర డజనుకు పైగా చిత్రాలు ఉన్నాయని, అన్నింటిలో తన పాత్రలు చాలా బాగుంటాయని ట్విట్టర్లో తన అభిమానులతో చాట్ చేస్తూ సమంత చెప్పారు. పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ప్రస్తుతం సమంత తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళంలో విక్రమ్‌తో కలిసి నటిస్తున్నారు. -
మరోసారి... టెన్ కమాండ్మెంట్స్!
డిస్కవరీ హాలీవుడ్ సినిమా ‘టెన్ కమాండ్మెంట్స్’(1923) ఆ రోజుల్లో నిశ్శబ్దంగా సాధించిన సంచలన విజయం అంతా ఇంతా కాదు. ఆ సినిమా విడుదలై తొంభై సంవత్సరాలు దాటినా దాని విశేషాల గురించి గొప్పగా మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా ఆ సినిమా కోసం వేసిన భారీ సెట్ల గురించి. ఆ రోజులలో సినిమాకు సంబంధించిన సాంకేతికపరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఎంత పెద్ద నిర్మాణాన్ని అయినా భారీ సెట్స్‌గా వేసేవారు. అలా ‘టెన్ కమాండ్మెంట్స్’కోసం కాలిఫోర్నియాలోని వాడాలూపె సముద్ర తీరంలో ఎన్నో అందమైన భారీ సెట్లు వేశారు. విశేషమేమిటంటే, చా...లా కాలం తరువాత ‘టెన్ కమాండ్మెంట్స్’ కోసం వేసిన దేవాలయం సెట్లో కొంత భాగాన్ని, సింహిక (sphinx)ను ఆర్కియాలజిస్ట్‌లు వాడాలూపె సముద్ర తీరంలో కనుగొన్నారు. షూటింగ్ పూర్తి కాగానే చిత్రబృందం చాలా సెట్లను ధ్వంసం చేసింది. అయితే ఇప్పుడు బయటపడిన సెట్ మాత్రం పాక్షికంగానే ధ్వంసమై కాలక్రమంలో ఇసుకలో కూరుకుపోయింది. ‘‘పాత సినిమాలకు సంబంధించిన గొప్ప గొప్ప సెట్లను ఆనాటి వ్యక్తుల జ్ఞాపకాలు, పుస్తకాల్లో మాత్రమే గుర్తు చేసుకోగలం. ఇలా భౌతికంగా కనిపించడం మాత్రం చాలా అరుదైన సంఘటన’’ అంటున్నారు హిస్టారికల్ ఆర్కియాలజిస్ట్ కోలిన్ హమల్టిన్. తవ్వకాల్లో బయటపడిన ‘సింహిక’ను ప్రస్తుతం వాడాలుపె ‘డూనెస్ సెంటర్’ మ్యూజియంలో భద్రపరిచారు. ఆనాటి మరుపురాని సెట్లను వెలికితీయడానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు. తవ్వకాల్లో మరిన్ని సెట్లు, వాటి తాలూకు వస్తువులు బయటపడితే...ఇక వాటిని ‘డూనెస్ సెంటర్’లో భద్రపరచనక్కర్లేదు. ‘టెన్ కమాండ్మెంట్స్’ పేరుతో ఏకంగా ఒక మ్యూజియంనే ప్రారంభించవచ్చు!