M.S. Dhoni: The Untold Story
-
ఇప్పటికీ నేను చాలా చిన్నదాన్ని: నటి
ముంబై: లోఫర్ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన భామ దిశా పటానీ. ఆ మూవీ ఆమెకు అంతగా కలిసిరాకపోవడంతో వెంటనే బాలీవుడ్ బాట పట్టింది. భారత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ జీవిత కథాంశం ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ'లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు జోడీగా నటించింది. ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని మీడియా ప్రశ్నలకు తన మనసులో మాట బయటపెట్టింది. బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోకరమైన విషయం. సినిమాలు సక్సెస్ అవుతాయి.. ఫెయిల్ అవుతాయి.. వాటి గురించి అంతగా పట్టించుకోను. అయినా సూపర్ స్టార్ అయిపోవాలని నేను కలల కనలేదుగా అంటోంది ఈ ముద్దుగుమ్మ. 'మూవీలలో నటించడమే నా పని. కెమెరా ముందుకు రాగానే మెరుగ్గా నటించేందుకు ప్రయత్నిస్తాను. ఇంకా చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీకి నేను చాలా చిన్నదాన్నే. బాలీవుడ్ లో కేవలం ఒకే మూవీ చేశాను. దిగ్గజ నటుడు జాకీచాన్ తో నటించిన 'కుంగ్ ఫు యోగా' వచ్చే జనవరి 28న విడుదల అవుతుంది. మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అదే ఫార్ములాను ఎప్పటికీ ఫాలో అవుతాను' అని దిశా పటానీ చెప్పుకొచ్చింది. -
రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ బయోపిక్!
ముంబై: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్లో రూ.66 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తొలిరోజు 21.30 కోట్ల రూపాయలు రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కూడా భారీ కలెక్షన్లు ఉండటంతో మొత్తంగా రూ.66 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ పేర్కొన్నారు. దాంతో 2016లో చిత్ర ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచినట్లు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ ట్వీట్ చేశారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'సుల్తాన్' అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. 'ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, సుషాంత్ సింగ్ రాజ్ పుట్ టైటిల్ రోల్ ను పోషించాడు. -
సినిమా సెట్ కు ఎంఎస్ ధోని..
ముంబై: భారతీయ చలన చిత్ర సీమలో క్రీడాకారుల జీవిత కథల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు క్రీడాకారులు జీవిత గాథలు సినిమాలుగా వచ్చి భారీ సక్సెస్ రేట్ ను అందుకున్నాయి. ఈ కోణంలో రూపొందుతున్న మరో చిత్రమే 'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ'. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కాగా, తన జీవిత చరిత్రను తెరపైకి ఎక్కించే విధానాన్ని ఒకసారి స్వయంగా చూసుకోవాలని భావించిన ధోని.. ఆ సినిమా సెట్ కు వెళ్లి సందడి చేశాడు. ఆ సినిమాలో ఆన్ స్క్రీన్ ధోని పాత్ర పోషిస్తున్నహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , కెమెరామెన్ లారాతో కలిసి ఫోటో దిగాడు. ఈ విషయాన్నిఆ చిత్రంలో ధోని తండ్రి పాత్ర చేస్తున్నప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తమ సినిమా సెట్ కు ధోని రావడంతో మొత్తం యూనిట్ చాలా సంతోషంగా ఉందని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది.