MPP school
-
నారావారి పల్లె ఎంపిపి స్కూలులో ఆధునిక సౌకర్యాలు
-
ఆ టీచరే ఉండాలి... లేకుంటే బడిమానేస్తాం...
సాక్షి, విజయనగరం అర్బన్: ఉద్యోగమంటే అదో మొక్కుబడి బాధ్యతగా భావించేవారినే చూశాం. వెళ్లామా... కాలక్షేపం చేశామా... క్యారియర్ ఖాళీ చేశామా... వచ్చేశామా... అనుకునేవారే ఎక్కువ. కానీ ఆ ఉపాధ్యాయిని అలా చేయలేదు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లల్లో క్రమశిక్షణ అలవాటు చేశారు. అంతేనా... తన బోధనలతో పిల్లలను ఆకట్టుకున్నారు. 45మంది పిల్లలున్న ఆ బడిలో 95మంది పిల్లలను చేర్పించారు. అలాంటి ఉపాధ్యాయురాలు బదిలీ అయిపోతే ఎలాంటివారికైనా కాస్త ఆందోళన తప్పదు. ఇక బడిపిల్లలు, వారి తల్లిదండ్రుల సంగతైతే వేరే చెప్పనవసరం లేదు. అదే జరిగింది గంట్యాడ మండలం కొర్లాంలో. అక్కడి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయిని వర్రి జ్యోతిలక్ష్మికి బదిలీ అయిందని తెలియగానే... ఊరు ఊరంతా కట్టకట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చారు. డీఈఓను కలసి తమకు ఆ టీచరే కావాలని పట్టుబట్టారు. లేదంటే బడిమానేస్తామని చెప్పారు. ఉపాధ్యాయిని ఇంటికెళ్లి తమ ఊరు వదిలి వెళ్లవద్దని వేడుకున్నారు. ఈ సంఘటన శనివారమే చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ నిజానికి పిల్లల్ని విడిచి వెళ్లడానికి తనకూ బాధగానే ఉందనీ, వృత్తి పరమైన అభ్యున్నతిని తిరస్కరించినట్లవుతుందని అన్నారు. ఇంతకీ ఆ టీచర్ ప్రత్యేకత ఏంటటే...? గంట్యాడ మండలం కొర్లాం ఎంపీపీ పాఠశాలలో 2017 ఆగస్టులో ఉపాధ్యాయినిగా బదిలీపై జ్యోతి లక్ష్మి వచ్చారు. అక్కడి విద్యార్థుల మనసులను హత్తుకునేలా బోధించారు. అప్పటికి కేవలం 45 మంది విద్యార్థులు మాత్రమే ఆ స్కూళ్లో ఉన్నారు. తరువాతి సంవత్సరం ఆనంద లహరి (అల) పథకం వర్తించడంతో భిన్న బోధనా నైపుణ్యాలు ఆ స్కూల్‌కు లభించాయి. వాటిని శతశాతం వినియోగిస్తూ గ్రామంలో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులను ఆకట్టుకునేలా ఆమె బోధనలను అందించారు. తద్వారా విద్యార్ధుల నమోదు 95 మందికి పెంచారు. అంతే గాకుండా పాఠశాల ప్రాంగణాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. అదే ఆమెపై అక్కడివారు పెంచుకున్న అభిమానానికి కారణమైంది. -
ఆనంతపురం: హిందూపురంలో కిడ్నాప్ కలకలం
-
కళ్ల ముందే కన్నబిడ్డ దుర్మరణం
పి.కోన వలస(పాచిపెంట): ఆ గిరిజన దంపతులకు ఒక్కడే కుమారుడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఐదో తరగతి చదువుకుంటున్న ఆ విద్యార్థి పాఠశాలలో జెండా పండగకి వెళ్తొస్తానని చెప్పి ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరి తల్లి కళ్లముందే దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని చాపరాయివలస గిరిజన గ్రామానికి చోడిపల్లి లింగు, సింగారమ్మ దంపతులకు లక్ష్మణ రావు అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. లింగు రోజుకూలీ కాగా సింగారమ్మ పి.కోనవలస చెక్‌పోస్టులో పాచిపని చేస్తుంటుంది. అమ్మవలస ఎంపీపీ పాఠశాలలో లక్ష్మణరావు 5వతరగతి చదువుతున్నాడు. చాపరాయివలస గ్రామంనుంచి అమ్మవలస గ్రామానికి 4 కిలోమీ టర్ల దూరం. లక్ష్మణరావు ప్రతిరోజూ పాఠశాలకు నడుచుకుని వెళ్లి వస్తుంటాడు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పాఠశాలలో నిర్వహించే జెండా పండగకు హాజరయ్యేందుకు నడుచుకుంటూ వస్తుండగా పి.కోనవలస చెక్‌పోస్ట్ దగ్గర సాలూరు నుంచి ఒడిశావైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చెక్‌పోస్టు దగ్గరే పనిచేస్తున్న తల్లికి విషయం తెలిసి ఒక్కసారిగా హతాశురాలైంది. విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన గిరిజనులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల రోదనను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. విద్యార్థి మరణ వార్త తెలుసుకున్న అమ్మవలస పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.జయ సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు అందరికంటే ముందు వచ్చేవాడని, మంచి డ్రాయింగ్స్ వేస్తూ చలాకీగా ఉండేవాడని గుర్తుచేసుకున్నారు. లక్ష్మణరావు కుటుంబానికి ప్రధానోపాధ్యాయురాలు, పాచిపెంట మండల విద్యాశాఖాధికారి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పాచిపెంట హెడ్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి, విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. లారీ డ్రైవర్ పరారవడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు.