Movie
-
సీరియల్ నటి సంగీత కళ్యాణ్‌కుమార్ (ఫొటోలు)
-
Janhvi Kapoor: దేవర మూవీలో జాన్వీ అందాలు నెక్స్ట్ లెవల్ (ఫోటోలు)
-
ఎగతాళి చేసినవాళ్లే గౌరవిస్తున్నారు
‘మనం సినిమా చూసేవాళ్లమే కానీ తీసేవాళ్లం కాదు’... భార్య వెంకట నర్సమ్మతో భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఒక్క సినిమా అయినా నిర్మించాలనే తల్లి ఆలోచనను కాదన్నాడు కుమారుడు వెంకట రవీంద్రనాథ్. రెండేళ్లు ఇంటికి దూరంగా ఎక్కడికో వెళ్లిపోయాడు కూడా. కొడుకు ఆచూకీ తెలుసుకుని ఇంటికి పిలిపించుకున్న నర్సమ్మ మళ్లీ సినిమా పాటే పాడారు. ఇక చేసేదేం లేక సినిమా నిర్మించాలని ఫిక్స్ అయిపోయారు. నర్సమ్మ వేలి ముద్ర మాత్రమే వేయగలరు. కానీ వెండితెరపై నిర్మాతగా ఓ ముద్రగా మిగిలిపోవాలని కూలి చేసి సంపాదించిన డబ్బు, రాగి సంగటి హోటలు పెట్టి, దాని ద్వారా వచ్చిన ఆదాయం... ఇలా కష్టం చేసిన డబ్బుతో ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమాని ఆరంభించారు. ఇక... మిగతా విశేషాలు నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ, ఆమె భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు మాటల్లో తెలుసుకుందాం.‘‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. పొలం పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో నేను, నా స్నేహితులు కలిసి సినిమాలు చూసే వాళ్లం. ‘బ్రహ్మంగారి చరిత్ర, పొట్టేలు పున్నమ్మ’ సినిమాలు నా మనసుని బాగా కదిలించాయి. సినిమాలపై ఇష్టంతో ఎప్పటికైనా ఓ సినిమా నిర్మించాలనుకున్నాను. అందుకోసం పట్టుదలగా పదేళ్లు శ్రమించాను. ఆ కల ఇన్నేళ్లకు ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) చిత్రంతో నెరవేరడం చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ అన్నారు. రవిబాబు, సత్యప్రకాశ్, ‘చిత్రం’ శ్రీను, చిట్టిబాబు, రమ్య, ప్రియ, పింకీ, జబర్దస్త్ నాగ్తేజ్, జూనియర్ రాజశేఖర్, సైదులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘స్పిరిట్’ ఈజ్ నాట్ వన్). తన కుమారుడు వెంకట రవీంద్రనాథ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎయిత్ వండర్ సినిమా పతాకంపై చెన్నెబోయిన వెంకట నర్సమ్మ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.నా కల ఇన్నేళ్లకు నెరవేరింది ఈ సందర్భంగా నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామం. నేను చదువుకోలేదు కాబట్టి చదవడం, రాయడం రాదు. చెన్నెబోయిన వెంకటేశ్వరరావుతో నా పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆయనతో కలిసి సినిమాలు చూసేదాన్ని. మాది వ్యవసాయ కుటుంబం. మాకున్న పొలంలో వ్యవసాయం చేసుకోవడంతో పాటు కూలి పనులకు వెళ్లేదాన్ని. బర్రెలు, మేకలు, పొట్టేళ్లు కూడా పెంచేవాళ్లం. ఓ చిన్నపాటి హోటల్ కూడా నడుపుతున్నాం. సినిమా నిర్మించాలనే నా ఆలోచనని ముందు నా భర్తకి చె΄్పాను. ఆ తర్వాత నా పెద్ద కుమారుడు వెంకట రవీంద్రనాథ్‌కి చె΄్పాను. సినిమా నిర్మాణం అంటే మాటలా? కోట్ల రూపాయలు కావాలి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? వద్దని వారించారు. ఆ తర్వాత నా పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి ఒప్పుకున్నారు. నా ఆలోచన నుంచి వచ్చిందే ‘స్పిరిట్’ సినిమా కథ. నా ఆలోచనలని వెంకట రవీంద్రనాథ్ చక్కగా తెరపై చూపించగలడనే నమ్మకంతో తననే డైరెక్షన్ చేయమన్నా. ఈ సినిమా కోసం మాకున్న పొలం, పశువులు, పొట్టేళ్లు, మేకలు, ఇల్లు అమ్మేశాం. సినిమా నిర్మాణం, పోస్ట్ ్రపొడక్షన్ పనులు, సెన్సార్ వంటి వాటికి ఇప్పటికే రూ. 