Muddanur
-
వైఎస్సార్ సీపీనేత మునిరాజారెడ్డి వర్గీయులపై టిడిపి రాళ్లదాడి
-
నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల..
సాక్షి, సత్యసాయి జిల్లా: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల నెరవేరబోతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు నాలుగు లేన్ల రహదారి (ఫోర్‌లేన్)కు శ్రీకారం చుట్టారు. టెండర్ల దశకు రాగానే ఆయన మరణించారు. దీంతో ఇది మరుగున పడింది. తాజాగా ముద్దనూరు నుంచి తొండూరు, పులివెందుల, శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ఓడీ చెరువు, గోరంట్ల మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు ఇప్పుడున్న రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరింపజేసేందుకు వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మధ్యే ఆమోదం కూడా తెలిపింది. భూ సేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దాదాపు 160 కి.మీ ఉన్న ఈ ఫోర్‌లేన్ పనులు రూ.2 వేల కోట్లతో మొదటి దశలో రెండు ప్యాకేజీల ద్వారా మొదలెడతారు. దీనికి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) కూడా ఆమోద ముద్ర వేసింది. రెండో దశలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు.. గోరంట్ల నుంచి హిందూపురం వరకు నాలుగు లేన్ల రహదారిగా విస్తరింపజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రహదారిని ఇప్పటికే జాతీయ రహదారి(716జీ)గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఫోర్‌లేన్ పనులు రెండో దశలో చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.700 కోట్లు ఖర్చు కావచ్చని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. చదవండి: అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు సైతం.. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు డబుల్‌లేన్‌గా విస్తరించనున్నారు. 32 కి.మీ మేర ఉన్న ఈ జాతీయ రహదారి– 342ని రూ.401 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించేందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాయచోటి నుంచి కదిరి వరకు డబుల్ లేన్.. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి వరకు 70 కి.మీ మేర ఉన్న రహదారిని డబుల్‌లైన్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకు టెండర్ల దశ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు మొదలెట్టనున్నారు. దీన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని ఇటీవల రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణం సులభతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఈపాటికి ముద్దనూరు – కొడికొండ రహదారి ఫోర్‌లేన్‌గా ఎప్పుడో మారేది. ఆయన తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. కానీ రోడ్డుకు మోక్షం కలగలేదు. ఇన్నేళ్లకు వైఎస్ తనయుడు జగన్ తన తండ్రి కలను సాకారం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే బెంగళూరుకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. – నాదిండ్ల రవి రాయల్, కదిరి రూపురేఖలు మారతాయి 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కదిరికి రింగ్ రోడ్ అన్నాడు. తర్వాత ఆ ఊసే లేదు. ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదు. ఒక్క అభివృద్ది పనీ లేదు. ముద్దనూరు – కొడికొండ నాలుగు లేన్ల రహదారి కోసం భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుంది. పనులు కూడా వెంటనే మొదలవుతాయి. నూతనంగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో అనతి కాలంలోనే రహదారుల రూపురేఖలు మారిపోతాయి. – డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి -
పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, వైఎస్సార్ కడప : పులివెందులలోని ముద్దనూరులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి మూడు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళ రైతు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులంతా పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామస్థులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన వారు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు, రైతు కూలీలుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ గాయకుడు మృతి -
బస్సులో రచ్చ, టీడీపీ నేతబంధువు వీరంగం
సాక్షి, ముద్దనూరు: టీడీపీ ప్రజాప్రతినిధి బంధువు ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రచ్చ రచ్చ చేసిన వైనమిది. బస్సెక్కి మెట్లపై నిలబడిన తనను లోపలికి రమ్మని పిలిచినందుకు ఆగ్రహించి.. సిబ్బందితో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక తన బంధువులను రప్పించి బస్సు డ్రైవర్‌ను తమ వాహనంలో బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. తప్పించుకున్న డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. ఎమ్మెల్సీ బీటెక్ రవికి చెందిన సమీప బంధువు చంద్రశేఖరరెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి పులివెందులకొస్తున్న ఓవీఆర్ ట్రావెల్స్ బస్సు ఎక్కి మెట్లపై నిలబడ్డాడు. సడన్ బ్రేక్ వేసినప్పుడు ప్రమాదం జరిగే వీలుందంటూ క్లీనర్ ఆయన్ను లోపలికి రమ్మని పిలిచాడు. దీంతో ఆగ్రహించిన సదరు ఎమ్మెల్సీ బంధువు క్లీనర్‌పై పరుషపదజాలంతో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో తీవ్రంగా భయపడిన క్లీనర్ బస్సు కర్నూలుకు రాగానే దిగి వెళ్లిపోయాడు. ఈలోగా చంద్రశేఖరరెడ్డి సమాచారమివ్వడంతో అతని బంధువులు స్కార్పియో వాహనంలో వచ్చి.. బస్సు ముద్దనూరు సమీపంలోకి రాగానే అడ్డుకున్నారు. స్కార్పియోలో ఉన్న సునీల్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రఫీలతోపాటు చంద్రశేఖరరెడ్డిలు బస్ డ్రైవర్ శ్రీనివాసులును బలవంతంగా దించేసి.. వాహనంలో తమ వెంట తీసుకుపోయారు. వాహనం సింహాద్రిపురం సమీపంలోకి రాగానే శ్రీనివాసులు కేకలేయడంతో అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే డ్రైవర్ ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు చంద్రశేఖరరెడ్డితోపాటు సునీల్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రఫీలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
లాఠీ పట్టిన రైతు బిడ్డ
సాక్షి, ముద్దనూరు : రైతు బిడ్డ లాఠీ పట్టింది. ఫ్యాక్షన్ గ్రామంగా ముద్ర పడిన ఊరి నుంచి పోలీసుశాఖలో సివిల్ ఎస్ఐ ఉద్యోగం సాధించిన బుట్టెయ్యగారి భారతి శభాష్ అనిపించుకుంటోంది. ముద్దనూరు మండలంలోని కొర్రపాడు ఫ్యాక్షన్ గ్రామంగా ముద్రపడింది. ఈ గ్రామంలో నివసించే చెన్నకేశవరెడ్డి, సుజాత దంపతుల మొదటి సంతానం భారతి. ఈమె తండ్రి చెన్నకేశవరెడ్డి కొర్రపాడులో సాధారణ రైతు. ఆయన కష్టం చూసిన భారతి పట్టుదలతో క్రమశిక్షణతో చదివింది. ఇటీవలే రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో కానిస్టేబుల్‌గా కూడా ఎంపికైంది. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరకుండానే ఎస్ఐ ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటూ ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తుచేసి మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికైనట్లు భారతి తెలిపారు. ఈమె 10వ తరగతి స్వగ్రామమైన కొర్రపాడులో, ఇంటర్మీడియట్, డిగ్రీ పులివెందులలో పూర్తి చేసింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన తమ బిడ్డ పోలీసుశాఖలో ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని భారతి తల్లిదండ్రులు సుజాత, చెన్నకేశవరెడ్డిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కారుకొందామని వెళుతూ.. మృత్యు ఒడికి
ఎంత జాగ్రత్తగా ప్రయాణిస్తున్నా బలీయమైన విధికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు తప్పిదం లేకున్నా.. ముందువైపు వెళుతున ట్రాక్టర్ నుంచి ఒక భాగం ఊడి పడటం..వెనుకనే వస్తున్న టిప్పర్ దాన్ని తప్పించే ప్రయత్నంలో రాంగ్ రూట్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొంది. కారుపై టిప్పర్ పడి నుజ్జునుజ్జు కావడంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడే దుర్మరణం చెందారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్దనూరు: మండలంలోని తిమ్మాపురం క్రాస్ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కడప పట్టణానికి చెందిన నవాజ్ అలీఖాన్(40), మహమ్మద్ జావీద్(42), తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన దిలీప్‌కుమార్(22)లు దుర్మరణం చెందగా, దిలీప్ కుమార్ తండ్రి శ్రీనివాసులు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. కడపకు చెందిన అలీఖాన్, జావీద్‌లు వారి స్నేహితుడు శ్రీనివాసులు కుమారుడు దిలీప్‌కుమార్‌కు కారును కొనుగోలు చేయడానికి అనంతపురం పట్టణానికి కారులో బయలుదేరారు. ముద్దనూరు నుంచి కంకర రాళ్ల లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్ తిమ్మాపురం క్రాస్ సమీపానికి వస్తుండగా