muchukota
-
జేసీకి పెద్దారెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం : జేసీ బ్రదర్స్ ఒత్తిడితోనే తన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారని తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రైతుల కోసం పాదయాత్ర చేస్తే జేసీ బ్రదర్స్‌కి ఎందుకింత ఉలికిపాటు అని విమర్శించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలకు ఓటమి భయం పట్టుకుందని పెద్దారెడ్డి అన్నారు. జేసీ దివాకర్ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. పోలీసులు జేపీ బ్రదర్స్ తొత్తులుగా మారారని పెద్దారెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి పోలీసులకి ఎస్పీ ఆదేశాలకన్నా జేసీ బద్రర్స్ ఆశీస్సులే ముఖ్యమని విమర్శించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దగ్గరుండి మరీ దాడులు చేయించారని ఆరోపించారు. జేసీ దివాకర్‌పై కేసు నమోదు చేయాలంటే పోలీసులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడంలో టీడీపీ విఫలమయిందని దుయ్యబట్టారు. జేసీ బ్రదర్స్‌ని ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దారెడ్డి పాదయాత్ర.. తాడిపత్రిలో ఉద్రిక్తత -
కట్టి వదిలేశారంతే!
పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ఉన్న ముచ్చుకోట రిజర్వాయర్‌ను ప్రారంభించి దాదాపు 30 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు నీటి కేటాయింపులు లేవు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు దాని గురించే పట్టించుకోకపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. మండలంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌ను అప్పట్లో దాదాపు రూ.కోటి వ్యయంతో నిర్మించారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దీనిని ప్రారంభించారు. దీనికోసం దాదాపు 300 ఎకరాలు సేకరించారు. నార్పల మండలం తుంపెర డెలివరీ పాయింట్ నుంచి సుబ్బరాయసాగర్‌కు, అక్కడి నుంచి ముచ్చుకోటకు నీరు వస్తుంది. ఇది నిండితే పెద్దపప్పూరులోని ముచ్చుకోట, వరదాయపల్లి, చిక్కేపల్లి, నామనాంకపల్లి, షేక్‌పల్లి గ్రామాలతోపాటు పుట్లూరు మండలంలోని పలు గ్రామాలకు భూగర్భజలాలు పెరిగి తాగునీరు, సాగునీరు అందుతుంది. కానీ నీరన్నదే లేక నిరుపయోగంగా మారడంతో రిజర్వాయర్ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇప్పటికే రాతిబండింగ్(రాతికట్టడం) కృంగిపోయింది. రిజర్వాయర్‌కు నీరు చేరే కాలువ కూడా దెబ్బతింది. ముళ్లపొదలతో నిండిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలానే వదిలేస్తే ఇది ఎందుకూ పనికి రాకుండా పోతుందని మండలంలోని ఆయా గ్రామాల రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు నిండా నీరు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరు విడుదల చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. నీరు విడుదల చేయాలి రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి నీటి కేటాయింపులు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణం ఎందుకూ ఉçపయోగపడకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరివ్వాలి. – మల్లికార్జున, ముచ్చుకోట -
యువకుడి ఆత్మహత్య
పెద్దపప్పూరు: ముచ్చుకోట గ్రామానికి చెందిన హరిచంద్ర (23) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన సత్యనారాయణ కొడుకు హరిచంద్ర చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడేవాడు. బెంగుళూరు, హైదరాబాద్, కర్నూలు నగరాల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు నిందితుల అరెస్టు
పెద్దపప్పూరు (తాడిపత్రిరూరల్) : చెడు వ్యసనాలకు అలవాటు పడి ఛీటింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ముచ్చుకోట గ్రామ సమీపంలో వారం రోజుల క్రితం పోలీస్ డ్రెస్ వేసుకుని వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేసిన షేక్‌పల్లికి చెందిన ఆదినారాయణరెడ్డిని, నారపురానికి చెందిన కాకార్ల రంగనాయకులును ముచ్చుకోట సమీపంలోనే అరెస్టు చేసినట్లు పెద్దపప్పూరు ఎస్ఐ శ్రీహర్ష శనివారం విలేకరులకు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,30,000లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.