90 లక్షలైంది. దాదాపు 40 లక్షలు దాకా అప్పులు చేశాం. సినిమా విడుదల చేసేందుకు పబ్లిసిటీ ఖర్చుల కోసం మరో రూ. 10 లక్షలు కావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... తెలంగాణాలోని దేవదాసీ వ్యవస్థలానే కోస్తాంధ్రలో మాతంగులు ఉండేవారు. ఇప్పుడూ ఉత్సవాలు, జాతర్లు, ఎల్లమ్మ తిరునాళ్ల వంటి సమయాల్లో వారిని డ్యాన్స్ చేయటానికి తీసుకొస్తుంటారు. వారి కష్టాలను కళ్లారా చూశాం. మాతంగుల జీవితాలు ప్రస్తుతం దుర్భరంగా ఉన్నాయి. వారిపై జరిగే దురాచారాలు పోవాలి. వారి పిల్లలు మాతంగుల వృత్తిలోకి రాకుండా చదువుకుని, ఉద్యోగాలు చేసుకోవాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం. త్వరలో ఆడియో రిలీజ్ చేసి, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే మా బంధువులు, తెలిసినవారు, ఊర్లోని వారు ‘మీరేంటి? సినిమా నిర్మించేదేంటి?’ అంటూ హేళనగా, చులకనగా మాట్లాడేవారు. అన్నింటినీ భరించి, ఈ సినిమా నిర్మించాం. దీంతో ఎగతాళిగా మాట్లాడినవారే అనుకున్నధి సాధించావంటూ ఆ΄్యాయంగా మాట్లాడుతున్నారు... గౌరవంగా చూస్తున్నారు. సినిమా నిర్మించాలనే నా కల నెరవేరింది. ఇకపై సినిమా నిర్మించను. ఇండస్ట్రీలోనే ఉండాలా? వద్దా అన్నది మా అబ్బాయి వెంకట రవీంద్రనాథ్ ఇష్టం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ఆత్మస్థైర్యం కోల్పేలేదు – చెన్నెబోయిన వెంకటేశ్వరరావు సినిమా నిర్మించాలని ఉందని నా భర్య అన్నప్పుడు మొదట్లో నేను కూడా నవ్వుతూ, ఎగతాళి చేసేవాణ్ణి. అయితే తన పట్టుదల చూసి ఆ తర్వాత ఒప్పుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఈ సినిమా నిర్మించింది. ఈ సినిమా నిర్మాణం మాకో మధురానుభూతి. అలాగే ఓ విషాదం కూడా నింపింది. ఈ చిత్రంలో నటించిన మా రెండో అబ్బాయి పాముకాటుకు గురై మృతి చెందడం మమ్మల్ని కలిచివేసింది. మా అబ్బాయి నటించిన సన్నివేశాలు వచ్చినప్పుడు నా భార్య చూడదు... బాధపడాల్సి వస్తుందని. ఈ సినిమాలో నేనో పాత్ర చేశాను. ‘స్పిరిట్’ మాకు లాభాలు తీసుకురాకపోయినా పర్లేదు. కానీ, చేసిన అప్పులు తీర్చేలా డబ్బులు వస్తే చాలు. ఏది ఏమైనా సినిమా నిర్మించామన్న తృప్తి ఎప్పటికీ ఉంటుంది. -
ఎన్టీఆర్ 'దేవర' HD మూవీ స్టిల్స్ (ఫోటోలు)
-
'కల్కి'లో చూపించిన కాశీ ఇదే.. సెట్ ఇలా ఉందా? (ఫొటోలు)
-
జస్ట్ బ్రేక్... అంతే!
మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్గా నటిస్తున్నారు నభా. ⇒ మలయాళ తార మమతా మోహన్‌దాస్ తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్‌దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్‌దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్‌బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది.