అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి | The Young man died in suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

Published Tue, Jan 17 2017 10:01 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ముద్దనూరు: మండలంలోని చింతకుంట గ్రామంలో  మంగళవారం తెల్లవారుజామున ఏసన్న(32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏఎస్‌ఐ జయరాముడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం ఆర్‌కే నగర్‌లో నివసిస్తున్న ఏసన్న 10 సంవత్సరాల క్రితం చింతకుంట గ్రామానికి చెందిన రాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఏసన్న మద్యం సేవించి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ గొడవ భరించలేక రాణి వారం రోజుల క్రితం పుట్టినిల్లు చింతకుంటకు వచ్చింది. భార్య రాణి కోసం ఏసన్న కడప నుంచి సోమవారం సాయంత్రం చింతకుంటకు చేరుకున్నాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో చింతకుంటలో  ఇంటిబయట అరుగుపై పడిపోయి ఉన్న ఏసన్న మృతి చెందినట్లు బంధువులు గుర్తించారు. ఏసన్న తల్లిదండ్రులు, బంధువులు చింతకుంట చేరుకుని తమ కుమారుని మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయడంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement