MRO trasfers
-
TS: భారీగా ఎమ్మార్వోల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఓటమి వెనుక ఆర్టీసీ కార్మికుల కృషి -
త్వరలో తహసీల్దార్ల బదిలీలు!
నిజామాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారుల బదిలీలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే అదనపు కలె క్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక మిగిలింది తహసీల్దార్ల బదిలీలే. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 25మందికిపైగా స్థానచలనం కలిగే అవకాశముంది. మాక్లూర్ సహా మరో ఐదారుగురు ఎన్నికల నిర్వహణ బాధ్యతల నిమిత్తం జిల్లాలో కొనసాగనున్నారు. డిప్యూటీ కలె క్టర్ల పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెంటనే తహసీల్దార్ల బదిలీలపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. జులై 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో 33మంది తహసీల్దార్లు.. జిల్లాలో 33మంది తహసీల్దార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మండలాలతోపాటు కలెక్టరేట్లో ఆయా సెక్షన్లకు తహసీల్దార్ స్థాయి హోదా కలిగిన అధికారులు ఉన్నారు. మాక్లూర్ తహసీల్దార్ శంకర్ మినహా మిగతా 32మంది తహసీల్దార్లు మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. కానీ ఐదారుగురు జిల్లాలోనే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు కాకుండా జిల్లా నుంచి 25 మందికిపైగా బదిలీ అయ్యే అవకాశముంది. కోరుకున్న స్థానాలకు.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అని భావించిన తహసీల్దార్లు కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీసీఎల్ఏ నిర్ణయం మేరకే బదిలీలు ఉంటాయని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎవరు ఎక్కడికి వెళ్తారో తహసీల్దార్లకు ఇప్పటికే స్పష్టత ఉంది. ఆర్డీవోలు, తహసీల్దార్లు మల్టీజోన్ పరిధిలోకి వస్తారు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వరాదు. మన జిల్లా నుంచి కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలకు బదిలీపై వెళ్తారు. ఆయా జిల్లాల్లో మండలాలను అలాట్ చేస్తారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలు సైతం తమకు అనుకూలంగా ఉండే వారినే నియోజకవర్గాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు.. రెవెన్యూ అధికారుల బదిలీల ప్రక్రియ తుది అంకానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 81మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులను (ఆర్డీవోలుగా) ఇటీవల కల్పించింది. ప్రస్తుతం 21 మందికి అవకాశం కల్పించింది. వారి సర్దుబాటు ప్రక్రియ పూర్తికాగానే తహసీల్దార్ల బదిలీలపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) యాదిరెడ్డి, మూడు డివిజన్ల ఆర్డీవోలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రిటర్నింగ్ అధికారులుగా ఆర్డీవోలు, అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారులుగా తహసీల్దార్లు వ్యవహరించనున్నారు. ఇంకా సమాచారం లేదు.. తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు సీసీఎల్ఏ నుంచి వస్తాయి. బదిలీ ఉత్తర్వులు ఎప్పుడిస్తారో సమాచారం లేదు. – యాదిరెడ్డి, అదనపు కలెక్టర్, నిజామాబాద్ -
బదిలీల దుమారం
పైరవీలకు పెద్దపీట వేశారని తహసీల్దార్ల ఆగ్రహం రద్దు చేయాలని డిమాండ్ తహసీల్దార్ల బదిలీ వ్యవహారం జిల్లా యంత్రాంగంలో దుమారం రేపుతోంది. రెండ్రోజులు సుదీర్ఘంగా కసరత్తు చేసి గత బుధవారం సాయంత్రం జిల్లాలో 30మంది తహసీల్దార్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే బదిలీల తంతు పారదర్శకంగా జరగలేదని, పైరవీలకు పెద్దపీట వేశారంటూ పలువురు తహసీల్దార్లు ఆందోళనకు దిగారు. నిబంధనలకు పాతరేస్తూ.. ఒక వర్గానికి అనుకూలురైన తహసీల్దార్లకు పట్టణ ప్రాంతంలో పోస్టింగులిచ్చారంటూ రచ్చకు దిగారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలోనూ ఇదే తరహాలో బదిలీలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు ఆయా బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా తహసీల్దార్ల సంఘం నేతలు రాష్ట్ర సంఘ నేతలను వెంటబెట్టుకుని మంత్రుల వద్దకు వెళ్లారు. రద్దు చేయకుంటే ఉద్యమమే.. బదిలీలను వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులతో పాటు తహసీల్దార్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బదిలీలను రద్దు చేసి ఎన్నికలకు ముందు పనిచేసిన స్థానాల్లోనే తమకు పోస్టింగ్ ఇవ్వాలంటున్నారు. ఎన్నికలకు ముందు ఏయే స్థానాల్లో పనిచేసిన ఎంపీడీఓలకు తాజాగా అవే స్థానాలు కట్టబెట్టడాన్ని పేర్కొంటూ.. తమకూ పనిచేసిన స్థానాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీని, మంత్రి కేటీఆర్‌లను కలిసి పరిస్థితి వివరించారు. రెండ్రోజులు గడువిస్తే పరిస్థితి చక్కదిద్దుతామని అమాత్యులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రెండ్రోజుల్లో తేల్చకుంటే తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు, టీఎన్జీఓలు, నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నేతలంతా సమ్మెకు దిగుతారని టీజీఓ జిల్లా అధ్యక్షుడు కె.రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. -
అంతా మా ఇష్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నారు.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పనికానిచ్చేద్దామని అనుకుంటున్నారు.. ఎన్నికల కోసం అనుకూల అధికారులు కావాలనుకుంటున్నారు.. వెరసి... జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కన్ను తహశీల్దార్లపై పడింది. అధికార పార్టీ నేతలు కోరడం చాలు.. అన్నీ చేసిపెట్టే ఉన్నతాధికారి ఎలాగూ ఉన్నారు. ఇంకేముందీ.. జిల్లాలో తహశీల్దార్ల బదిలీల జాతర మొదలైంది. ఆ తీరు ఇదిగో ఇలా ఉంది. ప్రజాప్రతినిధులు తాన.. ఉన్నతాధికారి తందాన... కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభీష్టానికి అనుగుణంగా తహశీల్దార్ల బదిలీల ప్రహసం మొదలైంది. అధికారులను ఎంపిక చేసుకుని మరీ వారినే నియమించాలని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. చెప్పింది తు.చ. తప్పకుండా పాటించే అధికారులనే ఏరికోరి పోస్టింగ్ వేయించుకుంటున్నారు. నిబంధనల మేరకు పనిచేస్తామనే అధికారులపై బదిలీ వేటు వేయిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారి తీరు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంది. జిల్లాలో కొనసాగడంపై పట్టుదలగా ఉన్న ఆయన.. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్నారు. తాను జిల్లాలో ఉంటే చాలు.. అధికార యంత్రాంగం మానసిక స్థైర్యం దెబ్బతిన్నా ఫర్వాలేదన్న రీతిలో సదరు ఉన్నతాధికారి వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిందే తడవుగా బదిలీలు చేసేస్తున్నారు. దీంతో తహశీల్దార్ల బదిలీ అంతా రాజకీయ ప్రహసనంగా మారిపోయింది. అదెలాగంటే.. అన్నా! అన్నన్నా..! గిద్దలూరులో ఇష్టారాజ్యం గిద్దలూరు ప్రజాప్రతినిధి తహశీల్దార్ల నియామకం అంతా తన ఇష్టారాజ్యంగా మార్చుకున్నారు. గత రెండు వారాల్లో ఆ నియోజకవర్గంలో ఏకంగా ఆరుగురు తహశీల్దార్లను బదిలీ చేయడం గమనార్హం. పూర్తిగా తనకు అనుకూల అధికారులను నియమించేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రభావితం చేశారు. అసైన్మెంట్ కమిటీలో తన మాట వినలేదనే ఆగ్రహంతో కొమరోలు తహశీల్దార్‌ను ఆయన పట్టుబట్టి మరీ బదిలీ చేయించినట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌లో పనిచేస్తున్న అధికారికి తన నియోజకవర్గంలోని రాచర్లలో పోస్టింగ్ ఇప్పించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా మిగిలిన ఐదుగురిలో నలుగురి బదిలీలు ఆయన అభీష్టం మేరకే జరిగాయి. గతంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారికి ఆయన ఏరికోరి తన నియోకజవర్గంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. కొమరోలుకు తాజాగా బదిలీ చేసిన తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి అయిష్టంగా ఉన్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కనిగిరిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దని చెప్పిన ఆయన్ను తన నియోజకవర్గంలో ఎందుకు వేశారని సదరు ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని మార్చి బేస్తవారిపేట తహశీల్దార్కే కొమరోలు అదనపు బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కనిగిరిలో అంతా కిరికిరే! అధికారులపై ‘ఉగ్ర’తాండవం కనిగిరి నియోజకవర్గంలో తహశీల్దార్ల బదిలీల ప్రక్రియ అంతా రాజకీయ కిరికిరిగా మారిపోయింది. నియోజకవర్గంలో ఐదుగురు తహశీల్దార్లను ఈ రెండు వారాల్లో బదిలీ చేయడం గమనార్హం. అధికార పార్టీ ప్రజాప్రతినిధి హుకుం మేరకు జిల్లా ఉన్నతాధికారులు వ్యవహరించారు. అసైన్మెంట్ భూములు, ప్లాట్ల కేటాయింపు విషయంలో నిబంధనల మేరకు వ్యవహరించినందున వెలిగండ్ల తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి కినుక వహించారు. ఫలితం.. ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇలా నియోజకవర్గంలో కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి, పామూ రు తహశీల్దార్లను మార్చారు. అంతటితో ఆ ప్రజాప్రతినిధి సరిపుచ్చుకో లేదు. పీసీపల్లి తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు కూడా తాను ఇటీవల నియమించుకున్న పొరుగు మండల తహశీల్దార్‌కు అప్పగించాలని పట్టుబడుతున్నారు. అంతా నా ఇష్టం.. అన్న రీతిలో ఆ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. అద్దంకిలో మేడమ్ అనుచరులదే హవా కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అనుచరులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. అందుకు సంతమాగులూరు తహశీల్దార్ బదిలీ తీరే నిదర్శనం. సంతమాగులూరు తహశీల్దార్‌గా ఉన్న నాసరయ్యను మార్చి టి.ప్రశాంతిని నియమించారు. దీనిపై పనబాక లక్ష్మి అనుచరులు భగ్గుమన్నారు. జిల్లా ఉన్నతాధికారిపై చిందులు తొక్కారు. దాంతో రోజుల్లోనే అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సంతమాగులూరు తహశీల్దార్ టి.ప్రశాంతిని బదిలీ చేసి అధికార పార్టీ నేతల ఆగ్రహాన్ని చల్లార్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇంతటితో సరిపుచ్చుకోలేదు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా రంగప్రవేశం చేశారు. తమ అనుకూల అధికారులను నియమించాలని పట్టుబడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ లక్ష్యాలతో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.