MPP husband
-
వికారాబాద్లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
సాక్షి, వికారాబాద్: పాత కక్షల నేపథ్యంలో పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదుల హత్యోదంతాన్ని మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలి భర్తను.. గ్రామ సర్పంచ్ దారుణంగా హత్య చేశాడు. పెద్దేముల్ మండలం హన్మపూర్లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. పెద్దేముల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వాణిశ్రీ భర్త వీరప్పకు, స్థానిక గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సర్పంచ్ కుటుంబ సభ్యులు వీరప్పపై దాడి చేశారు. ఊరడమ్మ గుడి దగ్గర కర్రలతో కొట్టి హత్య చేశారు. రాజకీయ కక్షల వల్లే హత్య జరిగిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
వికారాబాద్లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
-
పరిటాల శ్రీరామ్ నుంచి ప్రాణహాని
సాక్షి, ధర్మవరం(అనంతపురం) : ‘‘టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరడంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు నాపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని అనంతపురం జిల్లా రామగిరి మండల మాజీ ఎంపీపీ భర్త నసనకోట ముత్యాలప్ప ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఎదుట వాపోయాడు. ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ముత్యాలప్ప మాట్లాడుతూ.. ‘‘నాది రామగిరి మండలం నసనకోట. నా భార్య టీడీపీ హయాంలో మాజీ ఎంపీపీ. నేను ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరాను. అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు, కుటుంబ సభ్యులు నాపై కక్షకట్టి హత్య చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తల్లిమడుగు, నసనకోట గ్రామాల్లో రెండుసార్లు నాపై హత్యాయత్నం చేశారు. నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని కోరారు. డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ ముత్యాలప్ప ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
పదవిలో ఆమె.. పెత్తనంలో ఆయన
సాక్షి, తూప్రాన్: కంప్యూటర్ యుగంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వీరికి రాజకీయంగా సముచిత న్యాయం అందించడంలో భాగంగా పాలకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలుగా మహిళా ప్రతినిధులు ఎన్నికవుతున్నా వారు ఇంటికే పరిమితమవుతున్నారు. వారి భర్తలే ప్రజాప్రతినిధులుగా చెలామని అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలకే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వారి భర్తలే హాజరు అవుతున్న సంఘటనలు ప్రతినిథ్యం ఏదో ఒకచోట చూస్తూనే ఉన్నాం. ఇందుకు నిదర్శనం శుక్రవారం మండలంలోని హస్తాల్పూర్లో రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామసభ. గ్రామసభను సందర్శనకు కలెక్టర్ ధర్మారెడ్డి రాగా వెల్దుర్తి ఎంపీపీ స్వరూప భర్త నరేందర్రెడ్డి, కొప్పులపల్లి సర్పంచ్ కనకమ్మ భర్త బాల్రెడ్డిలు తామే ప్రజా ప్రతినిధులుగా పరిచయం చేసుకొని కలెక్టర్ పక్క సీటులోనే ఆసీనులయ్యారు. స్థానిక సర్పంచ్ మమత మాత్రం వీరి పక్కన కొద్దిసేపు కూర్చుండి పక్క హాలులోకి వెళ్లిపోయింది. సర్పంచ్ మమత కలెక్టర్కు దూరంగా కూర్చోగా మహిళా ప్రతినిధుల భర్తలు కలెక్టర్ పక్కన కూర్చోవడం ఎంతవరకు సమంజసమంటూ పలువురు గ్రామస్తులు చర్చించుకున్నారు. కలెక్టర్ హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలోనే ఇలా ఉంటే మండల స్థాయి అధికారులు నిర్వహించే కార్యక్రమాల్లో ఎలా ప్రవర్తిస్తారోనని మరి. మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు హాజరై దర్జా ఒలకబోయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. -
టీడీపీ ఎంపీపీ భర్త ఆడియో సంభాషణలు హల్చల్ ..
చిత్తూరు,సాక్షి: పిచ్చాటూరు ఎంపీపీపై అవిశ్వాస రాజకీయాలు వేడెక్కాయి. బేరసారాలు మొదలయ్యాయి. పిచ్చాటూరు ఎంపీపీ మధుబాల (టీడీపీ)పై స్వపక్షానికి చెందిన మెజారిటీ సభ్యులు అవిశ్వాసానికి ప్రతిపాదించారు. మొత్తం తొమ్మి ది మంది ఎంపీటీసీలుండగా ఏడుగులు టీడీపీకి చెందినవారు. ఇద్దరు వైఎస్సార్సీపీకి చెందినవారు. టీడీపీలో లుకలుకలు రావడంతో మధుబాలకు ఏడుగురిలో ఆరుగురు దూరమయ్యా రు. అంతరాలు పెరిగిపోవడంతో ఆమెపై అవి శ్వాసానికి నోటీసిచ్చారు. దీంతో ఆమె ఒంట రైంది. అక్టోబరు 1వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో దీనిపై చర్చ ఓటింగు జరగనుంది. మరో రెండు రోజులే గడువుంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మధుబాల పక్షాన ఆమె భర్త పద్మనాభరాజు బేరసారాలకు దిగారు. సభ్యులతో మంతనాలకు దిగారు. నయానో భయానో తమవైపు తిప్పుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాయిలాలు కూడా ఇస్తామని చెబుతున్నారు. సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే సభ్యులకు నోటీసులందాయి. గడువు సమీపించడంతో టీడీపీలోని మరో గ్రూపు కూడా పార్టీ మండల అధ్యక్షుడు ఇళంగోవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గేలా వ్యూహాలు పన్నుతోంది. అనుకూలంగా ఓటేయకపోయినా హాజరుకాకున్నా ఎంతో కొంత ముట్టజెబుతానని పద్మనాభరాజు మాటిస్తున్నట్లు తెలిసింది. అడవి కొడియంబేడు ఎంపీటీసీ ప్రతాప్తో ఆయన చర్చిం చిన ఆడియో టేప్ ఇటీవల ఈ ప్రాంతంలో హల్చల్ చేస్తోంది. రాకున్నా చాలని చెప్పినట్లు అందులో ఉంది. సంభాషణలో కొంత భాగం ఇలా సాగింది. ఎంపీపీ భర్త: నువ్వొచ్చి పలాంది చెయ్ అ ను.. నేను చేసి పెడ్తా అంతే.. పనా, ఇంకొకటా.. ఇంకొకటా.. ఫైనాన్సా.. ఏం చేయమంటే అది చేసిపెడతా.. నువ్వు (అవిశ్వాస తీర్మానానికి) రాకుండా ఉంటే చాలంతే.. ఎంపీటీసీ సభ్యులు: సరే..నా.. ఎంపీపీ భర్త: నేను చెప్పేదిను. ఇదేం శాశ్వతం కాదు.. మళ్లీ ఇంకోసారి.. ఇంకోసారి ఇంకేదైనా అవకాశం ఉంటాది. ఆపొద్దు కూడా నేను పట్టుబట్టి నీకు టికెట్టు తీయిచ్చి నీకు అన్నీ చేయిచ్చినాను.. నాకు ఈ సహాయం చేయంటే అది చేయిస్తానంతే.. నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా ..అంత వరకే.. ఎంపీటీసీ సభ్యులు: సరే ఓకె నా.. ఎంపీపీ భర్త: అదీ ఒకే మాట.. -
అధికారులకు ఎంపీపీ భర్త హుకుం!
జోగిపేట: ‘గ్రామాలకు వెళ్లేటప్పుడు ఎంపీపీ అధ్యక్షురాలికి చెప్పరా? ఏ శాఖలో ఏ పనులు జరుగుతున్నాయ్.. ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు తెలపాలి.. అందరూ కలిసి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది..’ ఈ మాటలు అన్నది ఏ ప్రజాప్రతినిధో కాదు.. భార్య హోదాను అడ్డుపెట్టుకుని భర్త గారు అధికారులకు జారీ చేసిన హుకుం.. ఇది. సోమవారం స్థానిక ఎంపీపీ అధ్యక్షురాలి ఛాంబర్లో మండల స్థాయి అధికారుల సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షురాలి అధ్యక్షతన నిర్వహించారు. సాక్షాత్తూ ఎంపీపీ అధ్యక్షురాలు సి.హెచ్.విజయలక్ష్మి భర్త వెంకటేశం అధికారులకు ఈ మేరకు హుకుం జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరైన అధికారులు తమను తాము పరిచయం చేసుకుంటూ, తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తుండగా సదరు భర్త..వారిని ఉద్దేశిస్తూ ఈ మాటలన్నారు. అయితే వాటిని శ్రద్ధగా వింటూ కూర్చున్న ఎంపీపీ అధ్యక్షురాలు నోరు తెరిచి ఒక్క అధికారిని కూడా ఎదురు ప్రశ్నించలేదు. హౌసింగ్ శాఖ అధికారి రమేశ్ పథకానికి సంబంధించి వివరిస్తూ పాత బిల్లులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదని, ఇంతకు ముందు మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఆధార్ నంబర్లను గ్రామాలకు వెళ్లి సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ భర్త కల్పించుకొని తమకు తెలియకుండా గ్రామాల్లోకి వెళ్తే ఎలా, మాకు సమాచారం ఇస్తే ప్రజలకు తెలియపరుస్తాం కదా అని పేర్కొన్నారు.