టిప్పర్‌కు ముందువైపు వెళుతున్న ట్రాక్టర్‌కు అకస్మాత్తుగా హోసింగ్ ఊడిపోయి రోడ్డుపై పడింది. వెనుకనే వస్తున్న టిప్పర్ వేగంగా ట్రాక్టర్ నుంచి ఊడిపోయిన విడిభాగాన్ని ఢీకొంది. దీంతో డ్రైవరు టిప్పర్‌ను పూర్తిగా కుడివైపుకు తిప్పాడు. అలా దూసుకెళ్లిన టిప్పర్ అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. కారుతో సహా టిప్పర్ రహదారి పక్కలో లోతట్టు ప్రాంతంలోకి పడిపోయింది. కారుమీద టిప్పర్ పడడంతో అందులో ఉన్న శ్రీనివాసులు తప్ప ముగ్గురు కారులోనే మృతిచెందారు. సుమారు ఒక గంట పాటు పోలీసులు, స్థానికులు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. కారులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలైన శ్రీనివాసులును ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఓఎస్డీ నయీం అస్మీ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవరు రామాంజినేయులు వాహనం నుంచి హోసింగ్ ఊడిపడగానే సీటులో నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలను బలిగొన్న టిప్పర్ తెలుగుదేశం పార్టీ నాయకులైన పోట్లదుర్తి బ్రదర్స్ కంపెనీకి చెందినదిగా తెలుస్తోంది. డీఎస్పీ కృష్ణన్, సీఐ చిన్నపెద్దయ్య, ఎస్ఐ రాజారెడ్డిలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. శోకసంద్రంలో బంధువులు కడప అర్బన్ : జిల్లాలోని ముద్దనూరు పోలీసుస్టేషన్ పరిధిలోని తుమ్మలూరు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వారిలో కడప నగరం ఐటీఐ సర్కిల్ సమీపంలో నివసిస్తున్న నవాజ్ అలీ, అతని స్నేహితుడు మహమ్మద్ జావిద్‌లు ఉన్నారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడప నగరం నుంచి హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేసుకున్న తర్వాత మృతదేహాలను ముద్దనూరు పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ముద్దనూరు: మండలంలోని చింతకుంట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఏసన్న(32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏఎస్ఐ జయరాముడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం ఆర్కే నగర్లో నివసిస్తున్న ఏసన్న 10 సంవత్సరాల క్రితం చింతకుంట గ్రామానికి చెందిన రాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఏసన్న మద్యం సేవించి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ గొడవ భరించలేక రాణి వారం రోజుల క్రితం పుట్టినిల్లు చింతకుంటకు వచ్చింది. భార్య రాణి కోసం ఏసన్న కడప నుంచి సోమవారం సాయంత్రం చింతకుంటకు చేరుకున్నాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో చింతకుంటలో ఇంటిబయట అరుగుపై పడిపోయి ఉన్న ఏసన్న మృతి చెందినట్లు బంధువులు గుర్తించారు. ఏసన్న తల్లిదండ్రులు, బంధువులు చింతకుంట చేరుకుని తమ కుమారుని మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయడంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ముద్దనూరులో ఉద్రిక్తత
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. చౌటుపల్లి ముంపువాసులను కలిసేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేత డా. సుధీర్ రెడ్డిని ముద్దనూరు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పరిహారం చెల్లించకుండానే ముంపు గ్రామాలను నిర్బంధంగా ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. -
ఐసీడీఎస్ చెంతకు చిన్నారులు
కడప రూరల్ : ముద్దనూరుకు చెందిన లక్ష్మిదేవి ఈ ఏడాది ఉగాది రోజున కొన్ని కారణాల వల్ల కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ప్రైవేటు జీపు డ్రైవర్‌గా పని చేస్తున్న ఆమె భర్త శంకర్ మానసిక వేదనతో ఇటీవల మృతి చెందాడు. ఫలితంగా ఆ దంపతుల పెద్ద కుమార్తె వైశాలి (7), చిన్న కుమార్తె గౌరీప్రియ (3) అనాథలుగా మారారు. వీరిపై ‘సాక్షి’లో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. ముద్దనూరుకు చెందిన సూపర్వైజర్ లక్ష్మిప్రియ, కార్యకర్త విజయదుర్గ ఆ చిన్నారులను శుక్రవారం కడప ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావుకు అప్పగించారు. బంధువుల రంగప్రవేశం అయితే ఆ చిన్నారుల బంధువులు తాము పోషిస్తామంటూ ముందుకు వచ్చారు. ఆ మేరకు ప్రాజెక్టు డైరెక్టర్ వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. తమ బాలసదన్‌లో ఈ చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. అయినా వారు వినలేదు. ఈ చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగిస్తామని, వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని పీడీ తెలిపారు. -
నీటి గుంతలో జారి పడి వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె గ్రామ పరిధిలో ఆర్టీపీపీకి వెళ్లే మార్గంలో ఉన్న నీటి గుంత వద్దకు కాళ్లకు అయిన మట్టిని కడుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పొరబాటున జారి గుంతలో పడి మృతి చెందాడు. మృతుడు భార్య భువనేశ్వరి, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు ... ముద్దనూరు మండలం నల్లబల్లె గ్రామానికి చెందిన గుగ్గల సుదర్శనరెడ్డి(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య భువనేశ్వరి ఉన్నారు. ఇంటికి ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకునేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నల్లబల్లె గ్రామం నుంచి ప్రొద్దుటూరుకి సున్నపురాళ్లపల్లె మీదుగా బయలుదేరాడు. సున్నపురాళ్లపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే వంతెన కింద బురద నీరు ఉంది. ఆ బురద నీటిలో నుంచి అలాగే వెళ్లడంతో సుదర్శనరెడ్డి కాళ్లకు బురద అయింది. ఈ బురదను కడుక్కోవడానికి సమీపంలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదశాత్తు గుంతలోకి జారి పడ్డాడు. గుంత సుమారు పది అడుగుల లోతు ఉండడంతో ఈత రాక సుదర్శన్‌రెడ్డి మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఆ దారిన వెళుతున్న ప్రయాణికులు గుంతలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కలమల్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఆచూకి గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి భార్య భువనేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కలమల్ల హెడ్ కానిస్టేబుల్ గురుశేఖర్‌రెడ్డి తెలిపారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్య
ముద్దనూరు: వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బుక్కపట్నం గ్రామానికి చెందిన పిల్లనాగన్నగారి రాజు(26) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ముద్దనూరుకు సమీపంలో శ్రీమునయ్య కోనలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. ఈనెల 4న మండలంలోని కొర్రపాడులో రాజు వివాహం జరిగింది. పెళ్లయిన 13రోజులకే మరణించడంతో బంధువులు, స్నేహితుల, తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఎస్ఐ నరసింహారెడ్డి సమాచారం మేరకు.. నాలుగున్నరేళ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు మంగళవారం మధ్యాహ్నం విధులు నిర్వహించి వెళ్లారు. తిరిగి రాత్రి 9 గంటలకు విధులకు రావాల్సి ఉంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాలేదని, సెల్‌ఫోన్ పనిచేయడం లేదని తల్లిదండ్రులు ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. పోలీసులు రాజు కోసం ఆరాతీశారు. ఆచూకీ లభించలేదు. చివరికి బుధవారం జనసంచారం లేని మునయ్యకోనలో చిన్న మిద్దెపై రాజు మృతదేహం కనిపించింది. పక్కనే 3 సీసాల పురుగుమందు దొరికింది. వీటిలో ఒకటి ఖాళీగా ఉంది. సూసైడ్ నోట్ సంఘటనా స్థలంలో లభించింది. స్థానికంగా ఎవరికీ అనుమానం రాకుండా మంగళవారం మధ్యాహ్నం పురుగుమందును ప్రొద్దుటూరుకు వెళ్లి కొనుగోలు చేసి, మూడున్నర గంటల ప్రాంతంలో ముద్దనూరు బస్సులో ఎక్కినట్లు టికెట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్లో ఆమ్మ, నాన్న, చరిత(భార్య) నన్ను క్షమించండి అంటూ తనకు బాకీ వున్న కానిస్టేబుళ్ల వివరాలు, తాను బాకీ చెల్లించాల్సిన వారి పేర్లు రాశారు. పదహారునాళ్ల పండగ కూడా జరగకుండానే రాజు మరణించడంతో బంధువులు బోరున విలపించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతుని తండ్రి సుబ్బారాయుడు ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్.ఐ నరసింహారెడ్డి తెలిపారు. సీఐ రవిబాబు మృతదేహాన్ని సందర్శించారు. -
పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి
ముద్దనూరు : వైఎస్సార్ జిల్లా ముద్దనూర్ మండలంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కురిసిన అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది. గాలివాన తాకిడికి ఆర్పీపీ రహదారిపై చెట్లు కూలి పడిపోవటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ మార్గంలోని దాదాపు నలభై వరకు స్తంభాలు కూలటంతో రాత్రి నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది. పిడుగుపాటుకు మండలకేంద్రంలోని శివాలయం వద్ద ఉన్న40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.